{పత్యేక ప్యాకేజీకి హ్యాండ్ ఇచ్చిన కేంద్రం
గట్టిగా డిమాండ్ చేయలేకపోయిన టీడీపీ
మాట మార్చిన బీజేపీ
తిరుపతి: రాయలసీమ జిల్లాలకు ఒకొక్కదానికి రూ.50 కోట్లను మాత్రమే కేంద్రం విదిల్చింది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రభుత్వం పార్లమెంట్‌లో హామీ ఇచ్చింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. ఎన్నికల తర్వాత ఇలాంటి ప్యాకేజీ ఇస్తే దేశంలో పలు ప్రాంతాలకు ఇవ్వాల్సి వస్తుందని లింకు పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీపై మాట మార్చింది. ఈ తరహా ప్యాకేజీ ఇచ్చి ఉంటే జిల్లాలో అభివృద్ధి పనులకు తొలివిడతలోనే కనీసం దాదాపు రూ.500 కోట్లకు పైగా వచ్చేవి. ప్రత్యేక ప్యాకేజీ గురించి టీడీపీ కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయలేకపోతోంది. బీజేపీ నాయకులు సైతం కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఇచ్చి మమ అనిపించింది.
పెండింగ్‌లో పలు ప్రాజెక్టులు
ప్రత్యేకంగా రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో బిల్లుపై చ ర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో తాగు, సాగు నీటితోపాటు మౌలిక వసతులు కల్పించడం కోసం భారీగా నిధులు ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం జిల్లాకు కేవలం రూ.50 కోట్ల నిధులు మాత్రమే కేటాయించడంతో అవి ఏమూలకు సరిపోయే ప్రసక్తి లేదు. ముఖ్యంగా జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రధాన ప్రాజెక్టులైన హంద్రీనీవా, గాలేరు - నగరి వంటి ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. వీటిని పూర్తి చేయడం కోసం వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ప్రభుత్వం ప్రకటించిన నామమాత్రపు నిధులతో జిల్లావాసులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా టీడీ పీ గట్టిగా కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేక హోదా లభించేలా చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
రూ.50 కోట్లు ఏ మూలకు
Published Thu, Feb 5 2015 1:48 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement