
వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఢిల్లీ: టీడీపీ నేతలు ఇంకా ప్యాకేజీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని ధ్వజమెత్తారు. టీడీపీ అంతర్గతంగా ఎన్డీయే ప్రభుత్వంలోనే ఉందని ఆరోపించారు. టీడీపీ అవిశ్వాసం అంతా డ్రామా అని తేలిపోయిందని వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలు పైకి హోదా అంటూ ప్యాకేజీ, పోలవరం నిధుల కోసం పైరవీ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి తెలియకుండా తాము బీజేపీ నేతలను కలిశామని టీడీపీ నాయకులు చెప్పడం ఒట్టి డ్రామా అని కొట్టిపారేశారు. టీడీపీ నాయకులు ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారని విమర్శించారు. తొలి నుంచి ఇప్పటిదాకా తాము ప్రత్యేక హోదాపై నిలబడ్డామని, భవిష్యత్‌లో కూడా నిలబడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment