ఏపీ బీజేపీ మంత్రుల రాజీనామాలు ఒట్టిదే! | Resignations Of AP BJP Ministers Was Not Real Says Kamineni Srinivas | Sakshi
Sakshi News home page

ఏపీ బీజేపీ మంత్రుల రాజీనామాలు ఒట్టిదే!

Published Wed, Mar 7 2018 9:07 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

Resignations Of AP BJP Ministers Was Not Real Says Kamineni Srinivas - Sakshi

సాక్షి, విజయవాడ : కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధికాముకులని మంత్రి కామినేని శ్రీనివాస్‌ కితాబిచ్చారు. కేంద్రంలో టీడీపీ మంత్రులు, ఏపీ కేబినెట్‌లోని బీజేపీ మంత్రులు రాజీనామాలు చేస్తారన్న ప్రచారం ఒట్టిదేనని తేల్చిచెప్పారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం బీజేపీ అధిష్టానమే. మా నయకులు ఏం చెయ్యమని ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే, బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవంలేదు. అన్ని పార్టీలవారితో నేను స్నేహంగా ఉంటాను. ఆ కారణం వల్లే నాపై కొన్నిసార్లు నాపై దుష్ర్పచారం జరుగుతుంది. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉంటుందా, లేదా అన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది’ అని మంత్రి కామినేని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement