రైతులను కేసీఆర్ మోసం చేశాడు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ చేస్తానని తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేశాడని కిషన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ రైతుల ఓట్ల కోసమే రుణమాఫీ హామీ ఇచ్చారని.. ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన ఆయన ప్రస్తుతం మాటమార్చడంపై కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు 2013-14 తర్వాత తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాననడం మాటమార్చడమే అని కిషన్ రెడ్డి అన్నారు.