నిలువెత్తు నిజాయితీ, నిబద్ధత, నిపు ణతకు మారు పేరుగా 32 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సేవ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మరణం అత్యంత విషాదకరం. ఆయన మృతి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజ లకూ తీరని లోటు. పరిపాలనాధికారిగా ప్రజల సమస్యలు ఆయనకు కరతలామ లకం. జన చైతన్యానికీ, నాగరికతకూ, అభివృద్ధికీ ప్రజా జీవన ప్రమాణాల శీఘ్ర పురోగతికీ కేంద్రాలయిన నెల్లూరు, గుంటూరు జిల్లా లకు ఒకప్పుడు కలెక్టర్‌గా పనిచేసిన ఆయనఆ యా జిల్లాల పరిపాలనలో తనదైన ముద్ర వేశారు.
విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, వ్యవ సాయ శాఖ కమిషనర్‌గా, ఎక్సైజ్ శాఖ కమిష నర్‌గా ఆయన తన అసమాన ప్రతిభను కన పర్చారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా పనిచేసే రోజుల్లో జిల్లాల వారిగా మద్యం వ్యాపారాన్ని రాజకీయ మాఫీయా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదో సవివరమైన నివేదికను రూపొందించి, అప్పట్లో సంచలనం సృష్టించారు.
ఆయన రూపొందించిన నివేదిక అక్షర సత్యం అనేది నేటికీ రుజువవుతున్నది. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా ఆయన రూపొందించిన వ్యూహం సత్ఫలితాలు ఇచ్చింది. 2002 – 03లో ఉమ్మడి రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర దుర్భిక్షం, కరువులను కేంద్ర పరిశీలక బృందానికి అత్యంత ప్రతిభావంతంగా వివ రించి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టగలిగారు.
ఎవరికైనా జన్నత్ హుస్సేన్ పేరు స్ఫురణకు రాగానే ఆయనలోని సౌమ్యత, ముఖంలో ఉట్టిపడే సౌహార్ద్రత కళ్లల్లో మెదలు తాయి. వినయ విధేయతలకు మారు పేరు అయిన హుస్సేన్ దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి మన్నన పొందారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి కాగానే అధికార గణం నుంచి తొలి ఎంపికగా జన్నత్ హుస్సేన్‌ను తన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు.
వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యావత్ రాష్ట్ర రైతులందరికీ ఉచిత విద్యుత్ వరాన్ని ప్రసాదిస్తూ జన్నత్ హుస్సేన్ రూపొందించిన ఫైల్‌పై తన తొలి సంతకాన్ని చేశారు. హుస్సేన్ ఉచిత విద్యు త్‌ను గట్టిగా సమర్థించేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతులకు నేటికీ ఉచిత విద్యుత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆనాడు ఉచిత విద్యుత్ ఫైల్‌పై వైఎస్‌ఆర్ తొలి సంతకం చేసే చారిత్రక సన్ని వేశానికి తొలి ప్రత్యక్ష సాక్షిగా జన్నత్ హుస్సేన్ ఎప్పటికీ చరిత్ర పుటలలో మిగిలిపోతారు.
ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారిగా... చిత్తశుద్ధిగా పనిచేసే యువ ఐఎఎస్ అధికార్లను ప్రొత్స హించారు. అపోహలతో వారిని బదిలీ చేసినప్పుడు వారికి అండగా నిలిచి వారి బదిలీలను నిలిపి వేశారు. ఇంధన కార్యదర్శిగా ఆరంగం అభివృద్ధికి పాటు పడ్డారు. పదవీ విరమణ అనంతరం ప్రధాన సమా చార కమిషనర్‌గా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో తీర్పులు ఇచ్చారు. ఇలాంటి మహో న్నతమైన వ్యక్తిత్వం కల జన్నత్ హుస్సేన్‌తో నాకు దశాబ్దాల అనుబంధం ఉన్నందుకు గర్విస్తున్నాను. ఈ గొప్ప పాలనా దక్షుడికి అశ్రు నివాళి అర్పిస్తున్నాను.
- వ్యాసకర్త ‘బీఈఈ’ మీడియా ఎడ్వైజర్, నాటి సీఎం వైఎస్ ప్రెస్ సెక్రటరీ
- ఎ. చంద్రశేఖర రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment