first signature
-
జన్మతః పౌరసత్వం రద్దు
వాషింగ్టన్: తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తన కార్యాచరణ ప్రారంభించడం గమనార్హం. గంటల వ్యవధిలోనే పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. తొలుత క్యాపిటల్ వన్ ఎరీనాలో మద్దతుదారుల సమక్షంలో, అనంతరం శ్వేతసౌధం ఓవల్ ఆఫీసులో ఆయన సంతకాలు చేయడం, మరోవైపు ఉత్తర్వులు వెలువడడం వెనువెంటనే జరిగిపోయాయి. వలసలు, వాతావరణ మార్పులు, క్షమాభిక్షలు, జన్మతః పౌరసత్వం రద్దు వంటి కీలక అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. పత్రాలపై తన సంతకాన్ని ట్రంప్ బహిరంగంగా ప్రజలకు చూపించారు. ఆ పెన్నులను ఉత్సాహంగా జనంపైకి విసిరేశారు. చరిత్రలోనే అత్యంత అధ్వాన పరిపాలన గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ట్రంప్ ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 78 విధ్వంసకర విధానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులతోపాటు ప్రపంచదేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగల నిర్ణయాలు సైతం ఉన్నాయి. కానీ, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చట్టపరమైన రక్షణ కొంతవరకే ఉంటుందని, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టబోయే అధ్యక్షులు గానీ, కోర్టులు గానీ వాటిని తిరగదోడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాలకు కోర్టుల్లో సవాళ్లు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. నూతన అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏమిటంటే... జన్మతః పౌరసత్వం లేనట్లే అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు హోల్డర్) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది. అక్రమ వలసదారులంతా వెనక్కే మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘రిమెయిన్ ఇన్ మెక్సికో విధానాన్ని ట్రంప్ పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో వేచిచూస్తున్న 70 వేల మంది నాన్–మెక్సికన్ శరణార్థులను వెనక్కి పంపించబోతున్నారు. ‘క్యాచ్ అండ్ రిలీజ్’కు శుభంకార్డు వేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి వెనక్కి పంపబోతున్నారు. శరణార్థులుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వదిలిపెట్టరు. అక్రమ వలసదార్లంతా అమెరికాను విడచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేకపోతే బలవంతంగానైనా వెళ్లగొడతారు. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకే మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో మెక్సికో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, గోడ నిర్మాణానికి స్వేచ్ఛగా నిధులు వాడుకొనే అవకాశం ట్రంప్‌కు లభించింది. డ్రగ్స్ గ్యాంగ్‌లపై ఉగ్రవాద ముద్ర అమెరికాలో చెలరేగిపోతున్న మాదక ద్రవ్య ముఠాలు, అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగ్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తూ ట్రంప్ ఉత్తర్వు జారీ చేశారు. ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలున్న జాబితాలో ఇవి చేరబోతున్నాయి. అంటే డ్రగ్స్ గ్యాంగ్‌లపై ఇక కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇంధన అత్యవసర పరిస్థితి ట్రంప్ జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చమురు నిల్వలు పెంచాలని ఆదేశించారు. శిలాజ ఇంధనాల ఉత్పత్తిని భారీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాస్కా నుంచి చమురు, గ్యాస్, ఇతర సహజ వనరులను భారీగా సమీకరించాలని పేర్కొంటూ ఉత్తర్వుపై సంతకం చేశారు. హరిత ఉద్యోగాల(గ్రీన్ జాబ్స్) కల్పనకు జో బైడెన్ తీసుకొచ్చిన గ్రీన్ న్యూ డీల్‌ను నిలిపివేశారు. టిక్‌టాక్ మరో 75 రోజులు అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ తీసుకొచ్చిన చట్టం అమలును ట్రంప్ 75 రోజులపాటు వాయిదా వేశారు. చైనాకు చెందిన టిక్‌టాక్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టిక్‌టాక్‌ను తొలుత వ్యతిరేకించిన ట్రంప్ తర్వాత సానుకూలంగా మారిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఈ మాధ్యమాన్ని చక్కగా వాడుకున్నారు. కొత్త నియామకాలకు చెల్లు! అమెరికా సైన్యంతోపాటు కొన్ని ఇతర విభాగాల్లో తప్ప ప్రభుత్వంలో కొత్త నియామకాలు చేపట్టవద్దని ట్రంప్ తేలి్చచెప్పారు. ప్రభుత్వంపై ట్రంప్ పూర్తి పట్టుసాధించేదాకా నియామకాలు ఉండవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసులకు కచ్చితంగా హాజరై విధులు నిర్వర్తించాల్సిందేనని, ఇంటి నుంచి పనిచేసే వెలుసుబాటు ఎవరికీ ఉండదని ట్రంప్ స్పష్టంచేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరణ దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరిస్తూ, ప్రభుత్వ సెన్సార్íÙప్ను నియంత్రిస్తూ ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. జో బైడెన్ హయాంలో డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వంటి సంస్థల సాగించిన కార్యకలాపాలపై విచారణ జరపాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. విదేశాలకు సాయం నిలిపివేత విదేశాలకు ఆర్థిక సాయం తాత్కాలికంగా నిలిపివేస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు సహాయం అందించే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు. ‘అమెరికా ఫస్ట్’ విదేశాంగ విధానంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వెనెజ్వెలాపై ఆంక్షలు పునరుద్ధరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితాలో క్యూబాను మళ్లీ చేర్చారు. పౌరుల జీవన వ్యయం తగ్గింపు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పౌరుల జీవన వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు, ఆరోగ్య సంరక్షణ, గృహోపకరణాలు, నిత్యావసరాలు, ఇంధనం ధరలు తగ్గించాలన్నారు. దీనిపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని చెప్పారు. జీవన వ్యయం ఏ మేరకు తగ్గిందో 30 రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఇకపై గల్ఫ్ ఆఫ్ అమెరికా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని ట్రంప్ స్పష్టంచేశారు. అలాస్కాలోని మౌంట్ డెనాలీ పేరును మౌంట్ మెక్కిన్లీగా మార్చాలన్నారు. వాస్తవానికి మౌంట్ మెక్‌కిన్లీ పేరును బరాక్ ఒబామా హయాంలో మౌంట్ డెనాలీగా మార్చారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నుల మోత కెనడా, మెక్సికో నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పన్ను లు పెంచాలని ట్రంప్ ఆదేశించారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలతో వాణిజ్య సంబంధాల్లో అనైతిక పద్ధతులపై సమీక్ష నిర్వహించాలన్నారు. ట్రాన్స్జెండర్లకు చేదు వార్త లింగ మార్పిడి చేయించుకున్నవారికి ట్రంప్ చేదువార్త చెప్పారు. అమెరికాలో ఇకపై పురుష, మహిళ అనే రెండు లింగాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, మూడో లింగాన్ని గుర్తించడం లేదని స్పష్టంచేశారు. మహిళలు గానీ, పురుషులు గానీ లింగ మార్పిడి చేయించుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మద్దతుదారులకు క్షమాభిక్ష 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి కేసులో నిందితులైన తన మద్దతుదారులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించేశారు. దోషులుగా తేలినవారికి విముక్తి కల్పించారు. జైలుశిక్షలు సైతం రద్దు చేశారు. మొత్తానికి ట్రంప్ దాతృత్వం వల్ల 1,500 మందికిపైగా నిందితులు/దోషులు కేసుల నుంచి బయటపడ్డారు. పోలీసులతో ఘర్షణకు దిగి బీభత్సం సృష్టించినవారందరిపై ట్రంప్ కరుణ చూపారు. వారిపై నమోదైన కేసులన్నీ ఒక్క కలంపోటుతో రద్ద య్యాయి. ఇప్పటికే జైలుపాలైన వారంతా ఇక బయటకు రాబోతున్నారు.వలస నేరగాళ్లకు మరణ శిక్ష ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చి నేరాలకు పాల్పడివారికి మరణశిక్ష విధించబోతున్నారు. అమెరికాలో ఇటీవల మరణశిక్షలు విధించలేదు. ట్రంప్ వాటిని పునరుద్ధరిస్తున్నా రు. హత్యలు చేసినవారికి మరణశిక్ష విధి స్తారు. అలాగే యూఎస్ శరణార్థి సెటిల్మెంట్ ప్రోగ్రామ్‌ను ట్రంప్ రద్దు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్బైప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు ట్రంప్ గుడ్‌బై చెప్పేశారు. డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా తప్పుకొనే ప్రక్రియ ప్రారంభమైనట్లే. ఇది చాలా పెద్ద నిర్ణయమని ఆయన అభివర్ణించారు. 2020లో కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో డబ్ల్యూహెచ్ఓ వ్యవహార శైలి పట్ల ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా పట్ల ఆ సంస్థ స్పందన సక్రమంగా లేదని విమర్శించారు. చైనా పట్ల పక్షపాతం చూపుతోందని మండిపడ్డారు. ట్రంప్ తాజా నిర్ణయంపై డబ్ల్యూహెచ్ఓ విచారం వ్యక్తంచేసింది.పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వెనక్కిచరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటోంది. తద్వారా వాతావరణ మార్పులను నియంత్రించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషికి భారీ విఘాతం కలగబోతోంది. పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 2017లో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ, మళ్లీ ఆ ఒప్పందంలో భాగస్వామిగా చేరారు. ఏమిటీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్? అమెరికా ప్రభుత్వాన్ని శీఘ్రగతిన సంస్కరించడానికి, పరిపాలనను పరుగులు పెట్టించడానికి డొనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న మార్గం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాంగ్రెస్ అనుమతి లేకుండానే అధ్యక్షుడు కొన్ని నిర్ణయాలు తీసుకొనే అధికారం ఇలాంటి ఉత్తర్వుల ద్వారా లభిస్తుంది. అయితే, కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వం ఎలా వ్యవహరించాలని అధ్యక్షుడు కోరుకుంటాడో ఆ మేరకు కొన్ని స్టేట్మెంట్లపై సంతకాలు చేస్తాడు. ఆ స్టేట్మెంట్లను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఉంటారు. ఇలాంటి ఆర్డర్లు ఒక రకంగా సలహాలు, విజ్ఞప్తుల్లాంటివే. కొన్ని ఆర్డర్లను సవాలు చేయడానికి వీల్లేదు. కొన్నింటిని కోర్టుల్లో సవాలు చేయొచ్చు. కాంగ్రెస్ లేదా కోర్టులు ఇలాంటి ఉత్తర్వులను నిలిపివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. -
Big Question: మోదీని పక్కకు నెట్టి చంద్రబాబు నయా మోసం
-
వైఎస్ తొలి సంతకానికి తొలి సాక్షి
నిలువెత్తు నిజాయితీ, నిబద్ధత, నిపు ణతకు మారు పేరుగా 32 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సేవ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మరణం అత్యంత విషాదకరం. ఆయన మృతి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజ లకూ తీరని లోటు. పరిపాలనాధికారిగా ప్రజల సమస్యలు ఆయనకు కరతలామ లకం. జన చైతన్యానికీ, నాగరికతకూ, అభివృద్ధికీ ప్రజా జీవన ప్రమాణాల శీఘ్ర పురోగతికీ కేంద్రాలయిన నెల్లూరు, గుంటూరు జిల్లా లకు ఒకప్పుడు కలెక్టర్‌గా పనిచేసిన ఆయనఆ యా జిల్లాల పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, వ్యవ సాయ శాఖ కమిషనర్‌గా, ఎక్సైజ్ శాఖ కమిష నర్గా ఆయన తన అసమాన ప్రతిభను కన పర్చారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా పనిచేసే రోజుల్లో జిల్లాల వారిగా మద్యం వ్యాపారాన్ని రాజకీయ మాఫీయా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదో సవివరమైన నివేదికను రూపొందించి, అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆయన రూపొందించిన నివేదిక అక్షర సత్యం అనేది నేటికీ రుజువవుతున్నది. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా ఆయన రూపొందించిన వ్యూహం సత్ఫలితాలు ఇచ్చింది. 2002 – 03లో ఉమ్మడి రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర దుర్భిక్షం, కరువులను కేంద్ర పరిశీలక బృందానికి అత్యంత ప్రతిభావంతంగా వివ రించి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టగలిగారు. ఎవరికైనా జన్నత్ హుస్సేన్ పేరు స్ఫురణకు రాగానే ఆయనలోని సౌమ్యత, ముఖంలో ఉట్టిపడే సౌహార్ద్రత కళ్లల్లో మెదలు తాయి. వినయ విధేయతలకు మారు పేరు అయిన హుస్సేన్ దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి మన్నన పొందారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాగానే అధికార గణం నుంచి తొలి ఎంపికగా జన్నత్ హుస్సేన్‌ను తన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యావత్ రాష్ట్ర రైతులందరికీ ఉచిత విద్యుత్ వరాన్ని ప్రసాదిస్తూ జన్నత్ హుస్సేన్ రూపొందించిన ఫైల్‌పై తన తొలి సంతకాన్ని చేశారు. హుస్సేన్ ఉచిత విద్యు త్ను గట్టిగా సమర్థించేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతులకు నేటికీ ఉచిత విద్యుత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆనాడు ఉచిత విద్యుత్ ఫైల్‌పై వైఎస్ఆర్ తొలి సంతకం చేసే చారిత్రక సన్ని వేశానికి తొలి ప్రత్యక్ష సాక్షిగా జన్నత్ హుస్సేన్ ఎప్పటికీ చరిత్ర పుటలలో మిగిలిపోతారు. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారిగా... చిత్తశుద్ధిగా పనిచేసే యువ ఐఎఎస్ అధికార్లను ప్రొత్స హించారు. అపోహలతో వారిని బదిలీ చేసినప్పుడు వారికి అండగా నిలిచి వారి బదిలీలను నిలిపి వేశారు. ఇంధన కార్యదర్శిగా ఆరంగం అభివృద్ధికి పాటు పడ్డారు. పదవీ విరమణ అనంతరం ప్రధాన సమా చార కమిషనర్‌గా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో తీర్పులు ఇచ్చారు. ఇలాంటి మహో న్నతమైన వ్యక్తిత్వం కల జన్నత్ హుస్సేన్‌తో నాకు దశాబ్దాల అనుబంధం ఉన్నందుకు గర్విస్తున్నాను. ఈ గొప్ప పాలనా దక్షుడికి అశ్రు నివాళి అర్పిస్తున్నాను. - వ్యాసకర్త ‘బీఈఈ’ మీడియా ఎడ్వైజర్, నాటి సీఎం వైఎస్ ప్రెస్ సెక్రటరీ - ఎ. చంద్రశేఖర రెడ్డి -
రూ.2 లక్షల రుణమాఫీపైనే మొదటి సంతకం
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సంబంధించిన రూ.2 లక్షల రుణమాఫీపైనే మొదటి సంతకం పెడతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు సీఎంగా ఉన్నా.. తాను కీలకంగా వ్యవహరించి రుణమాఫీ చేయిస్తానని హామీఇచ్చారు. నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామంలో వివిధ పార్టీ లకు చెందిన 200 మంది శనివారం ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో నల్లగొండను దత్తత తీసుకుంటానని చెప్పి ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేదని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా ఏమీ కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ఎక్కడ కూడా 14 గంటల కన్నా ఎక్కువ విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రంలో భూములు అమ్మడంతో పాటు వైన్‌షాపులకు ముందస్తుగానే టెండర్లు వేసి వచ్చిన డబ్బులను సీఎం కేసీఆర్ తమ ఖాతాలో జమ చేసుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనను నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లను గెలుచుకుంటామని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. కార్యక్రమంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, వెలుగుపల్లి మాజీ సర్పంచ్ జూలకంటి వెంకట్‌రెడ్డి, నాయకులు చెల్ల పద్మారెడ్డి, బ్రహ్మచారి, చెలక సైదిరెడ్డి, ఎం.రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సచివాలయంలో హరీష్ రావు తొలి సంతకం
-
పోడు భూముల పంపిణీపై కేసీఆర్ తొలి సంతకం
-
2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీపై తొలి సంతకం..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేయిస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయిస్తాం. త్యాగాలకు, పోరాటాలకు నిలయమైన ఓరుగల్లు గడ్డపై నిరుద్యోగ మార్చ్ సాక్షిగా మాట ఇస్తున్నా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. ఈ కేసును పక్కదోవ పట్టించేందుకే సీఎం కేసీఆర్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో తనను ఇరికించారని ఆరోపించారు. శనివారం హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు వేలాది మందితో బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపీలు చాడ సురేశ్‌రెడ్డి, రమేశ్ రాథోడ్ సహా పలువురు రాష్ట్ర నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరుద్యోగ మార్చ్ ముగింపు సభలో బండి సంజయ్ ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించట్లేదేం? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించడం లేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘తప్పు చేశాడు కాబట్టే నీ కొడుకును కాపాడుకోవాలనుకుంటున్నావు. వెంటనే నీ కొడుకును బర్తరఫ్ చెయ్. మెడపట్టి గెంటేయ్. తప్పు చేస్తే కేసీఆర్ కుటుంబానికి ఒక న్యాయం? సామాన్యులకు ఒక న్యాయమా? ‘ఈ వేదికపై సీఎంకు చెబుతున్నా.. సిట్ విచారణకు మేం ఒప్పుకోం. నయీం, మియాపూర్ ల్యాండ్ స్కాం, డ్రగ్స్ కేసులో సిట్ విచారణ నివేదికలు ఏమయ్యాయి? కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులను కాపాడుకొనేందుకే సిట్ విచారణ చేస్తున్నారు. మీరు వేసుకొనే సిట్లను ఇంకా నమ్మాలా’ అని బండి ప్రశ్నించారు. నిరుద్యోగ మార్చ్‌లు ఆగవు... పేపర్ లీకేజీపై తక్షణమే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పున పరిహారమివ్వాలని, అందుకోసమే నిరుద్యోగ మార్చ్ చేపట్టామని, ఈ మార్చ్ ఇంతటితో ఆగదని, ఈ నెల 21న పాలమూరు గడ్డమీద నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. వరుసగా అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరుతామని, ఆ తరువాత హైదరాబాద్‌లో లక్షలాది మందితో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అంబేడ్కర్ స్ఫూర్తిగల పార్టీ బీజేపీనే... ‘సీఎం కేసీఆర్‌కు తెలంగాణతో తెగదెంపులయ్యాయి. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకాని మూర్ఖుడు కేసీఆర్. ఆయనకు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదు. దళితులను అడుగడుగునా అవమానించిన పార్టీ బీఆర్ఎస్. అంబేడ్కర్ స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ. దళిత, గిరిజన, బలహీనవర్గాల అభ్యున్నతికి పాల్పడుతున్న పార్టీ బీజేపీ. రాష్ట్రపతి, గవర్నర్లు, కేంద్ర మంత్రులుగా దళిత, గిరిజన, బలహీన వర్గాల వారిని చేసిన ఘనత బీజేపీదే’ అని బండి వివరించారు. ఒక్క అవకాశం ఇవ్వండి... ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పీల్ చేస్తున్నా... నిరుద్యోగులారా నిరాశ పడకండి. బీజేపీ అండగా ఉంది. మాకు నేషన్ ఫస్ట్... ఫ్యామి లీ లాస్ట్. తెలంగాణలో యువత మాకు ఫస్ట్.. 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. తెలంగాణ ప్రజలు, యువతను కోరుతున్నా. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగరేస్తాం. రామరాజ్యం ఏర్పాటు చేస్తాం’ అని బండి సంజయ్ తెలిపారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జాతీయ, రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు, విజయరామారావు, కన్నబోయిన రాజయ్య, దరువు ఎల్లన్న, ఆకుల విజయ పలువురు పాల్గొన్నారు. -
కరోనా ట్రీట్మెంట్ ఫైల్‌పైనే స్టాలిన్ తొలి సంతకం
చెన్నె: అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకుని శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ముతువేల్ కరుణానిధి స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తన తండ్రి స్మృతిస్థలి వద్ద కరుణానిధికి నివాళులర్పించిన అనంతరం సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. స్వీకారం చేసిన వెంటనే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా తొలి సంతకాలు వేటిపై చేశారనే ఆసక్తి అందరిలో ఉంది. మహమ్మారి కరోనా వైరస్‌తో పోరాడుతున్న ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమానికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి స్టాలిన్ తొలి సంతకం చేశారు. ఈ పథకం కింద మే, జూన్ నెలలకు సంబంధించి రూ.4 వేల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనుంది. రెండు విడతలుగా ఆ సహాయం అందించనున్నారు. 2.7 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ బీమా ఉన్న వారందరికీ కరోనా చికిత్సకయ్యే ఖర్చంతా భరిస్తుందనే ఫైల్‌పై స్టాలిన్ సంతకం చేశారు. సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణానికి సంబంధించిన ఫైల్‌పై సీఎంగా స్టాలిన్ సంతకం చేశారు. మే 8వ తేదీ నుంచి మహిళలు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పాల ధర తగ్గింపుపై స్టాలిన్ సీఎంగా సంతకం చేశారు. మే 16 నుంచి లీటర్‌పై మూడు రూపాయలు తగ్గనున్న ధర. ‘మీ నియోజకవర్గ ముఖ్యమంత్రి’ అనే సరికొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. దీనిపై ఐదో సంతకం చేశారు. ప్రజల సమస్యలు నేరుగా ముఖ్యమంత్రికి తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్ణయం. వంద రోజుల్లోపు ఆ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి. చదవండి: తమిళ రాజకీయాల్లో ఇక సినీ క్రేజ్ తగ్గినట్టేనా..? ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
సంక్షేమ సంతకం
హామీ అంటే అసత్యం..ఇదీ 2004కి ముందు జనాభిప్రాయం. తాను సీఎం అయ్యాక వైఎస్ ఈ భావనను మార్చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై సంతకం చేశారు. అన్నమాటను అమలుచేశారు. ఇవ్వని హామీలనూ నెరవేర్చారు. మరి నేడు.. వైఎస్ మాదిరిగానే చంద్రబాబూ 2014లో రుణమాఫీ ఫైలుపై సవాలక్ష షరతులతో సంతకం పెట్టారు. అమలు అంతంత మాత్రమే.. నిరుద్యోగ భృతి..ఇంటికో ఉద్యోగం లాంటి హామీలు గాలిలో కలిసిపోయాయి. వైఎస్ తొలిఫైలుపై సంతకం పెట్టి 13ఏళ్లయిన సందర్భంగా కథనం.. చిత్తూరు (అర్బన్): రైతులు పడుతున్న కష్టాలను పాద యాత్ర ద్వారా కళ్లారా చూశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 మే 14న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే రోజు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గరి నుంచి చూసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఉచిత విద్యుత్ సంతకం రాష్ట్రం మొత్తంలో 30 లక్షల మంది రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. మన జిల్లాలో మాత్రమే 2 లక్షల మంది రైతులు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందారు. అప్పటివరకు ఉన్న విద్యుత్ బకాయిలను ఒకే ఒక్క సంతకంతో కొట్టి పారేశారు. ఏటా సగటున ఆరువేల మంది రైతులు కొత్త విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటూ మరో 78 వేల రైతు కుటుంబాలు 13 ఏళ్లు లబ్ధి పొందాయి. వైఎస్ నాటిన ఉచిత విద్యుత్ అనే బీజం పెరిగి మహావృక్షంగా మారడంతో జిల్లాలో 2.78 లక్షల మంది కర్షకులు ఆ చెట్టు కొమ్మ కింద సేదతీరుతున్నారు. అడక్కుండానే అన్నీ ఇచ్చి.. అడగకుండానే రాజశేఖరరెడ్డి ప్రజల కోసం మరెన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, శస్త్ర చికిత్స చేయించుకోలేని వాళ్లకు ఆరోగ్య శ్రీ కింద ఉచిత ఆపరేషన్లు చేయించారు. రుణమాఫీ కింద జిల్లా వాసులకు రూ.200 కోట్ల అప్పుల నుంచి విముక్తి కల్పించారు. ఇందులో రైతులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అందరూ ఉన్నారు. ఎక్కడా రాజకీయాలకు, కులమతాలకు తావివ్వలేదు. అందుకే ఆయన అందరి గుండెల్లో చిరిస్థాయిగా నిలిచిపోయారు. రైతులకు భరోసా లేదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు పెద్దపీట వేశారు. కావాల్సినంత కరెంట్ ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచారు. చంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలుపొందేందుకు లేనిపోని హామీలు ఇచ్చారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి తీరా ఆ మాట మరిచిపోయారు. దీంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి రైతు సంక్షేమానికి భరోసా ఇవ్వాలని కోరుతున్నా. – ఆరుద్రరెడ్డి, రైతు, తాళంబేడు ఎదురుచూస్తున్నాం నాపేరు శాంతమ్మ. ఇందిరమ్మ మహిళా గ్రూపులో సభ్యురాలిగా ఉన్నా. మా సభ్యులు 9 మందితో కలిసి నాలుగేళ్ల క్రితం రూ.3.5లక్షలు అప్పు తీసుకున్నాం. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మేము తీసుకున్న అప్పును నిలుపుదల చేశాం. కొన్నాళ్లకు తీసుకున్న అప్పుకు గాను ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున వడ్డీ పడింది. మా గ్రూపునకు ఇంతవరకు రూపాయి మాఫీ కాలేదు. – శాంతమ్మ, తాళంబేడు ఉచిత విద్యుత్‌తో ఎంతో మేలు జరిగింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇవ్వడంతో మాకు ఎంతో మేలు జరిగింది. అంతకు మునుపు టీడీపీ ప్రభుత్వం ప్రతినెలా విద్యుత్ బిల్లులు, బకాయిల పేరుతో ఎంతో వేధించేది. వైఎస్ రాకతో ఉచిత విద్యుత్ ఇవ్వడమేగాక బకాయిలు మొత్తం కొట్టేశారు. ప్రస్తుత ప్రభుత్వం నెలనెలా 20 రూపాయలు వ్యవసాయ బావులకు వసూలు చేస్తోంది. అది కూడా ఇంటి బిల్లుల్లో వసూలు చేస్తున్నారు. – రాజారెడ్డి, రైతు, వసంతాపురం రైతుల కష్టాలు రాజశేఖరరెడ్డికి తెలుసు రైతుల కష్టాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి మాత్రమే తెలుసు. అందుకోసమే ఉచిత విద్యుత్ ఇచ్చారు. జీవితాంతం ఆయన్ని మరచిపోలేం. నేను కూడా ఉచిత విద్యుత్‌తో లాభపడ్డాను. గతంలో రెండు నెలలకు ఇంటి విద్యుత్ బిల్లులు ఇస్తూ ఉండేవారు. ప్రస్తుతం ప్రతినెలా వ్యవసాయ బిల్లుల పేరుతో 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. – వెంకిరెడ్డి, రైతు, చింతగుంటూరు, గుడిపాల మండలం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రాజశేఖరరెడ్డి పథకాలను మక్కికి మక్కి దించేసి ప్రజల నోళ్లలో నానాలనుకున్న చంద్రబాబునాయుడు అదే ప్రజలు శాపనార్థాలు పెట్టే స్థాయికి చేరుకున్నారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బాబు ఐదు ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. ఇందులో రుణమాఫీపై తొలి సంతకం చేసినా రెండేళ్లలో జిల్లాకు విడుదల చేసిన దాదాపు రూ.వెయ్యి కోట్లు ప్రజలు తీసుకున్న అప్పులపై వడ్డీకి సైతం సరిపోవడం లేదు. అలాగే జిల్లాలోని 6.61 లక్షల డ్వాక్రా సంఘాలకు రూ.264 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బెల్టు దుకాణాలు కనిపించడానికి వీల్లేదంటూ చేసిన మూడో సంతకం ఫలితంగా అప్పటి వరకు జిల్లాలో ఉన్న బెల్టు దుకాణాలు 3,400 నుంచి ఇప్పుడు ఏకంగా 7 వేలకు చేరుకున్నాయి. ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద జిల్లాలోని 1,400 గ్రామాల్లో శుద్ధినీటి ప్లాంటు పెడతామని సీఎం స్థాయిలో బాబు సంతకం చేసినా ఈ సంఖ్య 110కే పరిమితమయ్యింది. ఇక పట్టభద్రులైన నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల భృత్తి ఇస్తామని చెప్పి జిల్లాలోని 3 లక్షల మంది నిరుద్యోగులకు ఈ మూడేళ్ల కాలంలో రూ.2,160 కోట్లు బకాయి పడ్డారు. ఇలా జిల్లా వాసుల్ని బాబు దగా చేసి, ఇచ్చిన హామీలు గాలికొదిలి నిస్సిగ్గుగా సీఎంగా కొనసాగుతున్నారు. -
ట్రంప్ స్టాంపు పడింది!
ఒబామాకేర్ రద్దు ఫైలుపై అమెరికా అధ్యక్షుడి తొలి సంతకం వాషింగ్టన్: ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ప్రమాణ స్వీకారం నుంచే తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటిన అధ్యక్షుడు ట్రంప్.. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ప్రారంభించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన ఆరోగ్య చట్టం ‘ఒబామా కేర్’ నిబంధనలు సడలిస్తున్న ఫైలుపైనే తొలి సంతకం చేయటం ద్వారా పాలనలో తన ముద్రను చాటుకునే ప్రయత్నం చేశారు. ‘నా ప్రభుత్వ పాలనా విధానాల ప్రకారం ఈ (హెల్త్‌కేర్ చట్టం) నిర్ణయాన్ని రద్దుచేయాలని నిర్ణయించాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం పూర్తవగానే వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయానికి వెళ్లి∙ఈ ఫైలుపై సంతకం చేశారు. ‘ఒబామాకేర్ వల్ల వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ చెప్పారు. దీంతోపాటు ఇరాన్, ఉత్తర కొరియాల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని కొత్త మిసైల్ భద్రత వ్యవస్థను రూపొందించుకోనున్నట్లు సంకేతాలిచ్చారు. వైట్‌హౌజ్ వెబ్సైట్లో శక్తి, విదేశాంగ విధానం, ఉద్యోగాలు, అభివృద్ధి, మిలటరీ, చట్టాల అమలు, వాణిజ్య ఒప్పందాలు అనే విధానాలనుంచారు. మీడియా.. వాస్తవాలు తెలుసుకో! 2009లో ఒబామా బాధ్యతలు చేపట్టగానే కార్యాలయం నుంచి తొలగించిన మాజీ బ్రిటీష్ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ విగ్రహాన్ని ట్రంప్ తన కార్యాలయంలో పెట్టించారు. ఆఫీసులో మార్పులు చేశారు. ఒబామా పెట్టించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహాన్ని వార్తలు రావటంతో దీన్ని ఖండిస్తూ విగ్రహం ఆఫీసులోనే ఉన్న చిత్రాన్ని ప్రెస్ సెక్రటరీ ట్వీట్ చేశారు. ‘మీడియా ప్రమాదాన్ని గుర్తుచేస్తూ తొలి ట్వీట్. ముందు వాస్తవాలు తెలుసుకోండి’ అని ట్విటర్లో హెచ్చరించారు. పెరిగిన ట్విటర్ ఫాలోవర్లు ప్రమాణరం చేసిన 12 గంటల్లోనే ట్రంప్‌కు 1.4 కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లు పెరిగారు. 2009లో ట్విటర్ ఖాతా ప్రారంభించిన ట్రంప్ ప్రస్తుత ఫాలోవర్లు 2.1 కోట్లమంది. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ట్విటర్ హ్యాండిల్ కూడా ఒబామా నుంచి ట్రంప్‌కు బదిలీ అయింది. ట్రంప్ ప్రసంగంపై విమర్శలు ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రంప్ చేసిన చేసిన ప్రసంగంపై విమర్శలు పెరిగాయి. బ్యాట్మన్ చిత్రంలో విలన్ బేన్లా ట్రంప్ మాట్లాడారని పలు మీడియా సంస్థలు విమర్శించాయి. మరోవైపు, ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని నిరసిస్తూ.. ఆందోళన చేపట్టిన వారిలో 200 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నిరసన మితిమీరి పోలీసులపై రాళ్ల దాడితోపాటు పలు దుకాణాలపై దాడులకు దారితీయటంతో రాజధాని వాషింగ్టన్ డీసీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులకు గాయాలవగా పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. భార్యతో కలసి స్టెప్పులు శుక్రవారం రాత్రి.. భార్య మెలనియాతో కలిసి ట్రంప్ స్టెప్పులేశారు. బాధ్యతలు స్వీకరించాక లిబర్టీ బాల్లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, పలువురు ట్రంప్ టీమ్ కీలక సభ్యులు కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఫ్రీడమ్ బాల్, ఆర్మ్డ్ ఫోర్సెస్ బాల్ కార్యక్రమాల్లో ట్రంప్ దంపతులు పాల్గొన్నారు. -
తొలి సంతకం నిర్వచనం తెలుసా నీకు?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశంపార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొలి సంతకం అనేదానికి నిర్వచనం తెలుసా? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేస్తే అది మరుసటి రోజు నుంచే అమలైందని గుర్తుచేశారు. కేంద్రాన్ని ఒప్పించి మరీ రుణమాఫీ చేయించారన్నారు. చంద్రబాబు మాత్రం రుణమాఫీపై తొలి సంతకం అంటూనే కోటయ్య కమిటీని వేశారని దుయ్యబట్టారు. ఆరునెలలైనా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని చెప్పారు. రుణమాఫీ చేస్తామంటూ రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించి, పంట బీమా కూడా దక్కకుండా చేసిన టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ ఐదున కలెక్టరేట్ల ఎదుట తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. క్యాడర్ వైఎస్సార్సీపీవైపే ఉందని, సీనియర్ల నేతృత్వంలో పార్టీని పటిష్టం చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు సాగి దుర్గాప్రసాదరాజు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.