బాబును ప్రజలు నమ్మరు : రోజా | People already believe: Roja | Sakshi
Sakshi News home page

బాబును ప్రజలు నమ్మరు : రోజా

Published Sun, Apr 27 2014 5:16 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

బాబును ప్రజలు నమ్మరు : రోజా - Sakshi

బాబును ప్రజలు నమ్మరు : రోజా

నిండ్ర,న్యూస్‌లైన్: నమ్మక ద్రోహానికి, వెన్నుపోట్లకు చిరునామాగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్‌కే.రోజా అన్నారు.  శనివారం ఆమె నిండ్ర మండలం అత్తూరు గ్రామంలో పర్యటించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి,  సహకరించిన టీడీపీకి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఆ రెండు పార్టీలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాయన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు చుక్కులు చూపించారని ధ్వజ మెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు సామాన్యులకు ఏమీ చేయని ఆయన ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తూ మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్. రాజశేఖరరెడ్డిలా ఉండాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు.

ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. రాజ న్న పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే వైఎస్సార్ పథకాలను అమలు చేయగలరన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓట్లేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయుకులు చక్రపాణిరెడ్డి, వునోహర్‌నాయుడు, భాస్కర్‌రెడ్డి, మురళీ నాయుడు, నాగభూషణంరాజు, సుందరరామిరెడ్డి, అరుణ, మేరి, రేవతి, సెల్వం, రాజు గోపాల్, దావుురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement