తెనాలి మహిళ గీతాంజలి చావుకు టీడీపీ సోషల్ మీడియానే కారణమని విమర్శించారు ఏపీఎఫ్‌డీఎఫ్ చైర్మన్ పోసాని కృష్ణమురళి. సాధారణ మహిళను వెంటాడి, వేధించడంతో మానసిక వేదనతో గీతాంజలి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చావుకు చంద్రబాబు, లోకేషే బాద్యత వహించాలన్నారు. ఈ మేరకు పోసాని మంగళవారం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు.
చంద్రబాబును విమర్శించిన ప్రతి ఒక్కరిపై.. ఆయన వ్యక్తిగత దాడులకు పాల్పడుతుంటాడని మండిపడ్డారు. ప్రధాని మోదీ నుంచి సీఎం జగన్, సాధారణ పౌరులతో సహా ఎవరిని బాబు వదిలిపెట్టడని అన్నారు. మోదీ చంద్రబాబును అవినీతిపరుడని విమర్శిస్తే.. తిరిగి బాబు ప్రధానిని భార్య, కుమారుడు లేడంటూ వ్యక్తిగతంగా దుయ్యబట్టారని అన్నారు. మోదీ కూడా ఆత్మహత్య చేసుకోవాలన్నారు. గీతాంజలిపై కూడా అలాగే వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఆమె చావుకు టీడీపీ కారణంగా నిలిచిందని మండిపడ్డారు.
వ్యవస్థను ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ బూతులు తిడుతున్నాడు. ఒకవేళ పవన్‌ను ప్రశ్నిస్తే.. వాళ్ల సైకో ఫ్యాన్స్ ఎమ్మెల్యేలను, వారి భార్య పిల్లలను బూతులు తిడతారు. టీడీపీ, జనసేన సైకో అభిమానులు నా భార్యను కూడా వదల్లేదు. తనపై కూడా బూతులు తిట్టారు. నాభార్య గురించి తన మొబైల్‌కే అసభ్యంగా మెసెజ్‌లు పంపారు. గీతాంజలి కంటే ఎక్కువ వేధింపులకు గురిచేశారు. ఇన్ని తిట్టినా నా భార్య ఏడవలేదు. ధైర్యంగా నిలబడింది. నా భార్య కూడా గీతాంజలిలాగా చనిపోయి ఉంటే నాకు దిక్కు ఎవరు ఉంటారు. నా భార్య నవ్వే నాకు ఇన్సిపిరేషన్. నాకు అప్పుడు ఏడుపు రాలే.. ఇప్పుడు మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది.
అప్పుడు ఈ వెధవలను బహిరంగంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నా. అప్పుడే మీడియాతో మీటింగ్ పెట్టి నా భార్యకు వచ్చిన మెసెజ్‌లు అన్నీ చూపించా. వాళ్లు ఎలా తిట్టారో నేను వాళ్లను అలాగే తిట్టిన. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ పోరాడాలని సవాల్ విసిరాను.
చంద్రబాబు దగ్గర ఉన్న విచ్చలవిడి డబ్బులతోటి దివంగత ఎన్టీఆర్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్నాడు. ఎన్టీఆర్‌ను చెప్పుతో కొట్టించాడు. వెన్నుపోటు పొడిచి సీఎం పోస్టు లాక్కున్నాడు. సీఎం జగన్ నుంచి 23 ఎమ్మెల్యేలను కొన్నాడు. జైలు కెళ్లి మళ్లీ అదే డబ్బులు వెదజల్లి బయటకు వచ్చాడు. చంద్రబాబు ఓటర్లను ప్రేమిస్తాడు. సీఎం జగన్ ప్రజలను ప్రేమిస్తాడు . అదే ఇద్దరికిఉన్న తేడా కాబట్టే జనం గుండెల్లోఉన్నాడు. సిద్ధం సభకు లక్షల జనాలు వచ్చారు.
మహిళలు ఎవరూ ఏడవకండి. అధైర్య పడకండి.. వేధవలు ఉంటారు.. తట్టుకొని ధైర్యంగా ఎదుర్కోండి. మనకేనా కన్నీళ్లు ఉంటాయి.. వాళ్లకు ఉండవా.. ప్రశ్నించి ఎదురుతిరగండి. రేపు మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మహిళలు రోడ్డు మీదకు రండి.. గీతాంజలి నా చెల్లె కాదు కదా. నా అక్క కాదు కదా. నా కుంటుబ సభ్యురాలు కాదు కదా.. నా వరకు వస్తే చుద్దాంలే అప్పటి వరకు నారా లోకేష్ ఇంటికి వెళ్లండి.. వాళ్ల భార్య బ్రహ్మిణి దగ్గరకు వెళ్లి చెప్పండి. గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియా ట్రోల్సింగ్స్‌తో చంపించాడు. నీ భర్తను చెప్పుతో కొట్టి బుద్ధి వచ్చేలా చేయ్ అని నిలదీయండి. ఇతడి వల్ల ఇంకెవరూ చనిపోకుండా మీరు వచ్చి నిలదీస్తే ఇలాంటి ఆత్మహత్యకు తగ్గుతాయి’ అని పోసాని పేర్కొన్నారు.
గీతాంజలి అనే మహిళ తన సొంత ఇంటి కల నెరవేరిందంటూ సీఎం జగన్‌ను పొగడటం ఆమె పాలిట శాపమైంది. టీడీపీ సోషల్ మీడియా సైకోలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వెంటాడి వేధించారు. అసభ్య పదజాలంతో దూషించారు. ప్రతిక్షణం నరకం చూపించారు. ఆమె గుండె తట్టుకోలేకపోయింది.ట్రోలింగ్ భరించలేకపోవ్వడంతో చివరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment