
అంజలి
దాదాపు నాలుగేళ్ల క్రితం అంజలి ముఖ్య తారగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి బ్యానర్‌పై రూపొందిన హారర్ కామెడీ చిత్రం ‘గీతాంజలి’ ప్రేక్షకులను మెప్పించింది. కోన వెంకట్ స్థాపించిన నిర్మాణ సంస్థ కోన ఫిలిమ్ కార్పొరేషన్ పతాకం (కేఎఫ్‌సీ)పై వచ్చిన ‘అభినేత్రి, నిన్నుకోరి’ చిత్రాలు విజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా కేఎఫ్‌సీ సంస్థ ముందుకు వెళ్తోంది. ఎం.వి.వి, కేఎఫ్‌సీ సంస్థల కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘నీవెవరో’ రిలీజ్‌కు రెడీగా ఉంది.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మళ్లీ ఈ రెండు నిర్మాణ సంస్థల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘గీతాంజలి 2’. కథానాయిక అంజలి ముఖ్య తారగా నటించనున్నారు. నటుడు ప్రభుదేవా ఈ సినిమా టైటిల్ లోగో అండ్ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. త్వరలో మొదలుకానున్న ఈ సినిమాకు భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ దర్శకత్వం వహించనున్నారు. ‘‘థ్రిల్లర్ కామెడీ జానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు కోన వెంకట్.
Comments
Please login to add a commentAdd a comment