
ఆది పినిశెట్టి, తాప్సీ
‘రంగస్థలం’ మంచి సక్సెస్ సాధించడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు హీరో ఆది పినిశెట్టి. అదే స్పీడ్‌తో తన నెక్ట్స్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఆది పినిశెట్టి హీరోగా తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్లుగా ‘లవర్స్’ ఫేమ్ హరినా«ద్ దర్శకుడిగా కోనా వెంకట్ సమర్పణలో ఎమ్‌వీవీ సత్యనారాయణ ఓ సినిమా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘నీవెవరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్‌ను గురువారం ట్వీటర్‌లో అనౌన్స్ చేశారు హీరో నానీ. ‘‘నీవెవరో’ నా నెక్ట్స్ మూవీ. అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ కావాలి’’ అన్నారు హీరో ఆది పినిశెట్టి. ఈ సినిమాకు కెమెరా:సాయి శ్రీరామ్.
Comments
Please login to add a commentAdd a comment