వన్‌ ప్లస్‌ వన్‌ | game over released on july 14 | Sakshi
Sakshi News home page

వన్‌ ప్లస్‌ వన్‌

Published Mon, Jun 3 2019 1:22 AM | Last Updated on Mon, Jun 3 2019 1:22 AM

game over released on july 14 - Sakshi

తాప్సీ

ప్రొఫెషనల్‌ లైఫ్‌ని ఎంత పక్కాగా ప్లాన్‌ చేసుకుంటారో అంతే బాగా పర్సనల్‌ లైఫ్‌ని కూడా ప్లాన్‌ చేసుకుంటున్నారు తాప్సీ. రెండేళ్ల క్రితం ముంబైలో ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ కొన్న ఈ బ్యూటీ తాజాగా మరో ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌కి ఓనర్‌గా మారారు. గతంలో తాను ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే తాప్సీ ఈ కొత్త ఫ్లాట్‌ను తీసుకున్నారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇంటీరియర్‌ డెకరేషన్‌ వర్క్‌ జరుగుతోందట. తాప్సీ సిస్టర్‌ శాగున్‌ దగ్గరుండి మరీ ఈ పనులన్నీ చూసుకుంటున్నారట. ఇలా పర్సనల్‌గా కూడా తాప్సీ మంచి జోరుమీద ఉన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.... ఇటీవల ‘బద్లా’ చిత్రంతో సూపర్‌ సక్సెస్‌ను అందుకున్న తాప్సీ ‘సాండ్‌కీ అంఖే, మిషన్‌ మంగళ్‌’ అనే హిందీ సినిమాలను పూర్తి చేశారు. తమిళం, తెలుగు భాషల్లో తాప్సీ నటించిన ‘గేమ్‌ ఓవర్‌’ చిత్రం జూలై 14న విడుదల కానుంది. బాలీవుడ్‌లో తాప్సీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకున్న నిర్మాతలు ఈ సినిమా హిందీ వెర్షన్‌ను కూడా రిలీజ్‌ చేస్తున్నారు. హిందీలో అనురాగ్‌ కశ్యప్‌ ఈ చిత్రం విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement