
తాప్సీ
సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమాల్లో భయపెట్టడానికి దెయ్యం, పాడుబడిన భవంతులు, చీకట్లో కొన్ని సన్నివేశాలు తీయడం కామన్. ఇవేమీ లేకుండా ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ప్లాన్ చేశారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. తాప్సీ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఇది వరకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘మన్‌మర్జియా’, ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సాంద్ కీ ఆంఖే’లో హీరోయిన్‌గా నటించారు తాప్సీ. ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ విశేషాలను తాప్సీ తెలుపుతూ – ‘‘ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడనటువంటి అంశాలు మా సినిమాలో ఉంటాయి.
ఈ సినిమాలో పలు గెటప్స్‌లో కనిపిస్తాను. గుర్తుపట్టలేనటువంటి లుక్ కాదు కానీ ఇప్పటివరకూ మీరు చూడని గెటప్‌లో మాత్రం కచ్చితంగా కనిపిస్తాను. షూటింగ్ మొత్తం విదేశాల్లో చేస్తాం. అనురాగ్‌తో సినిమా అంటే మానసికంగా ప్రిపేర్ అయ్యుండాలి. షూటింగ్ ముందు ఏదో ఓ బాంబ్ వేస్తాడు. ‘మన్‌మర్జియా’ షూటింగ్ రెండు రోజుల ముందు జుత్తు మొత్తం రంగు వేసుకోమన్నాడు. అందుకే ఈసారి నేను రెడీగా ఉన్నాను. గుండు చేయించుకోవడానికి తప్ప ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను (నవ్వుతూ)’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment