ఆటకి డేట్‌ ఫిక్స్‌ | thapsee new movie game over released on june 14 | Sakshi
Sakshi News home page

ఆటకి డేట్‌ ఫిక్స్‌

Published Sat, May 25 2019 12:33 AM | Last Updated on Sat, May 25 2019 12:33 AM

thapsee new movie game over released on june 14 - Sakshi

తాప్సీ

గేమ్‌ ఫినిష్‌ చేశారు హీరోయిన్‌ తాప్సీ. మరి.. ఎలా ఆడారు? అనే విషయాన్ని మాత్రం వెండితెరపై చూడాల్సిందే. తాప్సీ ప్రధాన పాత్రలో అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో ఎస్‌. శశికాంత్‌ నిర్మించిన చిత్రం ‘గేమ్‌ ఓవర్‌’. చక్రవర్తి రామచంద్ర సహ–నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. జూన్‌ 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ చిత్రకథ విన్నప్పుడు సరికొత్తగా ఉందనిపించింది. విజయం సాధించే చిత్రం అనిపించింది.

‘ఆనందోబ్రహ్మ’ తర్వాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదు’’ అన్నారు తాప్సీ. ‘‘సరికొత్త కథ, కథనాలతో తెలుగు, తమిళ భాషల్లో ఈ ‘గేమ్‌ ఓవర్‌’ చిత్రాన్ని నిర్మించాం. మా గత చిత్రాలు ‘లవ్‌ ఫెయిల్యూర్‌’, ‘గురు’ విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు దర్శకుడు అశ్విన్‌. ఈ చిత్రానికి సంగీతం: రోన్‌ ఏతాన్‌ యోహాన్, లైన్‌ ప్రొడ్యూసర్‌: ముత్తు రామలింగం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement