జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు | Telangana BC Commission Chairman says Changes Of Castes Will Be Based On Living Conditions | Sakshi
Sakshi News home page

జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు

Published Sat, Jul 13 2019 8:08 AM | Last Updated on Sat, Jul 13 2019 8:08 AM

Telangana BC Commission Chairman says Changes Of Castes Will Be Based On Living Conditions - Sakshi

 సాక్షి, బోధన్‌: రాష్ట్రంలో తమను బీసీ కులాల్లోకి తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులను పరిగణంలోకి తీసుకుని ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు అన్నారు. కుళ్లె కడిగి కులస్తులు తమను బీసీ కులాల్లోకి తీసుకోవాలని రాష్ట్రం ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో శుక్రవారం బోధన్‌ మండలంలోని తగ్గెల్లి, పెంటా కుర్దు గ్రామాల్లో తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు పర్యటించి కుళ్లెకడిగె కులస్తుల స్థితిగతులను పరిశీలించారు.

వారి జీవన విధా నం, వారు నిర్వహిస్తున్న వృత్తులు, ఆర్థిక పరిస్థితు లు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 2009 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ల ప్రక్రియ ఆగిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ కమిషన్లనను పునరుద్ధరించినందున కులాల ను మార్చాలని, బీసీ కులాల్లోకి తమను తీసుకోవాలని కోరే ప్రజల నుంచి విజ్ఞప్తులు, దరఖాస్తు లు తీసుకుని వారికి న్యాయం చేయ్యడానికి బీసీ కమిషన్‌ కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో 70 కులాలకు చెందిన ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటామన్నారు. ఇందులో భాగంగా 20 కులాల నుంచి విజ్ఞప్తులు అందయని వారి జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు మొదటి విడతలో ఆయా కులాలను తమ కార్యాలయానికి పిలిపించి వివరాలు సేకరించామని, రెండో దశలో వారికి సంబంధించిన సమాచారం సేకరించామని, మూ డో దశలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా ప రిశీలన చేస్తున్నామని అందులో భాగంగా బోధన్‌ మండలంలోని పెంటాకుర్దు, తగ్గెల్లి గ్రామాల్లో కుల్లె కడిగి కులస్తుల వివరాలు, వారి జీవన శైలి పరిశీలించి వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించామన్నారు. ప్రభుత్వం, బీసీ కమిషన్‌ పూర్తి పరిశీలన అనంతరం వారిని ఏ కులం, ఏ కేటగిరిలో చేర్చా లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్‌ ఆర్డీవో గోపిరాం, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శంకర్, డిప్యూటీ తహసీల్దార్‌ ము జీబ్, ఆర్‌.సాయిలు, సీఐ షకీల్‌ అలీ, ఎస్సై యా కుబ్, కుల్లె కడిగి కులస్తుల పెద్దలు, గ్రామపెద్దలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

జీవన, అర్థిక స్థితిగతుల పరిశీలన 
వర్ని(బాన్సువాడ): చిట్టెపు కులస్తుల జీవన, అర్థిక పరిస్థితులపై మండలంలోని జాకోరా గ్రామంలో శుక్రవారం  తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మెన్‌ బి.ఎస్‌.రాములు అధ్యయనం చేశారు. గతంలో తమను బీసీ జాబితాలో చేర్చి జీవన స్థితిగతులను మెరుగు పర్చాలని చిట్టెపు కులస్థులు పలుమార్లు వినతిపత్రాలు అందచేశారు. ఈ నేపథ్యంలోలో తొలుత గ్రామ పంచాయతీ వద్ద చిట్టెపు కులస్థులతో బీసీ కమిషన్‌ చైర్మెన్‌  మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఇళ్లకు వెళ్లి జీవన విధానం, ఆర్థిక పరిస్థితులను పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాలు, చేస్తున్న వృత్తి, వస్తున్న ఆదాయం వివరాలు తెల్సుకున్నారు. పిల్లలను  చదివించాలని సూచించారు.  చిన్నప్పుడు తాను బీడీలు చు ట్టానని చైర్మన్‌  చెప్పడం విశేషం. అనంతరం ఆ యన మాట్లాడుతూ చిట్టెపు కులానికి చెందిన  కు టుంబాలకు విద్యా, సంక్షేమ  పథకాలలో ఎలాం టి ఫలితం ఉండడం లేదని, బీసీ జాబితాలో చే ర్చాలని వినతిపత్రాలు ఇచ్చిన నేపద్యంలో  క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామని అన్నారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని పేర్కొన్నారు.  చైర్మన్‌ వెంట బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి శంకర్, బోధన్‌ ఆర్డీవో గోపిరాం, తహసీల్దార్‌ నా రాయణ, వీఆర్‌వో అశోక్,   చిట్టెపు కుల సంఘం జిల్లా కార్యదర్శి నాందేవ్, జాకోరా సర్పంచ్‌ గోదావరిగణేష్,  మాజీ ఎంపీటీసీ కలాల్‌గిరి ఉన్నారు.  

కలెక్టర్, సీపీలకు అభినందన

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దఎత్తున అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ సమర్ధవంతంగా పనిపూర్తి చేసినందు కు కలెక్టర్‌ రామ్మోహన్‌రావు, సీపీ కార్తికేయను రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు అభినందించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తమను బీసీ కులంలోకి మార్చాలని కోరిన ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణం గా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నా రు. జిల్లాకు సంబంధించి విషయాలపై ఇరువు రు కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో వరుసగా జ రిగిన పలు ఎన్నికలను విజయవం తంగా నిర్వహించినందుకు కలెక్టర్, సీపీలను అభినందించారు. ముఖ్యంగా  ఇరువురినీ అభినందించా రు. గెస్ట్‌హౌస్‌లో పలు కులాలకు చెందిన సభ్యుల నుంచి విన్నపాలు స్వీకరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement