
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే అభివృద్ధి నమూనాగా నిలిచాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘దేశానికి దిక్సూచి తెలంగాణ’పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఎస్ రాములు బహుగ్రంథ రచయిత అని, తెలంగాణ సిద్ధాంత భావజాలంతో ఆయన అనేక పుస్తకాలు రచించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను తన రచనల్లో గొప్పగా విశ్లేషించారని కొనియాడారు. కాగా, రాములు రచనపై కర్రె సదాశివ్ రచించిన ‘బీఎస్ రాములు సాహిత్యం–సమగ్ర పరిశీలన’అనే మరో పుస్తకాన్ని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బీసీ కమిషన్ సభ్యులు కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment