వైఎస్సార్‌సీపీ శిక్షణ తరగతుల సదస్సులో మాట్లాడుతున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, చిత్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి, అనిల్, కోటంరెడ్డి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి, కోవూరు, గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, నల్లపరెడ్డి, మేరిగ, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి, నేదురుమల్లి, ఆనం విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం సైనికుల్లాగా పని చేద్దామని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆ పార్టీ రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు వంటి మోసకారి, వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పాలంటే వీర సైనికుల్లాగా ఎన్నికల్లో పోరాటం చేయాలన్నారు. చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక చేసే సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. బూత్ కమిటీలు పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బూత్ స్థాయిలో కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల మనస్సులో కొందరే నిలిచిపోతారని, అటువంటి గొప్ప వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బూత్‌కమిటీలు పటిష్టంగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ పథకాలు వివరించాలి
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేలును వివరించాలని, ఈ బాధ్యత బూత్ కమిటీలదే ప్రధానంగా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటంలో మనం అండగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరం చేయిచేయి కలిపి జగన్‌ను సీఎం చేద్దామన్నారు. చంద్రబాబు అధికారంలోకి తర్వాత నుంచి ఇప్పటి వరకు చేసిన మోసాలతో పాటు ప్రత్యేక హోదా విషయంలో నాటకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరిగమురళి, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, రాష్ట్ర్‌ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి , పార్టీ నెల్లూరు పార్లమెంట్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మెయిళ్ల గౌరి, అనంతరపురం, హిందూపురం పార్లమెంట్ కన్వీనర్ తలారి రంగయ్య పాల్గొన్నారు.
– రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే
చంద్రబాబుది మోసం, ఆరాచక పాలన
టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలు కూడా ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అందరం కష్టపడితే పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తామన్నారు.
– మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే
హోదాపై చంద్రబాబు పిల్లి మొగ్గలు
కేంద్రంపై వైఎస్సార్‌సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూడా చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారన్నాని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు వంటి వ్యక్తి స్వాతంత్య్రానికి ముందు ఉంటే మనకు ఈ రోజు స్వాతంత్య్రం కూడా వచ్చేది కాదేమో అన్నారు. వైఎస్సార్ సీపీ ఓటర్లను తొలగిస్తూ ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పోరాటాలు చేస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన సొంత ప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టారన్నారు. హోదాకోసం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను కూడా చంద్రబాబు బెదిరించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
– మేకపాటి రాజమోహన్‌రెడ్డి,నెల్లూరు ఎంపీ
మోసగాడితో పోరాటం
మనం పచ్చి మోసగాడైన చంద్రబాబుతో పోరాటం చేస్తున్నామనే విషయం గుర్తుపెట్టు కోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో సంక్షేమ పథకాల అమల్లో మొదటి స్థానంలో ఉంచి దేశానికే దశ, దిశ నిర్దేశించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట తప్పడన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చెప్పిన అబద్ధాలను చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా అనే అంశం బతికుందంటే అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటంతోనే అన్నారు. చంద్రబాబుకు పచ్చమీడియా తొత్తుగా ఉంటూ వైఎస్సార్‌సీపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందన్నారు. సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు.
– కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
అరాచక పాలకులకు మూల్యం తప్పదు
రాష్ట్రంలో అరాచకపాలకులు, ప్రభుత్వ అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారన్నారు. నాలుగేళ్లుగా మన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వాళ్లు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అధికార పార్టీ తాటాకు చప్పుళ్లకు బయపడే ప్రసక్తే లేదన్నారు.
– నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చంద్రబాబు మోసాలపై చైతన్యం
చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రజలకు చేస్తున్న మోసాలను, అన్యాయాలను ప్రజలకు వివరించే విధంగా చొరవ తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ ప్రత్యేక హోదాసాధన విషయంలో జగన్ వెనుదిరగని పోరాటం చేస్తున్నారన్నారు. ప్రతి చోట బూత్ కమిటీలు పటిష్టంగా ఉండాలన్నారు. బూత్ కమిటీ సభ్యులపై ఎంతో నమ్మకంగా పార్టీ ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టు కోవాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల విషయంపైగా ప్రజలకు వివరించాలన్నారు.
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే
ప్రత్యర్థి ఓటమే..మన లక్ష్యం
మన ప్రత్యర్థి ఓటమిని చవి చూసే వరకు వెనుతిరగకుండా పోరాటం చేద్దామని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ అన్నారు. 2019లో ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్నామన్నారు. జగన్ సీఎం అయితే లక్షల కుటుంబాలు ఆనందిస్తాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబానికి దూరంగా మండుటెండలో పాదయాత్ర చేస్తూ కష్టపడుతున్నారన్నారు. అందరం కష్టపడి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేస్తేనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘన నివాళి అర్పించినట్లు ఉంటుందన్నారు.
– పి.అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు నగర ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment