convention centre
-
నో స్ట్రింగ్స్ కాఫీ ఫెస్టివల్..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన నో స్ట్రింగ్స్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో కాఫీ ప్రియుల కోసం నగరంలో తొలిసారిగా ది ఇండియన్ కాఫీ ఫెస్టివల్ కొలువుదీరింది. జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఈ ఫెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆసియాలోనే తొలి కాఫీ మహిళగా పేరొందిన సునాలిని మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో భాగంగా కాఫీ ఆర్ట్ సెషన్స్, బరిస్తా డిస్ప్లే, నిపుణుల చర్చలు.. తదితర విశేషాంశాలకు చోటు కల్పించారు. అదే విధంగా కుటుంబాలు, చిన్నారులు, పెట్స్ కోసం విభిన్న రకాల ఈవెంట్స్ కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కరాఫా కాఫీ, ట్రూ బ్లాక్ కాఫీ, బిగ్ స్టార్ కేఫ్, అరకు కాఫీ, ఎంఎస్పీ హిల్ రోస్టర్స్.. తదితర ప్రముఖ బ్రాండ్లన్నీ కొలువుదీరాయి. ఈ ఫెస్టివల్ ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. -
నా విశాఖ.. నా కల
‘నా కలల నగరం విశాఖ.. పూర్తిస్థాయిలో స్మార్ట్ సిటీగా మారాలి. విద్య కోసం ఇతర ప్రాంతాలు, దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వవిద్యాలయాలు రావాలి. ఏయూను రోల్‌మోడల్‌గా తీసుకుని విద్యా సంస్థలు ఎదగాలి. వైద్య రంగంలో మరిన్ని వసతులు సమకూరాలి. ఇజ్రాయిల్‌కు దీటుగా పరిశోధన రంగంలో ప్రగతి సాధించాలి. పూర్తిస్థాయి సాంకేతికతో సేవలందించే విశ్వ నగరంగా రూపాంతరం చెందాలి. సెల్‌ఫోన్, వాలెట్ లేకుండా బయటకు వెళ్లినా మన పనులు మనం చేసుకుని వచ్చే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందాలి. విశాఖ పేరు చెబితే బీచ్ గుర్తుకొస్తుంది. తీర ప్రాంతంలో స్వదేశీ, విదేశీయులను ఆకట్టుకునే నిర్మాణాలు జరగాలి. ఇక్కడ ప్రకృతి అందాలను తిలకించే విదేశీయులు ఇక్కడే స్థిరపడేలా వసతులు సమకూరాలి’ అంటూ విశాఖపై తనకున్న విజన్‌ను ఏడేళ్ల చిన్నారి వివరించి తీరు అందరినీ ఆలోచింపజేసింది. ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వ విద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా మంగళవారం నిర్వహించిన విజన్ విశాఖ సదస్సు విజయవంతమైంది. విశాఖ యువత నుంచి ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. అంతర్జాతీయంగా విశాఖ ఎదగడానికి అనువైన పరిస్థితులు, వసతులున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖ సామర్థ్యాలను వివరిస్తూ యువత తమ ఆలోచనలను పంచుకుంది. ఏడేళ్ల చిన్నారి తపస్వి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని డి.హర్షిత మాట్లాడుతూ విలియం షేక్స్పియర్ జీవించి ఉంటే తన రచనల్లో వెనిస్ నగరం కంటే విశాఖ నగరాన్నే అధికంగా ప్రస్తావించి ఉండేవారన్నారు. విశాఖలో ప్రకృతి రమణీయత ఎంతో ప్రత్యేకమన్నారు. ప్రపంచానికే పవర్ జనరేటర్‌గా విశాఖ నిలుస్తుందన్నారు. వై నాట్ వైజాగ్ అనే స్థాయికి విశాఖ నేడు ఎదిగిందన్నారు. ఇది నా నగరం.. ఇదీ విశాఖ నగరం.. మన కథను మనమే రాద్దామంటూ తన ఉత్సాహభరిత ప్రసంగంతో యువతను ఆకట్టుకుంది. సదస్సులో నిపుణుల ప్రసంగాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ అర్బనైజేషన్, ఎంటర్ప్యూనర్ప్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అంశాలపై నిర్వహించిన మూడు చర్చగోష్టులలో నిపుణులు, యువత విశాఖ నగరంపై తమ అంచనాలు, ఆకాంక్షలు, అవకాశాలను వివరించారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య డి.సూర్యప్రకాశరావు, ప్రిన్సిపాళ్లు ఆచార్య కె.శ్రీనివాసరావు, వై.రాజేంద్రప్రసాద్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు ఆంజనేయ వర్మ, విశాఖపట్నం ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, ఐఐఎంవీ ఫీల్డ్ సీఈవో గుహన్ రామనాథన్, తారమండల్ వ్యవస్థాపకుడు వినీల్ జడ్సన్ తదితరులుప్రసంగించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ భవిష్యత్‌కి బాటలు వేసే నగరంగా విశాఖ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. -
‘యశోభూమి’కి తరలిరండి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఇంటర్నేషన్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ ‘యశోభూమి’ మొదటి దశను ప్రధాని మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇదే వేదికపై ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని భారత్ మండపం, యశోభూమిలో సకల సౌకర్యాలున్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని సినిమా, టీవీ పరిశ్రమను, అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలను ప్రధాని ఆహా్వనించారు. పీఎం విశ్వకర్మ పథకంలో సంప్రదాయ వృత్తి కళాకారులకు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. 18 మంది లబి్ధదారులకు ‘విశ్వకర్మ సర్టిఫికెట్లు’అందజేశారు. వారు ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రూ.3 లక్షలదాకా రుణం పొందవచ్చు. కాన్ఫరెన్స్ టూరిజంకు పెద్దపీట దేశంలో సదస్సుల పర్యాటకానికి ఉజ్వలమైన భవిష్యతు ఉందని మోదీ స్పష్టం చేశారు. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రారం¿ోత్సవంలో ఆయన ప్రసంగించారు. భారత్‌లో ఈ రంగం విలువ రూ.25,000 కోట్లకుపైగా ఉందన్నారు. అనంతరం ‘యశోభూమి ద్వారక సెక్టార్ 25’మెట్రో రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ ప్రధాని మోదీ 73వ జన్మదినం సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి ముర్ము, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికార బీజేపీ ‘సేవా పఖ్వారా’ను ప్రారంభించింది. అక్టోబర్ 2 దాకా ఇది కొనసాగుతుంది. రూ.13 వేల కోట్లతో ‘విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం దేశంలో పౌరుల రోజువారీ జీవనంలో విశ్వకర్మల పాత్ర చాలా కీలకమని మోదీ ఉద్ఘాటించారు. ఎంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా సమాజంలో వారి స్థానం చెక్కుచెదరని ప్రశంసించారు. రూ.13,000 కోట్లతో పీఎం విశ్మకర్మ పథకాన్ని అమలు చేస్తామని, సంప్రదాయ వృత్తి కళాకారులకు, కారి్మకులకు అండగా నిలుస్తామని అన్నారు. ఈ పథకంతో వడ్రంగులు, స్వర్ణకారులు, కమ్మరులు, శిల్పకారులు, కుమ్మరులు, దర్జీలు, తాపీ మేస్త్రీలు, రజకులు, క్షురకులు తదితరులకు మేలు జరుగుతుందన్నారు. -
పుట్టినరోజు నాడు ఢిల్లీ మెట్రోలో సందడి చేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజున పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. వాటిలో భాగంగా ఆయన మొదట ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్టెన్షన్ లైన్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రపంచంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ అయిన యశోభూమిని ప్రారంభించడానికి ఇదే మెట్రో రైలులో ప్రయాణించారు. #WATCH | Prime Minister Narendra Modi inaugurates the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/8qXxhwtp9i — ANI (@ANI) September 17, 2023 మెట్రో ప్రయాణం.. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వరకు పొడిగించిన మెట్రో ఎక్స్టెన్షన్ లైన్‌ను ప్రారంభించి అనంతరం అదే మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్బంగా సహచర ప్రయాణికులతో ఆయన కొంతసేపు మాటామంతీ జరిపారు. ఇదే క్రమంలో అనేక అంశాలను ప్రసావించిన ఆయన వాటిపై వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ఆప్యాయంగా సంభాషించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi travels in Delhi Metro ahead of inaugurating the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/O3sKCNDcTK — ANI (@ANI) September 17, 2023 #WATCH | Prime Minister Narendra Modi interacts with employees of the Delhi Metro after inaugurating the extension of the Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/g8D1UbESfh — ANI (@ANI) September 17, 2023 PM Modi shared a Delhi metro ride with students of Delhi University and had a lively, close, and personal interaction. pic.twitter.com/C0t8zWW7xn — BALA (@erbmjha) June 30, 2023 చారిత్రాత్మక కట్టడం.. ఇదే మెట్రో మార్గం కొత్తగా నిర్మించిన అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ యశోభూమి ద్వారక సెక్టార్ 21 మెట్రో స్టేషన్ ను అనుసంధానిస్తుంది. ఇదే రైలులో యశోభూమికి చేరుకుని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ మొదటి దశను ప్రారంభిస్తారు. ఇక ఆయన ప్రారంభించిన ఈ మెట్రో సేవలు మధ్యాహ్నం మూడు గంటల నుంచే అందుబాటులోకి రానున్నాయి. भारत मंडपम के बाद यशो भूमि देखिये। #yashobhumi pic.twitter.com/8UxxljsFxO — Prakash lalit (@PrakashLalit3) September 16, 2023 పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇక ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మల్లికార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, శరద్ పవార్, అభిషేక్ బెనర్జీ, పినరాయి విజయన్ తదితరులు ఉన్నారు. Wishing PM Narendra Modi a happy birthday. — Rahul Gandhi (@RahulGandhi) September 17, 2023 Birthday greetings to Hon’ble PM Shri @narendramodi ji. I pray for your good health and long life. — Arvind Kejriwal (@ArvindKejriwal) September 17, 2023 माँ भारती के परम उपासक, 'नए भारत' के शिल्पकार, 'विकसित भारत' के स्वप्नद्रष्टा, 'एक भारत-श्रेष्ठ भारत' के प्रति संकल्पित, विश्व के सर्वाधिक लोकप्रिय राजनेता, देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई! 'विकसित भारत' के निर्माण के लिए आपका समर्पण… pic.twitter.com/dpr63NDgVn — Yogi Adityanath (@myogiadityanath) September 16, 2023 ప్రెసిడెంట్ విషెస్.. రాష్ట్రపతి ముర్ము రాస్తూ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు సందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ దూరదృష్టి, సంకల్పబలం తోపాటు మీ బలమైన నాయకత్వంతో మీరు 'అమృత్ కాల్'లో భారతదేశ సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండాలని కోరుకుంటూ మీ అద్భుతమైన నాయకత్వంలో దేశప్రజలకు అన్నివిధాలా ప్రయోజనాలు చేకూర్చాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీని నవ భారత రూపశిల్పిగా అభివర్ణించారు. भारत के प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। मेरी शुभेच्छा है कि अपनी दूरगामी दृष्टि तथा सुदृढ़ नेतृत्व से आप ‘अमृत काल’ में भारत के समग्र विकास का मार्ग प्रशस्त करें। मेरी ईश्वर से प्रार्थना है कि आप सदा स्वस्थ और सानंद रहें तथा देशवासियों… — President of India (@rashtrapatibhvn) September 17, 2023 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వివాదాస్పద భారత మ్యాప్.. బీజేపీ ఫైర్ -
లిప్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి
-
ఫంక్షన్ హాల్లో దారుణం : లిఫ్ట్‌లో కాలు ఇరికి..
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో జరిగిన ఓ వివాహవేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడలో జాగీర్ రాధా నగర్‌లోని కేకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో లిఫ్ట్‌లో కాలు ఇరికి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఫంక్షన్ హాల్ యజమాని పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
సైనికుల్లా పోరాడుదాం
నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరం సైనికుల్లాగా పని చేద్దామని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆ పార్టీ రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు వంటి మోసకారి, వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పాలంటే వీర సైనికుల్లాగా ఎన్నికల్లో పోరాటం చేయాలన్నారు. చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించి, వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక చేసే సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. బూత్ కమిటీలు పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బూత్ స్థాయిలో కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల మనస్సులో కొందరే నిలిచిపోతారని, అటువంటి గొప్ప వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బూత్‌కమిటీలు పటిష్టంగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ పథకాలు వివరించాలి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేలును వివరించాలని, ఈ బాధ్యత బూత్ కమిటీలదే ప్రధానంగా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పోరాటంలో మనం అండగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరం చేయిచేయి కలిపి జగన్‌ను సీఎం చేద్దామన్నారు. చంద్రబాబు అధికారంలోకి తర్వాత నుంచి ఇప్పటి వరకు చేసిన మోసాలతో పాటు ప్రత్యేక హోదా విషయంలో నాటకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి మేరిగమురళి, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, రాష్ట్ర్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి , పార్టీ నెల్లూరు పార్లమెంట్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మెయిళ్ల గౌరి, అనంతరపురం, హిందూపురం పార్లమెంట్ కన్వీనర్ తలారి రంగయ్య పాల్గొన్నారు. – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే చంద్రబాబుది మోసం, ఆరాచక పాలన టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలు కూడా ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అందరం కష్టపడితే పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తామన్నారు. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే హోదాపై చంద్రబాబు పిల్లి మొగ్గలు కేంద్రంపై వైఎస్సార్సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూడా చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తున్నారన్నాని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు వంటి వ్యక్తి స్వాతంత్య్రానికి ముందు ఉంటే మనకు ఈ రోజు స్వాతంత్య్రం కూడా వచ్చేది కాదేమో అన్నారు. వైఎస్సార్ సీపీ ఓటర్లను తొలగిస్తూ ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పోరాటాలు చేస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తన సొంత ప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టారన్నారు. హోదాకోసం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను కూడా చంద్రబాబు బెదిరించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. – మేకపాటి రాజమోహన్‌రెడ్డి,నెల్లూరు ఎంపీ మోసగాడితో పోరాటం మనం పచ్చి మోసగాడైన చంద్రబాబుతో పోరాటం చేస్తున్నామనే విషయం గుర్తుపెట్టు కోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. దేశ చరిత్రలో సంక్షేమ పథకాల అమల్లో మొదటి స్థానంలో ఉంచి దేశానికే దశ, దిశ నిర్దేశించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట తప్పడన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చెప్పిన అబద్ధాలను చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా అనే అంశం బతికుందంటే అది వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటంతోనే అన్నారు. చంద్రబాబుకు పచ్చమీడియా తొత్తుగా ఉంటూ వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందన్నారు. సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అరాచక పాలకులకు మూల్యం తప్పదు రాష్ట్రంలో అరాచకపాలకులు, ప్రభుత్వ అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారన్నారు. నాలుగేళ్లుగా మన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వాళ్లు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అధికార పార్టీ తాటాకు చప్పుళ్లకు బయపడే ప్రసక్తే లేదన్నారు. – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రబాబు మోసాలపై చైతన్యం చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రజలకు చేస్తున్న మోసాలను, అన్యాయాలను ప్రజలకు వివరించే విధంగా చొరవ తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ ప్రత్యేక హోదాసాధన విషయంలో జగన్ వెనుదిరగని పోరాటం చేస్తున్నారన్నారు. ప్రతి చోట బూత్ కమిటీలు పటిష్టంగా ఉండాలన్నారు. బూత్ కమిటీ సభ్యులపై ఎంతో నమ్మకంగా పార్టీ ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టు కోవాలన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల విషయంపైగా ప్రజలకు వివరించాలన్నారు. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ప్రత్యర్థి ఓటమే..మన లక్ష్యం మన ప్రత్యర్థి ఓటమిని చవి చూసే వరకు వెనుతిరగకుండా పోరాటం చేద్దామని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ అన్నారు. 2019లో ఎన్నికల యుద్ధంలోకి దిగుతున్నామన్నారు. జగన్ సీఎం అయితే లక్షల కుటుంబాలు ఆనందిస్తాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబానికి దూరంగా మండుటెండలో పాదయాత్ర చేస్తూ కష్టపడుతున్నారన్నారు. అందరం కష్టపడి జగన్మోహన్రెడ్డిని సీఎం చేస్తేనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘన నివాళి అర్పించినట్లు ఉంటుందన్నారు. – పి.అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు నగర ఎమ్మెల్యే -
జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా ఆగస్ట్ ఫెస్ట్
-
హైటెక్స్ తరహాలో మరో కన్వెన్షన్ సెంటర్
హైదరాబాద్: హైదరాబాద్‌లో హైటెక్స్ తరహా మరో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రోడ్డు భవనాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సోమవారం సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సీఎం, స్పీకర్, మండలి చైర్మన్, సీఎస్‌లకు అధునాతన నివాసాలు నిర్మించడంతో పాటు ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మించాలని ఆదేశించారు. ఈ నిర్ణయాలను ఖరారు చేసేందుకు ఆయన సీఎస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించారు. అన్ని స్ధాయిల్లో రోడ్ల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాల్లో ఒకటని కేసీఆర్ చెప్పారు. నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసే కాంట్రాక్టు సంస్థలకు 1.5 శాతం ఇన్సెంటివ్ ఇస్తామని తెలిపారు. -
ఏయూ భూములపై ప్రభుత్వ గద్దలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ రోడ్డును ఆనుకుని ఆంధ్రా యూనివర్సిటీ నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌తోపాటు ఆ ప్రాంగణంలో ఉన్న 3 ఎకరాలపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. దాదాపు రూ.200 కోట్ల విలువైన భూమిని పీపీపీ విధానంలో తమపరం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. స్వతంత్ర ప్రతిపత్తిగల యూనివర్సిటీ ఆస్తులను ఇతరులకు ధారాదత్తం చేయకూడదన్న నిబంధన ఉల్లంఘిస్తూ ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న పన్నాగం ఇలా ఉంది... నిధుల కొరతతో పూర్తికాని కన్వెన్షన్ సెంటర్ విశాఖపట్నం ఆర్కే బీచ్‌రోడ్డులో తనకు చెందిన 3 ఎకరాల్లో ఆంధ్రా యూనివర్సిటీ 2011లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టింది. మొదటి దశలో రూ.12కోట్లతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని నిర్ణయించారు. రెండో దశలో ఆ కన్వెన్షన్ సెంటర్‌కు కుడి, ఎడమ వైపుల షాపింగ్ కాంప్లెక్స్, క్యాంటీన్లు, మరికొన్ని సెమినార్ హాల్స్ తదితరమైనవి నిర్మించాలని భావించారు. నిధుల కొరతతో మొదటి దశ పనులకు కేవలం రూ.6కోట్లు మాత్రమే యూనివర్సిటీ కేటాయించడంతో నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. దాంతో రెండో దశ పనులను చేపట్టకూడదని నిర్ణయించారు. యూనివర్సిటీ అవసరాలకు కన్వెన్షన్ సెంటర్ సరిపోతుందని.. రెండోదశ అవసరం లేదని తీర్మానించారు. ఇటీవల విశాఖ నగరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు కూడా ఈ కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించడం గమనార్హం. ఆ కన్వెన్షన్ సెంటర్ పనులు పూర్తి చేయడానికి మిగిలిన రూ.6కోట్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టంగా ఆదేశించారు. ప్రభుత్వం ముసుగులో అస్మదీయులకు దాదాపు రూ.200కోట్ల విలువైన బీచ్‌రోడ్డులోని ఆ కన్వెన్షన్ సెంటర్‌పైనా, దాని భూములపైనా ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. విశాఖ నగరంలో జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, మెగా ఈవెంట్ల నిర్వహణకు బీచ్‌రోడ్డులోని స్టార్ హోటళ్లకు డిమాండ్ అమాంతంగా పెరిగింది. ఈనేపథ్యంలో బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌తోపాటు దాని ప్రాంగణంలోని విలువైన భూములను తమపరం చేసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు. మొదటగా ఈ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రభుత్వమే తీసుకుని స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్వహించే విధంగా పన్నాగం పన్నారు. ఇందులోనూ లోగుట్టు వేరేగా ఉంది. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్వహించడానికి ప్రాఫెషనలిజం ఉన్న సంస్థలే చేయగలవనే వాదనను లేవనెత్తారు. అందుకే పీపీపీ విధానంలో ఆ కన్వెన్షన్ సెంటర్‌ను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని ప్రతిపాదించారు. పీపీపీ ముసుగులో రూ.200కోట్ల విలువైన భూములతో సహా ఆ కన్వెన్షన్ సెంటర్‌ను తమ సన్నిహితులకు కట్టబెట్టాలన్న యోచనతో కార్యాచరణకు ఉపక్రమించారు. ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు వీలుగా రెండో దశ పనులకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకోసం ఆ ప్రాంగణంలో యూనివర్సిటీ క్వార్టర్లలో ఉన్న ఉద్యోగులను ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ క్వార్టర్లను కూల్చివేసి మొత్తం భూమిని ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు పనులు వేగవంతం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న విశ్వవిద్యాలయాల ఆస్తులను ప్రభుత్వానికిగానీ ప్రైవేటు సంస్థలకుగానీ అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. కానీ నిబంధలను బేఖాతరు చేస్తూ రూ.200కోట్ల విలువైన ఆంధ్రా యూనివర్సిటీ భూములను ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు కట్టబెట్టేందుకు పన్నాగం పన్నడం విమర్శలకు తావిస్తోంది.