పుట్టినరోజు నాడు ఢిల్లీ మెట్రోలో సందడి చేసిన ప్రధాని మోదీ  | PM Modi Inaugurates Delhi Airport Metro Express Line Extension | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు నాడు ఢిల్లీ మెట్రోలో సందడి చేసిన ప్రధాని మోదీ 

Published Sun, Sep 17 2023 12:51 PM | Last Updated on Sun, Sep 17 2023 1:38 PM

PM Modi Inaugurates Delhi Airport Metro Express Line Extension - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజున పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. వాటిలో భాగంగా ఆయన మొదట ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్‌టెన్షన్ లైన్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రపంచంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ అయిన యశోభూమిని  ప్రారంభించడానికి ఇదే మెట్రో రైలులో ప్రయాణించారు. 

మెట్రో ప్రయాణం.. 
ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వరకు పొడిగించిన మెట్రో ఎక్స్‌టెన్షన్ లైన్‌ను ప్రారంభించి అనంతరం అదే మెట్రో రైలులో ప్రయాణించారు.  ఈ సందర్బంగా సహచర ప్రయాణికులతో ఆయన కొంతసేపు మాటామంతీ జరిపారు. ఇదే క్రమంలో అనేక అంశాలను ప్రసావించిన ఆయన వాటిపై వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ఆప్యాయంగా సంభాషించారు. 

చారిత్రాత్మక కట్టడం.. 
ఇదే మెట్రో మార్గం కొత్తగా నిర్మించిన అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ యశోభూమి ద్వారక సెక్టార్ 21 మెట్రో స్టేషన్ ను అనుసంధానిస్తుంది. ఇదే రైలులో యశోభూమికి చేరుకుని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ మొదటి దశను ప్రారంభిస్తారు. ఇక ఆయన ప్రారంభించిన ఈ మెట్రో సేవలు మధ్యాహ్నం మూడు గంటల నుంచే అందుబాటులోకి రానున్నాయి. 

పుట్టినరోజు శుభాకాంక్షలు..  
ఇక ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మల్లికార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, శరద్ పవార్, అభిషేక్ బెనర్జీ, పినరాయి విజయన్  తదితరులు ఉన్నారు. 

ప్రెసిడెంట్ విషెస్.. 
రాష్ట్రపతి ముర్ము రాస్తూ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు సందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ దూరదృష్టి, సంకల్పబలం తోపాటు మీ బలమైన నాయకత్వంతో మీరు 'అమృత్ కాల్'లో భారతదేశ సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండాలని కోరుకుంటూ మీ అద్భుతమైన నాయకత్వంలో దేశప్రజలకు అన్నివిధాలా ప్రయోజనాలు చేకూర్చాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీని నవ భారత రూపశిల్పిగా అభివర్ణించారు. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ వివాదాస్పద భారత మ్యాప్.. బీజేపీ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement