హైటెక్స్ తరహాలో మరో కన్వెన్షన్ సెంటర్ | Another convention centre to hyderabad like hitex proposed by CM KCR | Sakshi
Sakshi News home page

హైటెక్స్ తరహాలో మరో కన్వెన్షన్ సెంటర్

Published Mon, Feb 22 2016 3:34 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైటెక్స్ తరహాలో మరో కన్వెన్షన్ సెంటర్ - Sakshi

హైటెక్స్ తరహాలో మరో కన్వెన్షన్ సెంటర్

హైదరాబాద్: హైదరాబాద్లో హైటెక్స్ తరహా మరో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. రోడ్డు భవనాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సోమవారం సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సీఎం, స్పీకర్, మండలి చైర్మన్, సీఎస్లకు అధునాతన నివాసాలు నిర్మించడంతో పాటు ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మించాలని ఆదేశించారు. ఈ నిర్ణయాలను ఖరారు చేసేందుకు ఆయన సీఎస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించారు. అన్ని స్ధాయిల్లో రోడ్ల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాల్లో ఒకటని కేసీఆర్ చెప్పారు. నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసే కాంట్రాక్టు సంస్థలకు 1.5 శాతం ఇన్సెంటివ్ ఇస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement