
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో జరిగిన ఓ వివాహవేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడలో జాగీర్ రాధా నగర్‌లోని కేకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో లిఫ్ట్‌లో కాలు ఇరికి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఫంక్షన్ హాల్ యజమాని పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment