bandlaguda
-
బండ్లగూడలో రూ.50 లక్షల నగలు చోరీ
రాజేంద్రనగర్: ఇంట్లో పనికోసం వచ్చిన ఓ బిహార్ జంట అదును చూసి ఇంట్లోని విలువైన నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పనికి కుదిరిన 55 రోజుల్లోనే ఈ జంట దొంగతనానికి పాల్పడి ఉడాయించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడలోని మైఫీల్ టౌన్ విల్లా నంబర్ 20లో డాక్టర్ కొండల్ రెడ్డి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత నవంబర్ 1వ తేదీన ఏజెంట్ బిట్టు ద్వారా ఇంట్లో పనిచేసేందుకు బిహార్‌కు చెందిన నమీన్ కుమార్ యాదవ్, భారతిలను నెలసరి జీతంపై ఇంట్లో పనికి తీసుకొచ్చారు. తమ విల్లాలోని ఓ గదిని ఇచ్చి వారిని ఇంట్లోనే ఉండనిచ్చారు. ఈ క్రమంలో సోమవారం కొండల్‌రెడ్డి భార్య తన కుమారుల వద్దకు వెళ్లగా... కొండల్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచి్చన ఆయన తన గదిలోకి వెళ్లి నిద్రించాడు. ఉదయం కొండల్ రెడ్డికి కాఫీ ఇచ్చేందుకు నమీన్ కుమార్ రాకపోవడంతో కొండల్‌రెడ్డి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. కిందికి వెళ్లి చూడగా బయటి తలుపులు తెరిచి ఉండటంతోపాటు భార్యభర్తలిద్దరూ గదిలో కనిపించలేదు. ఇంట్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 8.52 గంటలకు భార్యభర్తలిద్దరూ బ్యాగ్‌లతో బయటికి వెళ్లినట్లు రికార్డు అయ్యింది. ఇంట్లోకి వచ్చి బీరువాను పరిశీలించగా..రూ.35 వేల నగదు, డైమండ్ బ్యాంగిల్స్, డైమండ్ రింగులు, రూబీ డైమండ్ నెక్లెస్, మంగళసూత్రం తదితర బంగారు వస్తువులు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని డాక్టర్ కొండల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఏజెంటు బిట్టు వద్ద భార్యాభర్తలిద్దరి వివరాలను సేకరించారు. నిందితులిద్దరూ రైలు మార్గం ద్వారా వెళుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేక టీమ్ వీరిని పట్టుకునేందుకు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. -
ట్రాన్స్జెండర్లతో ముజ్రా పార్టీ
చాంద్రాయణగుట్ట: బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాన్స్జెండర్లతో కలిసి అర్ధనగ్న ప్రదర్శనలతో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న సెంటర్‌పై దక్షిణ మండలం టాస్‌్కఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. మొత్తం 8 మంది యువకులతో పాటు నలుగురు ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేశారు. టాస్‌్కఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసారావు కథనం మేరకు.. బండ్లగూడకు చెందిన హమీద్ శనివారం రాత్రి స్థానిక యువకులు, ట్రాన్స్ జెండర్లతో కలిసి గౌస్‌నగర్ ఉందాసాగర్ చెరువు పక్కన లేక్ వ్యూ హిల్స్‌లోని ఓ ప్రహరీలో గుట్టు చప్పుడు కాకుండా ముజ్రా పార్టీని ఏర్పాటు చేశాడు. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ జాబ్రీ, మహ్మద్ రియాజ్, షేక్ సొహేల్, షానవాజ్ ఖాన్, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఫెరోజ్, సయ్యద్ షా ఫారూఖ్, షేక్ మహ్మద్‌లు ట్రాన్స్జెండర్లు మైలార్‌దేవ్‌పల్లికి చెందిన సొహేల్ అలియాస్ ఆర్జూ, పురానాపూల్‌కు చెందిన మహ్మద్ సైఫ్ అలియాస్ లవ్లీ, జల్పల్లికి చెందిన కరీమా బక్ష, వట్టేపల్లికి చెందిన అబ్దుల్ ఆమెర్లతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయిస్తూ భారీ శబ్ధాలతో స్థానికంగా న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. సమాచారం అందడంతో టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, బండ్లగూడ ఇన్స్పెక్టర్ కె. సత్యనారాయణ, ఎస్సైలు నవీన్, నర్సింహులు దాడులు నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. -
లంబో‘ధర’ లడ్డూ!
సాక్షి, హైదరాబాద్/బడంగ్పేట్: భాగ్యనగరంలో గణేశ్ ప్రసాదం లడ్డూ వేలం పాట కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గణపతి ప్రసాదం సొంతం చేసుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో వేలాది మంది భక్తులు వేలం పాటలో పాల్గొన్నారు. రూ.లక్షలు దాటి రూ.కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకున్నారు. రిచ్మండ్ విల్లాస్‌లో గత ఏడాది రికార్డు స్థాయిలో రూ.1.25 కోట్లకు లడ్డూ వేలం పాట జరగగా, ఈ ఏడాది అదే విల్లాస్‌లో ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ ఆర్వీ దియా ట్రస్ట్ రూ.1.87 కోట్లకు లడ్డూను వేలంలో దక్కించుకుంది. బాలాపూర్ లడ్డూ ప్రధానికి బహూకరిస్తా.. ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ లడ్డూను బీజేపీ నేత, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొలన్ శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. మంగళవారం ఉదయం మండపం నుంచి కదిలిన విఘ్నేశ్వరుడు గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకున్న అనంతరం లడ్డూకు వేలం పాట నిర్వహించారు. లింగాల దశరథ్‌గౌడ్, సామ ప్రణీత్‌రెడ్డి, గీతాదేవి, కొలన్ శంకర్‌రెడ్డి మధ్య హోరాహోరీ పాట నడిచింది. చివరకు రూ.30,01,000 కొలన్ శంకర్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. కాగా, బాలాపూర్ గణనాథుని లడ్డూను వేలంలో దక్కించుకోవడం సంతోషంగా ఉందని, ఈ లడ్డూని ప్రధాని మోదీకి బహూకరిస్తానని శంకర్‌రెడ్డి తెలిపారు. లక్షల్లో వేలం పాటలు.. ⇒ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చబండ వినాయకుని లడ్డూను రూ.16.03 లక్షలకు పీఏసీఎస్ స్థానిక చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, సమత దంపతులు దక్కించుకున్నారు. ⇒ బడంగ్‌పేట్‌లోని వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డూను రూ.11.90 లక్షలకు స్థానిక రైతు గౌర సత్తయ్య, అతని కుమారులు వీరయ్య, చంద్ర య్య, సురేశ్ కైవసం చేసుకున్నారు. ⇒ అత్తాపూర్ పోచమ్మ ఆలయం న్యూస్టార్స్ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని లడ్డూను ఏనుగుల సుభా‹Ùరెడ్డి రూ.11.16 లక్షలకు దక్కించుకున్నారు. ⇒ రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి శ్రీ వీరాంజనేయ భక్త సమాజం హనుమాన్ టెంపుల్ లడ్డూను పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి రూ.10 లక్షలకు కైవసం చేసుకున్నారు. ⇒ ఉప్పరపల్లి రెడ్డిబస్తీలో బొక్క ప్రశాంత్‌రెడ్డి రూ. 7.01 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ⇒ విజయపురి కాలనీ ఫేజ్–2లో త్రినేత్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర లడ్డూను రూ.6.5 లక్షలకు ఒర్సు రాజు సొంతం చేసుకున్నారు. ⇒ కూకట్పల్లి వినాయక భక్త బృందం బీజేపీ ఆఫీస్ దగ్గర లడ్డువేలం వేయగా రూ.5.65 లక్షలకు రంభప్పగారి సందీప్‌రావు దక్కించుకున్నాడు.సమాజ సేవలో రిచ్మండ్⇒ ఏటా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట⇒ ఈ ఏడాది 1.87 కోట్లతో రికార్డు⇒ సామాజిక సేవలకు 48 ఎన్జీవోలతో ఒప్పందం..⇒ క్రికెటర్ కపిల్‌దేవ్ సైతం ప్రశంసలుసాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత రెండు, మూడేళ్లుగా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట పాడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది రిచ్మండ్ విల్లాస్‌కు చెందిన ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్టు. ఈ ఏడాది 1.87 కోట్లకు వేలం పాట పాడి రికార్డు నెలకొల్పింది. అసలు ఇంత మొత్తం డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. ఈ నిధులను ఏం చేస్తారనే ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం.. దాతల నుంచి సేకరించి.. సాధారణంగా వేలం పాట అంటే ఎవరో ఒక వ్యక్తి పాడి ఆ లడ్డూని దక్కించుకుంటారు. కాకపోతే రిచ్మండ్ అపార్ట్‌మెంట్‌కు చెందిన వారంతా నాలుగు గ్రూపులుగా విడిపోయి వేలం పాట పాడుతుంటారు. ఎక్కువ మొత్తం పాడిన ఒక గ్రూపు వాళ్లు వేలంలో గెలిచినట్టు ప్రకటిస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మిగిలిన గ్రూపుల వాళ్లు పాడిన మొత్తం కూడా వేలంలో కలిపేస్తారు. దీంతో భారీ మొత్తం సమకూరుతోంది. ఇక అపార్ట్‌మెంట్‌కు చెందిన వారితో పాటు విదేశాల్లో ఉన్న ట్రస్టు సభ్యుల స్నేహితులు, కుటుంబసభ్యులు కూడా ఈ వేలం పాటకు డబ్బులు ఇస్తారు. 2016 నుంచి.. 2016లో రిచ్మండ్ విల్లాస్‌లో లడ్డూ వేలం ప్రారంభమైంది. అపార్ట్మెంట్లో పనిచేసే వారి పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించి లడ్డూ వేలం ప్రారంభించారు. తొలిసారి రూ.25 వేలు పలికిన లడ్డూ.. ప్రతియేడూ పెరుగుతూ ఈ ఏడాది 1.87 కోట్లకు చేరింది. గతేడాది 1.2 కోట్లు సమకూరాయి. వేలం ద్వారా వచి్చన మొత్తం డబ్బును ట్రస్టు సభ్యులు సామాజిక సేవకే వినియోగిస్తున్నారు. ఈ ఏడాది 48 ఎన్జీవోలతో ఒప్పందం కుదుర్చుకుని, వారి ద్వారా అవసరాల్లో ఉన్న వారికి విద్య, వైద్యం అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.చాలా గొప్ప పని: కపిల్‌దేవ్ ఆర్వీ దియా ట్రస్ట్ అద్భుతమైన పని చేస్తోందని ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కితాబిచ్చారు. తాను నేరుగా వచ్చి కలవాలని అనుకున్నా కుదరలేదని పేర్కొంటూ ఆయన ఓ వీడియో సందేశం పంపారు. ఒకరోజు కచి్చతంగా వచ్చి నేరుగా ట్రస్ట్ సభ్యులను కలుస్తానంటూ ఆయన చెప్పారు.ఒక్క రూపాయి తీసుకోం.. లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోం. ప్రతి రూపాయి సామాజిక సేవ చేసేందుకే వినియోగిస్తాం. పేద వారికి చదువు, వైద్యం, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గత ఎనిమిదేళ్లుగా నిరి్వరామంగా కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. – జీవన్‌రెడ్డి, ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్టు -
గణేశుడి లడ్డూ@ రూ.1.87 కోట్లు
హైదరాబాద్, సాక్షి: నగర పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంపాటలో రూ.1.87కోట్లకు ఓ భక్తుడు లడ్డూను దక్కించుకున్నాడు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి రూ.1.26కోట్లకు గణపయ్య లడ్డూను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు.. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్ మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డూ వేలంపాటలో ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ రూ.29 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఎంత దక్కించుకుంటుందో అనే చర్చ నడుస్తోంది. -
Insta Reels: పోలీస్ స్టేషన్‌ను వదల్లేదు!
హైదరాబాద్, సాక్షి: సోషల్ మీడియాలో మోజుతో ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. మొన్నీమధ్య తిరుమల పుణ్యక్షేత్రంలోనూ రీల్స్ చేసి ఆకతాయిలు భక్తుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌ను వదల్లేదు. పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ సెల్లో ఉన్న స్నేహితుడిని చూడడానికి వచ్చిన ఓ వ్యక్తి.. అక్కడ ఇన్‌స్టా రీల్ చేశాడు. పీఎస్ ఆవరణలో అంతా వీడియో తీశాడు. పైగా దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పాటను ఉంచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. A viral video filmed at the Bandlaguda Police Station in Hyderabad's Old City shows a suspect in lock-up meeting another person while recording a reel, they had posted on Instagram also. This incident highlights the issue of VIP treatment to suspects, rowdies and criminals at… pic.twitter.com/WRaLmYJoLH— Naseer Giyas (@NaseerGiyas) July 16, 2024 -
పారిపోయి ప్రేమ పెళ్లి.. యువతి పేరెంట్స్ ఇంటికి పిలిచి..
సాక్షి, హైదరాబాద్: తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన ఘటన బండ్లగూడలో జరిగింది. ఏడాది క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన ప్రేమజంట పెళ్లి చేసుకున్నారు. యువతి మైనర్ కావడంతో.. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు శిక్ష అనుభవించి.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆ యువకుడు.. యువతి కి దూరంగా ఉంటున్నాడు.‘‘మనకు కొడుకు పుట్టాడు.. చూడటానికి అయినా రమ్మని యువతితో ఆమె పేరెంట్స్ బలవంతంగా ఫోన్ చేయించారు. యువతి మాటలు నమ్మి ఇంటికి వచ్చిన అబ్దుల్ సాహెల్‌ను యువతి కుటుంబ సభ్యులు బంధించి దాడి చేశారు. దీంతో ఓ గదిలోకి వెళ్లి తలదాచుకున్న యువకుడు.. తనపై దాడి చేస్తున్నారని.. కాపాడమంటూ సెల్ఫీ వీడియో తీసుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ యువకుడిని కాపాడిన పోలీసులు కేసు నమోదు చేశారు. -
బండ్లగూడ గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
-
ఆత్మహత్యకు అసిస్టెంట్ మేనేజర్ శాలిని కారణమని ఆరోపణ
-
రూ.1.25 కోట్లు పలికిన గణేశ్ లడ్డు
బండ్లగూడ(హైదరాబాద్): వేలం పాటలో గణేశ్ లడ్డుకు అత్యధికంగా రూ.1.25 కోట్లు పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీరు కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డుకు గురువారం వేలంపాట నిర్వహించగా, ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ. 1.25 కోట్లకు దక్కించుకున్నారు. ఆర్వీ దియా ట్రస్ట్ ఆధ్వర్యంలో 150కిపైగా వ్యక్తిగతదాతలు కలిసి ఈ లడ్డును కొనుగోలు చేశారు. గతేడాది ఇక్కడి లడ్డు కు వేలంపాటలో పలికిన ధర రూ.6.28 లక్షలే. బాలాపూర్ లడ్డు రూ. 27 లక్షలు బాలాపూర్ గణనాథుని లడ్డును ఈసారి తుర్క యాంజాల్ పరిధిలోని పాటిగూడ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, రైతు దాసరి దయానంద్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. వేలంపాటలో రూ.27 లక్షలకు ఆయన సొంతమైంది. ► రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చ బండ వినాయక లడ్డును వేలం పాటలో రూ.22. 11 లక్షలకు కేటీఆర్ గ్రూప్ సభ్యులు దక్కించుకున్నారు. గతేడాది రూ.20.20 లక్షలు పలికింది. ► బడంగ్‌పేట వీరాంజనేయ భక్త సమాజం లడ్డును మాజీ ఉప సర్పంచ్ పెద్దబావి వెంకట్‌రెడ్డి రూ.17 లక్షలకు సొంతం చేసుకున్నారు. ► షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మధురపురం రెడ్డిసేవా సమితి వినాయక లడ్డును అదే గ్రామానికి చెందిన శేరి పర్వతరెడ్డి రూ. 11,11,116లకు దక్కించుకున్నాడు బాలాపూర్ గణేశుడి లడ్డును దక్కించుకున్న దాసరి దయానంద్ లడ్లు దక్కించుకున్న ముస్లింలు ► ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్జనతా గణేశ్‌మండలి వద్ద లడ్డుకు వేలం పాట నిర్వహించగా, స్థానిక ముస్లిం యువకుడు షేక్ ఆసిఫ్ రూ.1.02లక్షలకు దక్కించుకున్నాడు. ► రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని సాయినగర్ కాలనీలో లడ్డు వేలం పాట నిర్వహించగా, మండలంలోని మహాలింగపురం గ్రామానికి చెందిన మహారాజ్‌పేట్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తాహేర్ అలీ రూ. 23,100కు దక్కించుకున్నాడు. -
బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు!
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ హైదర్షాకోట్ వద్ద రోడ్డు పక్కన ఉదయం పూట వాకింగ్ చేస్తున్న ఇద్దరి ప్రాణాలను కారు ప్రమాదం బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణాలు తీసిన బద్రుద్దీన్ ఖాదిరి దగ్గర అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ చేసి పారిపోయిన బద్రుద్దిన్, ఫ్రెండ్స్ గ్యాంగ్ కనీసం గాయపడ్డ వారి గురించి సమాచారం కూడా ఇవ్వలేదు. షాకైన పోలీసులు.. బద్రుద్దిన్ వెంట గణేష్, మహమ్మద్ ఇబ్రహీం, ఫైజన్ అనే వ్యక్తులు ఉన్నారు. యాక్సిడెంట్ జరగ్గానే డామేజ్ అయిన కారులోంచి జంప్ అయ్యారు. అప్పటికప్పుడు మరో ఫ్రెండ్‌కు వీరు కాల్ చేశారు. కాసేపటి తర్వాత మరో మిత్రుడు AP 09 BJ 2588 నెంబర్ గల కారుతో స్పాట్‌కు వచ్చాడు. అక్కడ నుంచి నేరుగా మొయినాబాద్ ఫాంహౌజ్‌కు పారిపోయారు. యాక్సిడెంట్ చేశామన్న స్పృహ లేకుండా పార్టీకి ఏర్పాట్లు చేసుకున్న ఆ గ్యాంగ్‌ను చూసి.. ఫాంహౌజ్‌కు వెళ్లిన పోలీసులు షాక్ తిన్నారు. అప్పటికే ఫుడ్, డ్రింక్స్, స్టఫ్ రెడీ చేసుకుంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని బద్రుద్దిన్కు కారు ఎలా ఇచ్చారన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే? మైనార్టీ తీరి మేజర్ అయ్యాననే ఆనందంతో ఉన్న యువకుడు రాత్రంతా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పుట్టిన రోజు వేడుకలను మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో మరికొందరితో కలిసి చేసుకోవడానికి స్నేహితులతో కలిసి కారులో దూసుకుపోతున్నాడు. మితిమీరిన వేగంతో దూసుకువస్తున్న కారు లంగర్‌హౌస్–కాళిమందిర్ మార్గంలోని హైదర్షాకోట్ వద్ద మలుపు తిప్పుతూ అదుపు తప్పింది. బ్రేక్ వేయగా రోడ్డుపై ఉన్న ఇసుక ఫలితంగా స్కిడ్ అయి వాకింగ్ చేస్తున్న నలుగురిపై నుంచి దూసుకుపోయింది. కారు ఎడమ వైపు భాగం బలంగా తగలడంతో తల్లీకూతుళ్లు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వాకర్స్ తీవ్రంగా గాయపడ్డారు. పౌరుల ప్రాణాలు గాలిలో దీపంలా ఈ ఘటన నగరవాసుల భద్రతను ప్రశ్నిస్తోంది. పౌరుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయనే ఆవేదన ఉదయిస్తోంది. ఏ వైపు నుంచి ఏ వాహనం ఎంత వేగంగా వస్తుందో తెలియని పరిస్థితుల్లో.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందేనని.. నగరంలో ఇలాంటి ప్రమాదాలు షరామామూలుగా మారాయని పలువురు ఆక్రందన వ్యక్తంచేస్తున్నారు. కారును వేగంగా నడిపి ఉదయం పూట వాకింగ్ చేస్తున్న అభమూ శుభమూ తెలియని ఇద్దరి ప్రాణాలను బలిగొన్న బద్రుద్దిన్ గ్యాంగ్‌ను కఠినంగా శిక్షించాలంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. -
బండ్లగూడలో రోడ్డు ప్రమాదం
-
బండ్లగూడ యాక్సిడెంట్లో కొత్త ట్విస్ట్
సాక్షి, క్రైమ్: బండ్లగూడ సన్‌సిటీ దగ్గర ఈ వేకువ జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు నడిపి రెండు ప్రాణాల్ని బలిగొన్న బద్రుద్దీన్ ఖాదిరి దగ్గర అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. తన పుట్టినరోజు జరుపుకునేందుకు స్నేహితులతో వెళ్తున్న క్రమంలోనే ఈ యాక్సిడెంట్‌కు కారణం అయ్యాడు ఆ టీనేజర్. ఇక ప్రమాదానికి కారణమైన హోండా సివిక్ కారు పద్దతి ప్రకారం చేతులు మారలేదని తెలుస్తోంది. గతంలో ఈ కారును మహ్మద్ ఇయాజ్ అనే వ్యక్తి ఆన్లైన్లో అమ్మేశాడు. ఓఎల్ఎక్స్ డీలర్ నుంచి మరో వ్యక్తి ఆ కారు కొనుగులు చేయగా.. సదరు వ్యక్తి నుంచి బద్రుద్దీన్ ఖాదిరి కారు కొనుగోలు చేశాడు. అయితే.. ఇప్పటివరకూ ఆ హోండా సివిక్కారు పేపర్లు, అడ్రస్ మారలేదు. దీంతో ఇయాజ్‌ను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు హైదరాబాద్ శివారు బండ్లగూడలో కారు బీభత్సం సృష్టించింది. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై ఆర్మీ స్కూలు వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాక్కు వెళ్తున్న నలుగురిని బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద AP09 BJ 2588 నెంబర్ గల హోండా సివిక్ ఎర్ర కలర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లీకుమార్తెలు మృతిచెందగా.. మృతులను అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. మరో మహిళ మాళవిక తీవ్రంగా గాయపడ్డారు. బాధితులది బండ్లగూడ లక్ష్మీనగర్. గాయపడిన మాళవికను మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రిలో చేర్చించి.. చికిత్స అందిస్తున్నారు. బర్త్‌డే వేడుకల కోసం వెళ్తూ.. బద్రుద్దీన్ ఖాదిరి తన మిత్రులతో కలిసి తన 19వ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు మొయినాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బద్రుద్దీన్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణాలను తీసిన కేసులో బద్రుద్దీన్ నార్సింగి పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. VIDEO: रफ्तार का कहर! मौत बनकर पीछे से आई बेकाबू कार, रौंदती निकली 3 जिंदगियां#Hyderabad #Bandlaguda #Accident #Death #MorningWalkDeath #मौत pic.twitter.com/Ldr9Id1NIO — Divyansh Rastogi (@DivyanshRJ) July 4, 2023 ఇదీ చదవండి: వాహనాలను తొక్కుంటూ 10 మందిని బలిగొన్న ట్రక్కు -
HYD: మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మహిళలు మృతి
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా బండ్లగూడ లక్ష్మీనగర్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Bandlaguda, Hyderabad : A speeding car rammed into morning walkers killing two women and a child. The incident happened on July 4. #Hyderabad #CCTV pic.twitter.com/NxN8wLC0q6— TIMES NOW (@TimesNow) July 4, 2023 చదవండి: బంజారాహిల్స్.. స్పా ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. -
Hyderabad: పాత మంచం ఇచ్చారని పెళ్లి రద్దు చేసిన వరుడు..
మరికొద్ది గంటల్లో మూడుముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెడతాడనుకునే వరుడు ఉన్నట్టుండి పెళ్లిని రద్దు చేసుకున్నాడు. మండపం వద్దకు వచ్చేది లేదని తెగేసి చెప్పాడు. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. మౌలాలీకి చెందిన ఓ వ్యక్తి బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బండ్లగూడకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 13న ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. 19వ తేదీన(ఆదివారం) పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కాగా వధూవరులిద్దరికి ఇది రెండో పెళ్లి. అయితే అమ్మాయికి మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన గృహోపకరణ వస్తువులనే వరుడికి పెట్టుపోతలు కింద ఇస్తామని వధువు తండ్రి చెప్పారు. అయితే మంచం మాత్రం కొత్తది ఇవ్వాలని వరుడు షరతు పెట్టాడు. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఒకరోజు ముందుగా అల్మారా, మంచం, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్ ఇతర వస్తువులను వరుడి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో మంచం విడి భాగాలు బిగిస్తుండగా విరిగిపోయింది. దీంతో పాత మంచాలు పంపించారని వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకేముంది ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మరికాసేపట్లో పెళ్లనగా వరుడు మండపం వద్దకు రాలేదు. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. వధువు తరపు బంధువులు అంతా వచ్చేశారు. ఎంతసేపటికి పెళ్లి కొడుకు రాకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వెళ్లారు. అక్కడ వారితో పాత మంచం పెట్టారని, విడి భాగాలు అమర్చతుండగా విరిగిపోయిందని వరుడు మండిపడ్డాడు. కోపంతో అతని కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. కొత్త మంచం ఇవ్వమంటే పాత మంచానికి రంగులు వేసి పంపిస్తారా.. ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పారు. పెళ్లి రోజు వివాహాన్ని రద్దు చేస్తే ఎలా అని వధువు వారు బతిమాలినా వరుడు వినలేదు. దీంతో చేసేదేం లేక పెళ్లికూతురు తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో వరుడిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. -
రాజీవ్ స్వగృహ టోకెన్ అడ్వాన్స్ చెల్లింపు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన ఫ్లాట్స్‌ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు టోకెన్ అడ్వాన్స్ చెల్లించే గడువును హెచ్ఎండీఏ పొడిగించింది. ఫిబ్రవరి 15 వరకు అడ్వాన్స్ డిమాండ్ డ్రాఫ్ట్‌లను మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్, ఉర్దూగల్లీ, స్ట్రీట్‌నెం.17, హిమాయత్‌నగర్ హైదరాబాద్‌కు చేరేలా పంపించాలని సూచించింది. అనంతరం ఫ్లాట్స్ కేటాయింపునకు సంబంధించి లాటరీని పారదర్శక విధానంలో నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుతం పోచారంలో 3 బీహెచ్‌కె ఫ్లాట్స్ 16, 2బీహెచ్‌కే ఫ్లాట్స్ 570, 1 బీహెచ్‌కె ఫ్లాట్స్ 269 ఉన్నాయని తెలిపింది. ఇక బండ్లగూడలో 1బీహెచ్‌కే ఫ్లాట్స్ 344, సీనియర్ సిటీజన్లకు 1 బీహెచ్‌కే ఫ్లాట్స్ 43 ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కు రూ.3 లక్షలు, 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కు రూ.2 లక్షలు, 1 బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.లక్ష చొప్పున టోకెన్ అడ్వాన్స్‌గా చెల్లించాలని కోరింది. -
హైదరాబాద్ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం !
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు భయాందోళ చెందారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి హైదర్షాకోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు చేశారనే విషయం తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పాఠశాలలోని సామగ్రి గది ఎదుట, సైన్స్ ల్యాబ్‌లోని రెండు ప్రాంతాలలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఎవరో దుండగులు ఈ పూజలను చేసినట్టు గుర్తించారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా వీటిని చూపి భయభ్రాంతులకు గురయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మదన్ కుమార్ వీటితో ఏమి కాదని తంత్రాలు వంటివి ఏమి లేవని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. వాటిని తొలగించి పాఠశాలను శుభ్రం చేశారు. అవరణలోని సీసీ కెమెరాలను సైతం దుండగులు మాయం చేసి ఈ క్షుద్ర పూజలు గమనార్హం. చదవండి: ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత -
RTO Bandlaguda: ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్రేజీ నంబర్స్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపైన వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. శుక్రవారం బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో 29 ప్రత్యేక నెంబర్లపైన రూ.8,40,167 ఆదాయం లభించినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. ‘టీఎస్12ఈడబ్ల్యూ 0001’ నెంబర్ కోసం ఒక వాహనదారుడు రూ.2,82,786 చెల్లించి సొంతం చేసుకున్నారు. ‘టీఎస్12ఈడబ్ల్యూ 0009’ నెంబర్ కోసం మరో వాహనదారుడు రూ.1,69,999 చెల్లించినట్లు జేటీసీ పేర్కొన్నారు. రవాణాశాఖ దక్షిణమండలం జోన్ అయిన బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలోనూ ప్రత్యేక నెంబర్లపైన పోటీ కనిపించడం విశేషం. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో టీఎస్09 ఎఫ్యూ 9999 నంబరును రూ.10,49,999కు కోట్ చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. టీఎస్ 09 ఎఫ్‌వీ 0001 నంబరుకు రేజర్ గేమింగ్ సంస్థ రూ.3,50,000 చెల్లించింది. (క్లిక్ చేయండి: ఆర్టీసీపై మళ్లీ కోర్టుకెక్కిన సీసీఎస్) -
రికార్డులు బద్దలు.. రూ. 60 లక్షలు పలికిన లడ్డూ! ఎక్కడంటే..
సాక్షి, బండ్లగూడ: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం రికార్డు స్థాయిలో రూ. 60.83 లక్షలు పలికింది. సన్‌సిటీ కీర్తి రిచ్మండ్ విల్లాస్లోని ఆర్మీ దివ్యా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. | గతేడాది ఈ లడ్డూ రూ.41 లక్షలు పలికింది. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ రూ.24.60 లక్షలు , అల్వాల్ కానాజీగూడ లడ్డూ రూ. 46 లక్షలు పలికాయి. వీటి రికార్డును బ్రేక్ చేస్తూ బండ్లగూడ జాగీర్ లడ్డూ రూ.60.83 లక్షలు పలకడం గమనార్హం. ఆర్వీ దివ్యా ట్రస్ట్‌కు డాక్టర్ అర్చనాసిన్హా, పూర్ణిమా దేశ్‌పాండే మేనేజింగ్ ట్రస్టీలుగా ఉన్నారు. ఇదీ చదవండి: నష్టాల సాకు.. బస్సులకు బ్రేక్! -
Bandlaguda: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలానికి వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 3,716 ఫ్లాట్లకు సంబంధించి 39,082 మంది వినియోగదారులు ఆన్లైన్లో బిడ్లు దాఖలు చేశారు. ఇందులో బండ్లగూడలోని 2,246 ఫ్లాట్లకు 33,161 మంది బిడ్లు దాఖలు చేశారు. పోచారంలోని 1470 ఫ్లాట్టకు 5921 మంది బిడ్లు దాఖలు చేశారు. బిడ్లు దాఖలు చేసిన వారిలో లాటరీ ద్వారా ఎంపిక చేసి ఫ్లాట్లను కేటాయించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి పోచారం ఫ్లాట్స్ వినియోగదారులకు లాటరీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూ బ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తున్నారు. బండ్లగూడ ఫ్లాట్స్‌కు మంగళవారం లాటరీ నిర్వహించనున్నారు. బండ్లగూడ డీలక్స్ ఫ్లాట్స్ వినియోగదారులకు బుధవారం లాటరీ నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. (క్లిక్: పబ్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు) -
తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు,రాజీవ్ స్వగృహ ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం!
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ ఇళ్లను సేల్కు పెట్టింది. గతంలో కట్టిన ఇళ్లను అమ్మేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. తక్కువ ధరకే ఫ్లాట్లు అమ్మకానికి రావడంతో.. వాటిని సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు పోటీపడుతున్నారు. ప్రభుత్వ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..బండ్లగుడాతో పాటు పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకానికి ఈనెల11న హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఫ్లాట్ల అమ్మకపు నోటిఫికేషన్‌కు ఊహించని రీతిలో రెస్సాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ల ధర తక్కువ కావడంతో మే 12నుంచి ప్రారంభమైన అప్లికేషన్ల రిజిస్ట్రేషన్లు మే 23 వరకు 3వేల ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు 14వేల మంది అప్లయ్ చేశారు. ఈ అప్లికేషన్ల సంఖ్య 20రోజుల్లో 30వేలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 3,271 ఫ్లాట్లు హైదరాబాద్ బండ్లగూడలో 1501 ఫ్లాట్లు, గట్కేసర్ సమీపంలో ఉన్న పోచారంలో 1470 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది.వచ్చే నెల 14వ తేదీన గడువు ముగుస్తుండడంతో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు భారీ ఎత్తున అప్లయ్ చేస్తున్నారు. లాటరీ సిస్టమ్‌లో స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం..లాటరీ ద్వారా వివిధ ఫ్లాట్ల స్కైర్ ఫీట్ విలువ ఎంతనేది ఫైనల్ చేయనుంది. ఇందుకోసం ఒక వ్యక్తి రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉండగా..లాటరీలో కార్నర్ ఫ్లాట్ల కొనుగోలు దారుల కుటుంబ సభ్యులు, వారి బంధువులతో పాటు ఉద్యోగులు సైతం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.కాగా పెండింగ్‌లో ఫ్లాట్ల పనులను త్వరగా పూర్తి చేసి రీసేల్ పెట్టే అవకాశం ఉందని, అదృష్టం ఉంటే రీసేల్‌లో సైతం ఫ్లాట్లను సొంతం చేసుకోవచ్చు. స్వగృహా ఫ్లాట్లును ఎక్కడ ఎక్కువగా కొంటున్నారంటే ఓఆర్ఆర్, నాగోల్ మెట్రోస్టేషన్, సిటీ దగ్గర్లో ఉండడంతో పోచారం కంటే బండ్లగూడ స్వగృహలో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. కాబట్టే 14వేల అప్లికేషన్లలో 12వేల మంది బండ్లగూడ ఫ్లాట్లపై మక్కువ చూపుతుంటే కేవలం 2వేల మంది మాత్రమే పోచారం ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. బండ్లగూడా స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే మే 23 వరకు బండ్లగూడాలో 345..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లను, 444..3బీహెచ్‌కే ఫ్లాట్లను,712..2బీహెచ్‌కే స్వగృహా ఫ్లాట్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. పోచారం స్వగృహా ఫ్లాట్లు ఎన్నంటే మే 23 వరకు పోచారంలో 91..3బీహెచ్‌కే డీలెక్స్ ఫ్లాట్లు, 53..3బీహెచ్‌కే ఫ్లాట్లు, 884..2బీహెచ్‌కే ఫ్లాట్లు, 442..1బీహెచ్‌కే ఫ్లాట్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. -
Hyderabad: కరోనా కలకలం.. అపార్ట్మెంట్లో 10 మందికి కరోనా
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని పీరం చెరువులో కరోనా కలకలం రేపుతోంది. స్థానిక గిరిధారి అపార్ట్మెంట్లో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అపార్ట్మెంట్ వాసికి కరోనా సోకింది. అతని నుంచి అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే అప్రమత్తంమైన బండ్లగూడ మున్సిపల్ సిబ్బంది.. అపార్ట్మెంట్ మొత్తం శానిటేషన్ చేశారు. రేపు(ఆదివారం)అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ కోవిడ్ రాపిడ్ టెస్ట్ చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అదేవిధంగా అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. -
ఇండియన్ ర్యాంకింగ్స్‌లో 'గ్లెండెల్' కు 8వ స్థానం
-
చిన్నారులపై కుక్కల దాడి
సాక్షి, రాజేంద్రనగర్: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. 24 గంటల్లో ఐదుగురు చిన్నారులపై దాడి చేశాయి. ఓ బాలుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. బండ్లగూడ పద్మశ్రీహిల్స్ కాలనీ ప్రాంతంలో రఘు(7) తన తండ్రి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన టీ కొట్టు వద్ద గురువారం సాయంత్రం నిలబడి ఉన్నాడు. బాలుడి తండ్రి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటివద్ద టీలు ఇచ్చేందుకు వెళ్లాడు. ఈ సమయంలో గుంపుగా వచ్చిన వీధి కుక్కలు రఘుపై దాడి చేశాయి. ఈ దాడిలో రఘు తల, నుదుటిపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో రఘును సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చిన్నారికి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం బండ్లగూడలో కూలీ పని చేసేందుకు తండ్రి తో వచ్చిన మరో బాలుడు కార్తీక్(7)పై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడి వీపు, చేతులు, చెంపలపై తీవ్ర గాయాలయ్యాయి. 24 గంటల్లో ఐదుగురు చిన్నారులు కుక్కల దాడిలో గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫిర్యాదు చేసినా పట్టని అధికారులు... బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి వీధి కుక్కలతో ఇబ్బంది పడుతున్నామని నిత్యం 20కి పైగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా కమిషనర్‌తో పాటు ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
బీ అలెర్ట్.. జంతు కళేబరాలతో కల్తీ నూనె..
ఉరుకులు.. పరుగుల నగరజీవికి కాసింత విశ్రాంతి దొరికేది భోజనం దగ్గరే.. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కొందరు ఉద్యోగులు ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటారు. ఆకలి తీర్చుకునేందుకు టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు, చిరుతిళ్ల బండ్లను ఆశ్రయించాల్సిందే.. నోరూరించే బిర్యానీ.. వేడివేడి బజ్జీలు.. బాగా నూనె దట్టించిన దోశ.. ఇలా ఏది తిన్నా ఆరోగ్యానికి డ్యామేజీ అయినట్లే.. ఎవరు ఏ కల్తీ నూనె వాడుతున్నారో తెలియకపోవడంతో రోగాలు తప్పడం లేదు. కొన్నిచోట్ల జంతువుల వ్యర్థాలను మరిగించి తీసిన నూనెలతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఆ నూనే వివిధ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి బేగంబజార్ కేంద్రంగా మార్కెట్లో విక్రయించి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడ, శాస్త్రిపురం, జలపల్లి, మల్లాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట, బాబానగర్, బండ్లగూడ, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాలు పశువ్యర్థాలతో కల్తీ నూనె తయారీకి అడ్డాగా మారాయి. బ్రాండెడ్ ఆయిల్ కంపెనీల స్టిక్కర్లతో బేగంబజార్ కేంద్రంగా వాటిని హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. పశువుల వ్యర్థాలతో నూనె తీసే ప్రాంతాల్లోకి ప్రవేశించడం సామాన్యులేవరికీ సాధ్యం కాదు. కోటలను తలపించే ప్రహరీల మధ్య ఈ గోడాన్లు ఉంటాయి. అక్కడ పనిచేసే వారంతా బిహార్, యూపీ, అసోం, ఓడిశా రాష్ట్రాలకు చెందిన యువకులే.. కొత్తవారు కనిపిస్తే దాడులకు ఏమాత్రం వెనకాడరు. ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమల ముసుగులోనూ పశువ్యర్థాలతో తీసిన నూనె కలిపి పేరొందిన బ్రాండ్లుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: నూనెల ధరలు పెరుగుదల పశువుల వ్యర్థాలతో.. పశువుల ఎముకలు, కొమ్ములు, మాంసం.. చనిపోయిన జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నారు. మూతపడిన కార్ఖానాల్లో భారీ ఇనుప గోళాలు, గిన్నెల్లో పశువుల ఎముకలు, కొవ్వును కరిగేదాకా మరగబెట్టి నూనె తీస్తున్నారు. దాన్ని డబ్బాలు, ప్యాకెట్లలో నింపి బ్రాండెడ్ లేబుళ్లను అంటించి జనంపైకి వదులుతున్నారు. కోట్ల రూపాయల విలువైన ఈ రోత పుట్టించే దందా సాగుతోంది మహానగర పరిధిలోనే.. ఏళ్లతరబడి ఖాళీగా పోస్టులు విశ్వ నగరం వైపు పరుగులు తీస్తూ కోటి మందికి పైగా జనాభా కలిగిన హెదరాబాద్ మహానగరంలో ఆహార భద్రతా విభాగం సిబ్బంది సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. జీహెచ్ఎంసీ ఆహార తనిఖీ విభాగానికి సర్కిల్ ఒకరి చొప్పున 30 పోస్టులు మంజురు కాగా, పని చేస్తోంది 20 మంది మాత్రమే. ఐదు గెజిటెడ్ పోస్టులకు గాను ఇద్దరే పనిచేస్తున్నారు. సర్కిల్ స్థాయిలో 10 పోస్టులు, గెజిటెడ్ స్థాయిలో మూడు పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. ఈ లెక్కన గ్రేటర్ హైదరాబాద్‌లో 200 మందికి తగ్గకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ఇటీవల కొన్ని ఘటనల్లో.. ఏడు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లోని ఒక ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారీ బండారం బయటపడింది. అక్టోబర్‌లో శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు మైలాదేవులపల్లి పరిధిలోని అలీనగర్‌లో జంతు కళేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్న మూడు కేంద్రాలపై దాడులు చేసి సీజ్ చేశారు. నగర శివార్లలోని జల్పల్లి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో పెద్ద పెద్ద కడాయిలు ఏర్పాటు చేసి జంతు కళేబరాలను ఉడికిస్తుండగా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 160 డమ్ముల నూనె సీజ్ చేశారు. జల్పల్లి నుంచి పహాడీషరిఫ్‌కు వెళ్లే దారిలో కల్తీ నూనె దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న కేన్సర్ కేసులు గ్రేటర్లో ఏటేటా కేన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం 12వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, అందులో అత్యధిక కేసులు కల్తీ ఆయిల్ వల్లే వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి వాడిన ఆయిల్‌ను మళ్లీ వినియోగించడంతో రోగాలు పెరుగుతున్నాయి. కల్తీ నూనెతో రక్తంలో రక్తపోటు, మధుమేహంతో పాటు రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కల్తీ నూనె కాలేయం, కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందులోని హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ కేన్సర్‌కు కారణమవుతుంది. ఆ నునె వాసన పీల్చినా ప్రమాదమే.. ఫిర్యాదులు అందితేనే.. ఈ విషపూరిత నూనెను అరికట్టేందుకు అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు అందితే దాడిచేసి సీజ్ చేయడం.. తర్వాత ఫిర్యాదు అందే వరకు సంబంధం లేదనే విధంగా సంబంధిత అధికారులు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్న సర్కారీ శాఖల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది. ఫిర్యాదులు అందినప్పుడు నగర స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కల్తీ మాఫియాపై మొక్కుబడిగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. శుద్ధి చేసిన నూనెను మరిగిస్తే పొంగు రాదు. రంగు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. జంతువుల కళేబరాలతో చేసిన నూనె పొంగుతో పాటు దుర్వాసన వస్తుంది. – డాక్టర్ ఆర్వీ రాఘవేందర్రావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
పాతబస్తీ బండ్లగూడలో విషాదం..
సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడ మహ్మదియా నగర్‌లోని ఓ పహిల్వాన్‌కు చెందిన ఫామ్‌హౌస్ గ్రానైట్ గోడ కూలి పక్కనే ఉన్న రెండిళ్లపై పడింది. ఈ ఘటనలో 11మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన వారే. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని పోలీసులు మొగల్‌పురలోని అస్రా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ అసద్, ఎమ్మెల్యే అక్బర్ పరామర్శించారు. గ్రానైట్ రాయితో నిర్మించిన ఈ గోడ పాతది కావడం.. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కూలి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో ఘటనలో తల్లీకూతుళ్లు మృతి.. ఇబ్రహీంపట్నం(హైదరాబాద్): ఇంటిగోడ కూలిపోయి తల్లీ కూతుళ్లు మృతి చెందగా కుమారుడుకి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని మల్‌శెట్టిగూడలో క్యామ సువర్ణ(37) కూతురు స్రవంతి (14), కుమారుడు సంపత్ (18)తో కలసి ఓ ఇంటిలో నివాసముంటోంది. సోమవారం నుంచి వర్షం కురుస్తుండటంతో ఇంటి గోడలు బాగా నానిపోయాయి. దీంతో రాత్రి 8 గంటల సమయంలో ఇంటి పైకప్పు గోడలు కూలి సువర్ణ, స్రవంతి, సంపత్‌లపై పడ్డాయి. తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు సంపత్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే అతడిని ఇబ్ర హీంపట్నం ఆస్పత్రికి తరలించారు.