
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని పీరం చెరువులో కరోనా కలకలం రేపుతోంది. స్థానిక గిరిధారి అపార్ట్‌మెంట్‌లో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అపార్ట్‌మెంట్ వాసికి కరోనా సోకింది. అతని నుంచి అపార్ట్‌మెంట్‌లో ఉన్న వ్యక్తులకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది.
దీంతో అపార్ట్‌మెంట్ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే అప్రమత్తంమైన బండ్లగూడ మున్సిపల్ సిబ్బంది.. అపార్ట్‌మెంట్ మొత్తం శానిటేషన్ చేశారు. రేపు(ఆదివారం)అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ కోవిడ్ రాపిడ్ టెస్ట్ చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అదేవిధంగా అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment