గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు, బైక్ ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
నాగోలు (హైదరాబాద్) : గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు, బైక్ ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడ ఇంద్రప్రస్తావన్ కాలనీ రోడ్ నంబర్-8లో నివాసముండే గోనేందర్ ఈ నెల 14వ తేదీన ఉదయం కుటుంబ సభ్యులతో కలసి రాజమండ్రి పుష్కరాలకు వెళ్లాడు.
కాగా గురువారం ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోని నాలుగు తులాల బంగారం, రూ.30 వేలు, కిలోన్నర వెండి ఆభరణాలు, హోండా బైకు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.