జగద్గిరిగుట్ట మైసమ్మ నగర్‌లో ఓ ఇంట్లో దొంగలు పడి లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరాణాలు చోరీ చేశారు.
కూకట్‌పల్లి (హైదరాబాద్) : జగద్గిరిగుట్ట మైసమ్మ నగర్‌లో ఓ ఇంట్లో దొంగలు పడి లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరాణాలు చోరీ చేశారు. ఇంటి యజమాని జలందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి రెండు రోజుల క్రితం గోదావరి పుష్కరాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఇంటి తాళాలు బద్దలు కొట్టుకుని లోపల బీరువా తలుపులు తెరచి చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది.
రూ.10వేల నగదుతోపాటు నాలుగు బంగారు ఉంగరాలు, తులం నల్లపూసల గొలుసు చోరీకి గురైనట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.