పుణ్య స్నానం చేయడానికి పవిత్ర గోదావరిలో మునిగింది ఓ మహిళ..పైకి లేచి చూసే సరికి ఆమె మెడలోని 10 కాసుల బంగారం మాయం..అయ్యో..అయ్యో..
రాజమండ్రి : పుణ్య స్నానం చేయడానికి పవిత్ర గోదావరిలో మునిగింది ఓ మహిళ..పైకి లేచి చూసే సరికి ఆమె మెడలోని 10 కాసుల బంగారం మాయం..అయ్యో..అయ్యో..అంటూ నీటిలో వెదికినా ఫలితం శూన్యం.. జారి పడిపోయింటాయనుకున్నారంతా.. కానీ అక్కడ జరిగింది వేరు. మరో సంఘటన చూస్తే.. పాత సోమాలమ్మగుడి ప్రాంతానికి చెందిన కుడుపూడి వెంకట ఆంజనేయులు బుధవారం ఉదయం 11 గంటలకు బ్యాంకులో రూ.1.45 లక్షలు డిపాజిట్ చేయడం కోసం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న స్టేట్ బ్యాంకు శాఖకు వెళ్లారు. డబ్బులు లెక్కిస్తుండగా బ్యాంకు చలానా ఫారం ఎలా పూర్తి చేయాలంటూ అడిగాడు ఓ అపరిచితుడు.
అతడికి ఆంజనేయులు సమాధానం చెబుతుండగా వెనుక నుంచి వచ్చిన మరో వ్యక్తి డబ్బుల సంచి లాక్కులి పారిపోయాడు. వెంబడించినా ప్రయోజనం లేదు. అప్పటికే ఆ దొంగలిద్దరూ పుష్కర యాత్రికుల్లో కలిసిపోయారు. పుష్కరాల్లో భద్రత కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అడుగడుగునా సీసీ కెమెరాలు చేసి, పోలీసులను ఉంచింది. అయినా దొంగతనాలను నిలువరించలేకపోతోంది.