
సాక్షి, హైదరాబాద్: తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన ఘటన బండ్లగూడలో జరిగింది. ఏడాది క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన ప్రేమజంట పెళ్లి చేసుకున్నారు. యువతి మైనర్ కావడంతో.. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు శిక్ష అనుభవించి.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆ యువకుడు.. యువతి కి దూరంగా ఉంటున్నాడు.
‘‘మనకు కొడుకు పుట్టాడు.. చూడటానికి అయినా రమ్మని యువతితో ఆమె పేరెంట్స్ బలవంతంగా ఫోన్ చేయించారు. యువతి మాటలు నమ్మి ఇంటికి వచ్చిన అబ్దుల్ సాహెల్‌ను యువతి కుటుంబ సభ్యులు బంధించి దాడి చేశారు. దీంతో ఓ గదిలోకి వెళ్లి తలదాచుకున్న యువకుడు.. తనపై దాడి చేస్తున్నారని.. కాపాడమంటూ సెల్ఫీ వీడియో తీసుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ యువకుడిని కాపాడిన పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment