parents attack
-
పారిపోయి ప్రేమ పెళ్లి.. యువతి పేరెంట్స్ ఇంటికి పిలిచి..
సాక్షి, హైదరాబాద్: తమ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన ఘటన బండ్లగూడలో జరిగింది. ఏడాది క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన ప్రేమజంట పెళ్లి చేసుకున్నారు. యువతి మైనర్ కావడంతో.. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు శిక్ష అనుభవించి.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆ యువకుడు.. యువతి కి దూరంగా ఉంటున్నాడు.‘‘మనకు కొడుకు పుట్టాడు.. చూడటానికి అయినా రమ్మని యువతితో ఆమె పేరెంట్స్ బలవంతంగా ఫోన్ చేయించారు. యువతి మాటలు నమ్మి ఇంటికి వచ్చిన అబ్దుల్ సాహెల్‌ను యువతి కుటుంబ సభ్యులు బంధించి దాడి చేశారు. దీంతో ఓ గదిలోకి వెళ్లి తలదాచుకున్న యువకుడు.. తనపై దాడి చేస్తున్నారని.. కాపాడమంటూ సెల్ఫీ వీడియో తీసుకుని.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ యువకుడిని కాపాడిన పోలీసులు కేసు నమోదు చేశారు. -
Parenting: ఓడినప్పుడు అండగా నిలవండి
పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరూ గెలవరు. కొందరు ఓడుతారు. గెలవడానికి ఎన్ని కారణాలో ఓడటానికి అన్ని కారణాలు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు ఒక క్షణం పిల్లలు తెచ్చిన ఫలితాలతో డిస్ట్రబ్ అయినా దండించే సందర్భం ఇది కాదు. పిల్లల ఓటమిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు అవసరం. వారిని గమనించి తిరిగి ముందుకు నడపడమే అవసరం. ఓడిన పిల్లలకు అండగా నిలవండి. కొందరు లెక్కలేని పిల్లలు ఉంటారు. వీరు ఎగ్జామ్స్ బాగానే రాసినా రిజల్ట్స్ తేడాగా వస్తే పట్టించుకోరు. ఫెయిల్ అయితే మరీ కొంపలు మునిగినట్టుగా కూచోరు. నెక్ట్స్ టైమ్ చూసుకుందాం అన్నట్టు ఉంటారు. ఈజీగా ఉంటారు. కాని కొందరు పిల్లలు పరీక్షలు ఎలా రాశారో ఇంట్లో కచ్చిత అంచనాతో చెప్పరు. ఫెయిల్ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. ఫెయిల్ అయితే ఇక పూర్తిగా ముడుచుకుపోతారు. తల్లిదండ్రుల ముందుకు రారు. బంధువుల్లో పరువుపోయిందని బాగా బెంబేలు పడతారు. ఎవరితోనూ కలవరు. ఇక భవిష్యత్తు ముగిసినట్టే భావిస్తారు. వీరితోనే సమస్య. వీరు ఏ క్షణమైనా పేలే బుడగలాంటివారు. ఇలాంటి వారితో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల్ని, బంధువుల్ని అప్రమత్తం చేయాలి. ఈ దశ నుంచి వారిని సక్రమంగా బయటపడేయాలి. ఫెయిల్ ఎందుకు? ఈ ప్రశ్న పిల్లల్ని అడిగే ముందు పెద్దలే ప్రశ్నించుకోవాలి. పిల్లల్ని సరైన బడి/కాలేజ్‌లోనే చేర్చారా? అక్కడ పాఠాలు సరిగా జరిగాయా? సిలబస్ పూర్తి చేశారా? నోట్స్ సరిగా ఇచ్చారా? స్టూడెంట్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఫాలో అవుతున్నాడో ఎందులో వీక్ ఉన్నాడో టీచర్లు ఇంటికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారా? పిల్లలకు ట్యూషన్ అవసరమైతే సరైన ట్యూషన్ పెట్టించారా? పిల్లలు చదివే వాతావరణం ఇంట్లో ఉందా? వారు చదువుకునే వీలు లేకుండా అస్తమానం పనులు చెప్తూ, టీవీ మోగిస్తూ, ఇంట్లో నాన్ సీరియస్ వాతావరణం పెట్టారా? పరీక్షల సమయంలో సిలబస్‌ను సరిగా విభజించుకుని చదవగలిగాడా? ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నలకు టైమ్ మేనేజ్మెంట్ చేయగలిగాడా? ఎగ్జామ్ భయంతో ఏమీ రాయలేకపోయాడా?... ఇవన్నీ ఫెయిల్ అవడానికి కారణాలు. టెన్త్ వరకూ అందరికీ తప్పదు కాని ఇంటర్ విషయానికి వచ్చేసరికి ఇష్టమైన కోర్సులో చేర్చారా? చదవే ఆసక్తి, శక్తి ఉన్న సబ్జెక్ట్స్లోనే చేర్చారా?... ఇవీ ముఖ్యమైన విషయాలే. ఏం చేయకూడదు? పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏడ్చి, నెత్తి బాదుకుని భయభ్రాంతం చేస్తారు. ఏమాత్రం కూడదు. ఆడపిల్లైతే ‘పెళ్లి చేసి పారేస్తాం’ అని మగపిల్లలైతే ‘నాలుగు గేదెలు కొనిస్తాం. మేపుకో’ అని అనడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏం చేయాలి? ‘మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరేం పర్వాలేదు’ అని చెప్పాలి. ‘నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఈ పరీక్షలు పాస్ కావడంలో నీకు ఎదురైన సమస్య ఏమిటి?’ అని తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లవాడు బాగా రాశాననే నమ్మకం ఉంటే రీవాల్యుయేషన్‌కు వెళ్లాలి. ప్రతి స్టూడెంట్‌కు ఎవరో ఒక టీచర్/లెక్చరర్ మీద గురి ఉంటుంది. కొంత చనువు ఉంటుంది. అలాంటి వారి దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. ఇది తాత్కాలిక అడ్డంకి అని దీనిని దాటి ముందుకు పోవచ్చని భరోసా ఇవ్వాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధిస్తావ్ అని చెప్పాలి. స్నేహితులతో కూడా ఇవే మాటలు చెప్పించాలి. ఆరోగ్యం, ఆయుష్షు ఉంటే జీవితంలో చాలా సాధించవచ్చని ఆశ కల్పించాలి. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకూడదు. చదువు ముఖ్యమే కాని చదువు కంటే జీవితం ముఖ్యమనే విషయం బోధపరచాలి. తల్లిదండ్రులు కూడా అదేసంగతి తెలుసుకోవాలి. ‘తక్కువ మార్కులతో పాసైన వారు ఎక్కువ మార్కులతో పాసైనవారిని భవిష్యత్తులో జీతానికి పెట్టుకోవచ్చు’. చెప్పలేం కదా. పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. -
పోలీసుల సమక్షంలో ప్రేమ జంట పెళ్లి
-
పోలీసుల సమక్షంలో ప్రాణదీప్ - సౌజన్య పెళ్లి
సాక్షి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన ప్రేమజంట పెళ్లి వ్యవహారం పోలీసుల జోక్యంతో సుఖాంతమైంది. బుధవారం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుందామనుకున్న ప్రాణదీప్, సౌజన్యలను యువతి కుంటుంబ సభ్యులు విడదీసిన సంగతి తెలిసిందే. పెళ్లి పీటలపై నుంచి తనకు కాబోయే భార్యను ఎత్తుకెళ్లారని యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతీ, యువకులు మేజర్లు కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సవాలుగా తీసుకున్నారు. ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో సౌజన్యకు కౌన్సిలింగ్ చేయగా.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెపింది. దీంతో వారిద్దరినీ టూ టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల సెక్యూరిటీ మధ్య శుక్రవారం పట్టణంలోని ఆర్యసమాజ్‌లో స్నేహితుల సమక్షంలో ప్రాణదీప్, సౌజన్య వివాహం జరిగింది. కాగా, ఇష్టపడే వివాహం చేసుకున్నానని.. తనపై ఎవరి ఒత్తిడి లేదని యువతి కోర్టులో చెప్పడంతో పోలీసులు సౌజన్య కుంటుంబ సభ్యులపై కిడ్నాప్ కేసు సమోదు చేశారు. -
ప్రాణదీప్- సౌజన్య ప్రేమకథ సుఖాంతం
సాక్షి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో వివాదాస్పదంగా మారిన ప్రేమజంట పెళ్లి వ్యవహారం పోలీసుల జోక్యంతో సుఖాంతమైంది. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్, మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్యలు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మరో ఐదు నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా ఆర్య సమాజ్‌కు చేరుకున్న సౌజన్య బంధువులు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీంతో పెళ్లి కొడుకు స్నేహితులు పోలీసులకు ఫోన్ చేయగా.. వారు అక్కడికి చేరుకునేలోపే బంధువులు సౌజన్యను మక్లూరుకు తీసుకెళ్లారు. వెంటనే మక్లూరు వెళ్లిన టూ టౌన్ పోలీసులు బాధిత యువతిని కలిశారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా సెక్షన్ 365 కింద కుటుంబ సభ్యులపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో సౌజన్యకు కౌన్సిలింగ్ చేయగా.. ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరినీ టూ టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా 24 గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాల అనంతరం పోలీసుల సహకారంతో చివరికి ప్రేమజంట ఒక్కటి కానుంది. -
ప్రేమపెళ్లికి బ్రేక్.. యువతిని ఎత్తుకెళ్లిన బంధువులు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : ప్రేమ జంట వివాహాన్ని యువతి బంధువులు అడ్డుకున్నారు. వరుడిపై దాడి చేసి పెళ్లి కూతురును వేదికపై నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్, మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్యలు నాలుగేళ్లుగా ప్రే మించుకున్నారు. వివాహం చేసుకునేందుకు బుధవారం నగరంలోని ఆర్యసమాజ్‌కు వచ్చారు. మరో 15 నిమిషాలలో వివాహం జరుగుతుందనగా పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులకు విషయం తెలిసింది. వెంటనే అక్కడకు వచ్చి పెండ్లి దుస్తులు ధరించి ఉన్న ప్రాణదీప్‌ను చితక బాదా రు. ఆర్యసమాజ్ నుంచి సౌజన్యను బలవంతంగా బైక్‌పై ఎత్తుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆర్యసమాజ్ బయట రోడ్డుపై కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. పెండ్లి కొడుకు స్నేహితులు డయల్ 100కు ఫోన్‌చేయగా, అక్కడికి 2వ టౌన్ పోలీసులు చేరుకున్నారు. అప్పటికే సౌజన్యను అక్కడి నుంచి బంధువులు తీసుకెళ్లిపోయారు. తమ పెళ్లిని అడ్డుకున్న సౌజన్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై ప్రాణదీప్ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు. తామిద్దరం మేజర్లైనప్పటికీ పెండ్లిని అడ్డుకున్నారని, సౌజన్యను బలవంతంగా ఎత్తుకుపోయారని ప్రాణదీప్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అయితే ప్రేమజంట మేజర్లా కాదా అనే విషయాన్ని దర్యాప్తు చేసి వారికి న్యాయం చేస్తామని ఎస్సై పేర్కొన్నారు. దాడిలో గాయపడిన ప్రాణదీప్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
చిన్నారిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నం
నస్రుల్లాబాద్(బాన్సువాడ) : ఐదేళ్ల చిన్నారిపై దారుణానికి యత్నించాడో కిరాతకుడు. ఆడించే నెపంతో ఇంటికి తీసుకెళ్లి అ త్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు నిందితుడ్ని కట్టేసి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరోవైపు నిందితుడ్ని ఉరి తీయాలంటూ అఖిలపక్ష నేతలు రాస్తారోకో చేయడంతో గంట పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. స్థానికంగా కలకలం రేపి న ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 40 ఏళ్ల హైమద్ హుస్సేన్.. తన ఇంటి సమీపంలోని ఐదేళ్ల చిన్నారితో చనువుగా ఉండేవాడు. సోమవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపను ఆడించే నెపంతో ఇంట్లోకి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికే బాలిక తల్లి అటు వైపు వెళ్లింది. చిన్నారిపై హైమద్ హుస్సేన్ అత్యాచారయత్నం చేస్తుండడాన్ని గమనించిన ఆమె.. నిందితుడ్ని తిట్టి పాపను తీసుకెళ్లి పోయింది. భర్త రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడంతో ఈ విషయం చెప్పలేదు. మంగళవారం ఉదయం తన భర్తకు చెప్పగా, కోపోద్రిక్తుడైన ఆయన నిందితుడ్ని కరెంట్‌స్తంభానికి కట్టేసి చితకబాదాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హుస్సేన్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ బజరంగ్‌దల్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాస్తారోకోకు దిగారు. బోధన్–బాన్సువాడ ప్రధాన రహదారిపై గంట సేపు బైఠాయించారు. నిందితుడ్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. -
అమ్మాయి ఫొటోలు తీశాడని దాడి..
చేవెళ్ల: తమ అమ్మయితో ఎందుకు చనువుగా ఉన్నావు, ఫొటోలు ఎందుకు తీశావని కుటుంబీకులు ఓ యువకుడిపై దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కతనం ప్రకారం.. చేవెళ్ల మండలంలోని తంగడపల్లి గ్రామానికి చెందిన తెలుగు మల్లయ్య కొడుకు ప్రభాకర్ (22) శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. ప్రతిరోజు గ్రామం నుంచి కళాశాలకు వెళ్లి వస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మరికొందరు సైతం శంకర్‌పల్లిలోని వివిధ పాఠశాలలకు వెళ్తున్నారు. అయితే, ప్రభాకర్ వీరిలో ఓ అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని, మార్చి 28న బాలిక ఫొటోలు తీశాడని ఆమె కుటుంబీకులు మరుసటి రోజు అతడిని పిలిపించి దాడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు విషయం కుటుంబసభ్యులకు చెప్పి బాధపడ్డాడు. గ్రామంలో పంచాయతీ పెట్టి మాట్లాడుదామని ప్రభాకర్‌కు తండ్రి నచ్చజెప్పాడు. అయితే, మార్చి 30న ఉదయం పొలానికి వెళ్లిన యువకుడు పురుగుల మందు తాగాడు. తనపై దాడి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులకు ఫోన్ చేశాడు. వెంటనే వారు పొలానికి వెళ్లి ప్రభాకర్‌ను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రభాకర్ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు బాలిక తండ్రి సత్యనారాయణరెడ్డితో పాటు ఆయన సోదరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ గురువయ్య తెలిపారు. -
డీఈవో కార్యాలయంపై తల్లిదండ్రుల దాడి
హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళన రెండోరోజు కూడా కొనసాగుతోంది. కావాలనే మార్కులు తక్కువగా వేసి విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం హైదరాబాద్ డీఈవో కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అన్ని సబ్జెక్ట్‌ల్లో పాసయిన తమ పిల్లలు మ్యాథ్స్, ఫిజిక్స్‌లోనే ఎందుకు తప్పారో చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు ఫెయిల్ అయిన పదో తరగతి విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. బట్టీ విధానంతో పాటు, కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా సీసీఈ విధానం అమలు చేశామన్నారు. అయితే విద్యార్థులు ఆ విధానాన్ని అలవాటు పడాల్సి ఉందన్నారు.