ధర్నా చేస్తున్న వివిధ పార్టీల నాయకులతో మాట్లాడుతున్న పోలీసులు (ఇన్‌సెట్) నిందితుడిని స్తంభానికి కట్టేసిన దృశ్యం
నస్రుల్లాబాద్(బాన్సువాడ) : ఐదేళ్ల చిన్నారిపై దారుణానికి యత్నించాడో కిరాతకుడు. ఆడించే నెపంతో ఇంటికి తీసుకెళ్లి అ త్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు నిందితుడ్ని కట్టేసి కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరోవైపు నిందితుడ్ని ఉరి తీయాలంటూ అఖిలపక్ష నేతలు రాస్తారోకో చేయడంతో గంట పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. స్థానికంగా కలకలం రేపి న ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 40 ఏళ్ల హైమద్ హుస్సేన్.. తన ఇంటి సమీపంలోని ఐదేళ్ల చిన్నారితో చనువుగా ఉండేవాడు. సోమవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపను ఆడించే నెపంతో ఇంట్లోకి తీసుకెళ్లాడు. కొద్దిసేపటికే బాలిక తల్లి అటు వైపు వెళ్లింది. చిన్నారిపై హైమద్ హుస్సేన్ అత్యాచారయత్నం చేస్తుండడాన్ని గమనించిన ఆమె.. నిందితుడ్ని తిట్టి పాపను తీసుకెళ్లి పోయింది.
భర్త రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడంతో ఈ విషయం చెప్పలేదు. మంగళవారం ఉదయం తన భర్తకు చెప్పగా, కోపోద్రిక్తుడైన ఆయన నిందితుడ్ని కరెంట్‌స్తంభానికి కట్టేసి చితకబాదాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హుస్సేన్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ బజరంగ్‌దల్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాస్తారోకోకు దిగారు. బోధన్–బాన్సువాడ ప్రధాన రహదారిపై గంట సేపు బైఠాయించారు. నిందితుడ్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment