ట్రాన్స్‌జెండర్లతో ముజ్రా పార్టీ | 12 Arrested After Obscene Dance Party Busted In Bandlaguda, Including 4 Transgenders | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్లతో ముజ్రా పార్టీ

Published Mon, Sep 30 2024 8:06 AM | Last Updated on Mon, Sep 30 2024 9:26 AM

Obscene dance party busted in Bandlaguda

చాంద్రాయణగుట్ట: బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ట్రాన్స్‌జెండర్లతో కలిసి అర్ధనగ్న ప్రదర్శనలతో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న సెంటర్‌పై దక్షిణ మండలం టాస్‌్కఫోర్స్‌ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. మొత్తం 8 మంది యువకులతో పాటు నలుగురు ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్‌ చేశారు. టాస్‌్కఫోర్స్‌ అదనపు డీసీపీ అందె శ్రీనివాసారావు కథనం మేరకు.. బండ్లగూడకు చెందిన హమీద్‌ శనివారం రాత్రి స్థానిక యువకులు, ట్రాన్స్‌ జెండర్లతో కలిసి గౌస్‌నగర్‌ ఉందాసాగర్‌ చెరువు పక్కన లేక్‌ వ్యూ హిల్స్‌లోని ఓ ప్రహరీలో గుట్టు చప్పుడు కాకుండా ముజ్రా పార్టీని ఏర్పాటు చేశాడు. 

అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జాబ్రీ, మహ్మద్‌ రియాజ్, షేక్‌ సొహేల్, షానవాజ్‌ ఖాన్, మహ్మద్‌ ఇమ్రాన్, మహ్మద్‌ ఫెరోజ్, సయ్యద్‌ షా ఫారూఖ్, షేక్‌ మహ్మద్‌లు ట్రాన్స్‌జెండర్లు మైలార్‌దేవ్‌పల్లికి చెందిన సొహేల్‌ అలియాస్‌ ఆర్జూ, పురానాపూల్‌కు చెందిన మహ్మద్‌ సైఫ్‌ అలియాస్‌ లవ్లీ, జల్‌పల్లికి చెందిన కరీమా బక్ష, వట్టేపల్లికి చెందిన అబ్దుల్‌ ఆమెర్‌లతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయిస్తూ భారీ శబ్ధాలతో స్థానికంగా న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. సమాచారం అందడంతో టాస్‌్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర, బండ్లగూడ ఇన్‌స్పెక్టర్‌ కె. సత్యనారాయణ, ఎస్సైలు నవీన్, నర్సింహులు దాడులు నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement