Obscene Dance
-
ట్రాన్స్జెండర్లతో ముజ్రా పార్టీ
చాంద్రాయణగుట్ట: బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాన్స్జెండర్లతో కలిసి అర్ధనగ్న ప్రదర్శనలతో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న సెంటర్‌పై దక్షిణ మండలం టాస్‌్కఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. మొత్తం 8 మంది యువకులతో పాటు నలుగురు ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేశారు. టాస్‌్కఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసారావు కథనం మేరకు.. బండ్లగూడకు చెందిన హమీద్ శనివారం రాత్రి స్థానిక యువకులు, ట్రాన్స్ జెండర్లతో కలిసి గౌస్‌నగర్ ఉందాసాగర్ చెరువు పక్కన లేక్ వ్యూ హిల్స్‌లోని ఓ ప్రహరీలో గుట్టు చప్పుడు కాకుండా ముజ్రా పార్టీని ఏర్పాటు చేశాడు. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ జాబ్రీ, మహ్మద్ రియాజ్, షేక్ సొహేల్, షానవాజ్ ఖాన్, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఫెరోజ్, సయ్యద్ షా ఫారూఖ్, షేక్ మహ్మద్‌లు ట్రాన్స్జెండర్లు మైలార్‌దేవ్‌పల్లికి చెందిన సొహేల్ అలియాస్ ఆర్జూ, పురానాపూల్‌కు చెందిన మహ్మద్ సైఫ్ అలియాస్ లవ్లీ, జల్పల్లికి చెందిన కరీమా బక్ష, వట్టేపల్లికి చెందిన అబ్దుల్ ఆమెర్లతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయిస్తూ భారీ శబ్ధాలతో స్థానికంగా న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. సమాచారం అందడంతో టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర, బండ్లగూడ ఇన్స్పెక్టర్ కె. సత్యనారాయణ, ఎస్సైలు నవీన్, నర్సింహులు దాడులు నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. -
నాయకుని బర్త్ డేలో అశ్లీల నృత్యాలు
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): తెల్లవారితే నీతులు చెప్పే ప్రజాప్రతినిధులు వారు చేసే పనులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయి. ఇందుకు ఉదాహరణ రామనగరలో చోటుచేసుకున్న సంఘటన. రామనగర నగరసభ కౌన్సిలర్ ఒకరు విమర్శల పాలవుతున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న కల్యాణ మండపంలో సదరు కౌన్సిలర్ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా డ్యాన్సర్లను పిలిపించి అశ్లీల నృత్యాలు చేయించారు. డ్యాన్సర్లపై కరెన్సీ నోట్లు వెదజల్లారు. సదరు వీడియోలు జిల్లాలో వైరల్‌గా మారడంతో ప్రజల్లో విస్మయం వ్యక్తమైంది. చదవండి: (భర్త వివాహేతర సంబంధం.. వివాహిత అనుమానాస్పద మృతి) -
‘దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటలకు బ్రేక్’
సాక్షి, చెన్నై: దసరా ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు, సినిమా పాటలతో హంగామా చేయడంపై మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం నిషేధం విధించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకు పెద్దపీట వేయాలని న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్ బెంచ్ బుధవారం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దసర ఉత్సవాలు వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకల్లో రోజూ నృత్య ప్రదర్శనలు, సినిమా డాన్సులు, పాటలు హోరెత్తుతాయి. వీటిలో అశ్లీలం శృతి మించడం పరిపాటిగా మారింది. పైగా కొన్నిచోట్ల సినీ తారలను సైతం ఆహా్వనించి వేడుకలను కోలాహలంగా నిర్వహిస్తుంటారు. కులశేఖర పట్నంలో.. తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్నం దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇక్కడి ముత్తాలమ్మన్ ఆలయంలో తొమ్మిది రోజులు వేడుకలు మిన్నంటుతాయి. ఇక్కడ కూడా సీనీ గీతాలు, డాన్సులకు కొదవ ఉండదు. ఈ పరిస్థితుల్లో రాంకుమార్ ఆదిత్యన్ అనే సామాజిక కార్యకర్త దసరా ఉత్సవాల పేరిట సాగుతున్న అశ్లీల నృత్యాలను నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. బుధవారం న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఎంతో భక్తితో వ్రతాలు, నోములు తదితర పూజాది కార్యక్రమాలను భక్తులు ఈ దసరా సందర్భంగా అనుసరిస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇలాంటి సందర్భంలో అశ్లీల కార్యక్రమాల వల్ల భక్తులకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు దసరా ఉత్సవాల్లోనే కాకుండా, ఏ ఆలయ వేడుకల్లోనూ ఇకపై అశ్లీల నృత్యాలు, సినిమా పాటలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కులశేఖర పట్నంలో నిర్వహించే వేడుకలను తూత్తుకుడి జిల్లా ఎస్పీ, కలెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. -
అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. వీడియోలు వైరల్
తగరపువలస(భీమిలి)విశాఖపట్నం: భీమిలి మండలం అమనాం పంచాయితీలో పోలమాంబ ఉత్సవాల సందర్భంగా ఈ నెల 3న అశ్లీల నృత్యాల ప్రదర్శన సందర్భంగా ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మందిపై భీమిలి పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలలో అశ్లీల నృత్యాల వీడియోలు వైరల్ కావడంతో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కానిస్టేబుల్ పి.కృష్ణారావు జరిపిన ప్రాథమిక విచారణ చేపట్టారు. చదవండి: ప్రేమించిన యువతితో పెళ్లి చేయలేదని.. పని చేసిన ప్రదేశానికి వెళ్లి.. ఈ నెల 3న అనుమతి లేకుండా రాత్రి 10.30 నుంచి మరుసటి రోజు 2 గంటల వరకు బుర్రకథ ప్రదర్శించారు. అందులో భాగంగా విజయనగరానికి చెందిన ఇద్దరు మహిళలు అశ్లీలంగా నృత్యాలు చేయడంతోపాటు ప్రైవేట్ పార్టులను ప్రదర్శించారన్నారు. ఆ ఇద్దరు మహిళలతోపాటు అశ్లీల నృత్యప్రదర్శన ఏర్పాటు, వారితో కలిసి నృత్యం చేసిన ఆరుగురు ఉత్సవ కమిటీ సభ్యులు చుక్క చిట్టిబాబు, జీరు మురళి, కాళ్ల గౌరీశంకర్, చుక్క రమణ, చుక్కల పల్లారెడ్డి, వేముల వెంకటేష్‌పై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సువ్వారు సంతోష్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పబ్‌లో అశ్లీల నృత్యాలు
-
ఎమ్మెల్యే పార్టీ: అమ్మాయిలతో పచ్చనేతల చిందులు!
-
ఎమ్మెల్యే పార్టీ: అమ్మాయిలతో పచ్చనేతల చిందులు!
సాక్షి, కనిగిరి: అసలే కొత్త సంవత్సరం.. కళ్ల ముందు అందమైన అమ్మాయిలు.. ఇంకేముంది అదో అధికారిక కార్యక్రమం అన్న విషయం కూడా మర్చిపోయారు తెలుగు తమ్ముళ్లు. స్టేజిపైన అమ్మాయిలతో చిందులేస్తూ తమను తాము మైమరిచిపోయారు పచ్చ నేతలు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గెస్ట్‌హౌజ్‌లో పార్టీని ఏర్పాటు చేశారు. స్పెషట్ అట్రాక్షన్ కోసం ఓ రికార్డింగ్ డాన్స్ ట్రూప్‌ను కూడా రప్పించారు. ఇంకేముంది తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే ఎదురుగానే.. అమ్మాయిలతో కలిసి చిందులేయడం ప్రారంభించారు. టీడీపీ నేతలు భేరి పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్న మస్తాన్ కూడా అమ్మాయిలతో చిందులేసిన వారిలో ఉన్నారు. బాధ్యతగల నేతలై ఉండి.. కనీస పద్ధతి పాటించకుండా వ్యవహరించిన టీడీపీ నేతల వైఖరిపై అక్కడికి వచ్చినవారంతా ముక్కున వేలేసుకున్నారు. -
శివ.. శివా!
రావివలస మల్లన్న తిరువీధి ఉత్సవంలో అశ్లీల నృత్యాలు విస్మయానికి గురైన భక్తులు రావివలస(టెక్కలి): కలియుగ కైలాసంగా పేరుగాంచిన టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జున స్వామి తిరువీధి ఉత్సవానికి నిర్వాహకులు అపఖ్యాతి తె చ్చారు. తిరువీధి ఉత్సవంలో అశ్లీల నృ త్యాలు ఏర్పాటు చేయడంతో భక్తులు వి స్మయానికి గురయ్యారు. దేవస్థానం అధికారుల తీరుపై మండిపడ్డారు. మహాశివరాత్రిని పురష్కరించుకుని భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామికి శనివారం రాత్రి గ్రామంలో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. దేవస్థానం ఈఓ జి.గురునాథరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో ఒడిశా ప్రాంతానికి చెందిన కళాకారుల బృందం చేసిన ధూం ధడక్ నృత్యాలు అశ్లీలంగా ఉండడంతో భక్తులు విస్మయానికి గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి అశ్లీల కార్యక్రమాలు నిర్వహించడంపై మండిపడ్డారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఎల్.ఎల్.నాయుడు, సంతబొమ్మాళి జెడ్పీటీసీ ఎల్.లక్ష్మీతో పాటు అర్చకులు రామకృష్ణ, మోహన్, యుగంధర్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవస్థానం అధికారుల సాక్షిగా జరిగిన ఈ కార్యక్రమంపై స్థానికులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. -
అశ్లీల నృత్యాలపై విచారణకు ఆదేశం
విశాఖ : పవిత్ర పుణ్యక్షేతం సింహాచలంలో వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాల ఘటనపై విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ స్పందించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు పోలీసులపై ఆయన వేటు వేశారు. సింహాచలంలో వినాయకచవితి భద్రతా విధుల్లో ఉన్న ఏసీపీ భీమారావు, సీఐ బాల సూర్యారావులను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణకు యోగానంద్ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై అడిషనల్ సీపీ సత్తార్ ఖాన్ విచారణ జరపనున్నారు. కాగా అప్పన్న ఆలయం సమీపంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అశ్లీలం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మద్యం సేవించిన కొందరు యువకులు ఓ మహిళా డ్యాన్సర్ తో అసభ్యకర భంగిమల్లో నృత్యం చేయించారు. పోలీసులు పెట్రోలింగ్ కు వచ్చినా ఎదురుగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నా పట్టించుకోలేదు. దీంతో రాత్రి మొదలయిన ఈ నృత్యాలు తెల్లవారుజాము వరకూ కొనసాగాయి. అయితే పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వార్తలు మీడియాలోనూ ప్రసారం కావటంతో విశాఖ పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు.