ప్రతీకాత్మక చిత్రం
తగరపువలస(భీమిలి)విశాఖపట్నం: భీమిలి మండలం అమనాం పంచాయితీలో పోలమాంబ ఉత్సవాల సందర్భంగా ఈ నెల 3న అశ్లీల నృత్యాల ప్రదర్శన సందర్భంగా ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మందిపై భీమిలి పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలలో అశ్లీల నృత్యాల వీడియోలు వైరల్ కావడంతో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కానిస్టేబుల్ పి.కృష్ణారావు జరిపిన ప్రాథమిక విచారణ చేపట్టారు.
చదవండి: ప్రేమించిన యువతితో పెళ్లి చేయలేదని.. పని చేసిన ప్రదేశానికి వెళ్లి..
ఈ నెల 3న అనుమతి లేకుండా రాత్రి 10.30 నుంచి మరుసటి రోజు 2 గంటల వరకు బుర్రకథ ప్రదర్శించారు. అందులో భాగంగా విజయనగరానికి చెందిన ఇద్దరు మహిళలు అశ్లీలంగా నృత్యాలు చేయడంతోపాటు ప్రైవేట్ పార్టులను ప్రదర్శించారన్నారు. ఆ ఇద్దరు మహిళలతోపాటు అశ్లీల నృత్యప్రదర్శన ఏర్పాటు, వారితో కలిసి నృత్యం చేసిన ఆరుగురు ఉత్సవ కమిటీ సభ్యులు చుక్క చిట్టిబాబు, జీరు మురళి, కాళ్ల గౌరీశంకర్, చుక్క రమణ, చుక్కల పల్లారెడ్డి, వేముల వెంకటేష్‌పై కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సువ్వారు సంతోష్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment