హైదరాబాద్ : బండ్లగూడ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ముగ్గురిని వెనుకాలే వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో స్కూటీపై ముగ్గురున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.