
సాక్షి, రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బండ్లగూడలో ఆదివారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ఐదు ఇళ్లలోకి ప్రవేశించిన దొంగలు.. నగదు, బంగారు నగలను ఎత్తుకెళ్లారు. అక్కడున్న కారును కూడా తీసుకెళ్లారు. బండ్లగూడ సాయిబాబా కాలనీకి చెందిన ఐదు కుటుంబాలవారు సినిమాకు వెళ్ళారు. అర్థరాత్రి ఇళ్లకు వచ్చి చూస్తే తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఐదిళ్లలో 48 తులాల బంగారు నగలు, ఒక కారు, రూ.1.30 లక్షల నగదు దోచుకెళ్ళినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment