హైదరాబాద్ : హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో సోమవారం మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఇందు అరణ్య అపార్టుమెంట్ సమీపంలో నడిచి వెళ్తున్న విజయ అనే మహిళ మెడలోని మూడు తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడు. పల్సర్ బైక్‌పై వెనుక నుంచి వచ్చిన అతడు తాడును లాక్కొని వెళ్లిపోయాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.