
హైదరాబాద్, సాక్షి: నగర పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో జరిగిన వేలంపాటలో రూ.1.87కోట్లకు ఓ భక్తుడు లడ్డూను దక్కించుకున్నాడు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి రూ.1.26కోట్లకు గణపయ్య లడ్డూను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు.. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్ మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డూ వేలంపాటలో ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి గణేష్ రూ.29 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఎంత దక్కించుకుంటుందో అనే చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment