సాక్షి, బండ్లగూడ: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం రికార్డు స్థాయిలో రూ. 60.83 లక్షలు పలికింది. సన్‌సిటీ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లోని ఆర్మీ దివ్యా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. |
గతేడాది ఈ లడ్డూ రూ.41 లక్షలు పలికింది. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ రూ.24.60 లక్షలు , అల్వాల్ కానాజీగూడ లడ్డూ రూ. 46 లక్షలు పలికాయి. వీటి రికార్డును బ్రేక్ చేస్తూ బండ్లగూడ జాగీర్ లడ్డూ రూ.60.83 లక్షలు పలకడం గమనార్హం. ఆర్వీ దివ్యా ట్రస్ట్‌కు డాక్టర్ అర్చనాసిన్హా, పూర్ణిమా దేశ్‌పాండే మేనేజింగ్ ట్రస్టీలుగా ఉన్నారు.
ఇదీ చదవండి: నష్టాల సాకు.. బస్సులకు బ్రేక్!
Comments
Please login to add a commentAdd a comment