
పసిపాపకు ప్రాణభిక్ష పెట్టరూ..!
మెహిదీపట్నం(హైదరాబాద్): పుట్టిన మూడునెలలకే అనారోగ్యాల పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న ఓ చిన్నారి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. బండ్లగూడ ఆరెమైసమ్మ ప్రాంతానికి చెందిన శ్రీధర్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతని భార్య మౌనిక మూడు నెలల క్రితం కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే పుట్టుకతోనే అనారోగ్యంతో బాధపడుతుండటంతో వైద్య చికిత్సల నిమిత్తం నిలోఫర్, రెయిన్ ఆస్పత్రులను సంప్రదించారు. మెరుగైన చికిత్సల నిమిత్తం మూడు వారాల క్రితం విజయనగర్ కాలనీలోని నైస్ ఆసుప్రతిలో చేర్పించారు.
ఇప్పటికే వైద్యానికి రూ. 2లక్షలు పైగా బిల్లులు అయినట్లు వైద్యులు చెప్పడంతో తమ వద్ద ఉన్న రూ. 30 వేలు చెల్లించారు. ఫీజుల చెల్లించలేకపోతే చిన్నారిని తీసుకెళ్లాలని వైద్యులు ఒత్తిడి చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదని దాతలు ఆర్థిక సహాయం చేసి తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. దాతలు 7904122738 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.