3వ పెళ్లి చేసుకున్న భర్తకు తగిన శాస్తి చేసిన భార్య! | First wife hitting 3rd-married husband | Sakshi
Sakshi News home page

3వ పెళ్లి చేసుకున్న భర్తకు తగిన శాస్తి చేసిన భార్య!

Published Sun, Nov 16 2014 4:12 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

3వ పెళ్లి చేసుకున్న భర్తకు తగిన శాస్తి చేసిన భార్య! - Sakshi

3వ పెళ్లి చేసుకున్న భర్తకు తగిన శాస్తి చేసిన భార్య!

హైదరాబాద్: రాజేంద్ర నగర్ బండ్లగూడలో మూడవ పెళ్లి చేసుకున్న భర్తకు మొదటి భార్య తగిన శాస్తి చేసింది. సెక్రటేరియేట్లో ఉద్యోగి మహేష్ తొలుత పద్మను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. మహేష్ భార్యతో ఉండకుండా వికారాబాద్లో తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తుంటాడు. అతను పద్మకు తెలియకుండా రెండవ వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత పద్మకు ఆ విషయం తెలిసింది. ఆమె బంధువులను తీసుకొని వెళ్లి అతనికి బుద్ధి చెప్పింది. ఆ రెండవ భార్య అతనిని వదిలి వెళ్లిపోయింది.

కుక్క తోక ఎంత వంచినా ఒంకరే అన్నట్లు ఆ తరువాత మహేష్ మళ్లీ జ్యోతి అనే యువతిని మూడవ పెళ్లి చేసుకున్నాడు. వారు రాజేంద్ర నగర్ బండ్లగూడలో ఉంటున్నారు. మహేష్  జ్యోతి వద్ద ఉండగా, పద్మ తన పిల్లలు, బంధువులను తీసుకొని వచ్చి భర్తకు దేహశుద్ధి చేసింది. వెంట వచ్చిన బంధువులు కూడా మహేష్కు నాలుగు తగిలించారు. మహేష్పై రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement