పాఠశాల సైన్స్‌ల్యాబ్‌లో నిర్వహించిన పూజలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు భయాందోళ చెందారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి హైదర్షాకోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు చేశారనే విషయం తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
పాఠశాలలోని సామగ్రి గది ఎదుట, సైన్స్ ల్యాబ్‌లోని రెండు ప్రాంతాలలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఎవరో దుండగులు ఈ పూజలను చేసినట్టు గుర్తించారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా వీటిని చూపి భయభ్రాంతులకు గురయ్యారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మదన్ కుమార్ వీటితో ఏమి కాదని తంత్రాలు వంటివి ఏమి లేవని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. వాటిని తొలగించి పాఠశాలను శుభ్రం చేశారు. అవరణలోని సీసీ కెమెరాలను సైతం దుండగులు మాయం చేసి ఈ క్షుద్ర పూజలు గమనార్హం.
చదవండి: ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత
Comments
Please login to add a commentAdd a comment