మోసపూరిత వాగ్దానాలతోగద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ మాయల పకీరుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని బూత్ కన్వీనర్లకునిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
తణుకు: మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ మాయల పకీరుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ తరగతులు జరిగాయి. వీటికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక పద్మశ్రీ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ శిక్షణ తరగతులు పార్టీ రాష్ట్ర రాజకీయ మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ కమిటీలదేనన్నారు. కార్యకర్తలు పార్టీకి పునాది లాంటి వారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్ర ప్రజలకు భరోసా కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర మరోసారి భరోసా కల్పించే దిశగా కదులుతోందన్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నైజాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు రాజధాని పేరుతో ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల మధ్య ఉంటున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు ఖూనీచేస్తున్నారని దుయ్యబట్టారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బూత్‌స్థాయి కమిటీ సభ్యులు ప్రజలతో మమేకం కావాలన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆయా పోలింగ్ బూత్‌ల పరి«ధిలో ఓటరు జాబితాపై అవగాహన చేసుకోవాలన్నారు. ఇటీవలి కాలంలో అధికార పార్టీ నాయకులు ఓట్లు తొలగిస్తున్న విషయాన్ని గుర్తెరగాలని చెప్పారు. తొలగించిన ఓట్లు స్థానంలో ఓటర్లను తిరిగి చేర్పించేందుకు బూత్ కన్వీనర్లు సహాయపడాలని సూచించారు.
మోసమే చంద్రబాబు విజన్
సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే, రాజకీయ సలహామండలి సభ్యులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడమే చంద్రబాబుకు ఉన్న విజన్ అన్నారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ప్రత్యేక హోదా డిమాండ్‌తో కేంద్రంపై పోరాడుతున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అన్ని పార్టీల నాయకులు అనుసరిస్తున్నారని అన్నారు. బీజేపీతో పోరాటం అంటూనే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబు నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు నివాళులు అర్పించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులు గుర్రాల నాగేంద్రకు సమావేశం నివాళులు అర్పించింది. కొద్దిసేపు మౌనం పాటించి సంతాపం తెలి పింది. శిక్షణ తరగతుల్లో బూత్ కన్వీనర్లకు సర్టిఫి కెట్లు బహూకరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు, తూర్పుగోదావరి జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పట్టణ అధ్యక్షుడు ఎస్‌ఎస్ రెడ్డి, తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, పైబోయిన సత్యనారా యణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, నాయకులు నార్గన సత్యనారాయణ, కౌరు వెంకటేశ్వర్లు, మ ద్దాల నాగేశ్వరరావు, ఆకుల కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment