Darmana prasada rao
-
బడుగు బలహీనర్గాలకే కీలక పదవులు: బూడి మూత్యాల నాయుడు
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో గురువారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బహిరంగ సభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, ఉమా శంకర్ గణేష్, గొల్ల బాబూరావు, అడీప్ రాజు, ఎమ్మెల్సీ కళ్యాణి, విశాఖ డెయిరీ చైర్మెన్ అడారి ఆనంద్. తదితరులు హాజరయ్యారు. ఎంపీ సత్యవతి పాయింట్స్ ►పేదరికం నుంచి బయట పడడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. ►సీఎం జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. ►ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ►వచ్చే ఎన్నికల్లో 175 కు 175 వైఎస్సార్సీపీ సాధిస్తుంది. బూడి ముత్యాల నాయుడు పాయింట్స్ ►ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ►పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అందిస్తున్నారు. ►ముడు వంతుల్లో రెండు వంతులు బడుగు బలహీన వర్గాలు స్థానం కల్పించారు. ►కీలకమైన పదవులు బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు. ►నాడు నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారు. ►కార్పొరేట్ స్కూల్‌కు ధీటుగా ప్రభుత్వ పాటశాలను మార్చారు. ►ఇంగ్లీష్ మీడియంను అలీబాబా 40 దొంగలు హేళన చేశారు. ►చంద్రబాబు, గంటా, అయ్యన్న, బండారు మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. ►పేదలు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవ కూడదు అంటా. ►ఇంగ్లీష్ మీడియం చదువులు లేక గతంలో ఎంతో మంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయారు. ►దివంగత నేత ఫీజ్ రియంబర్స్ మెంట్ వలన పేదల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు. ►బడుగు బలహీనర్గాలకు సీఎం జగన్ పాలనలో న్యాయం జరిగింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు పాయింట్స్ ►స్వాతంత్ర్యం తరువాత చాలామంది పేదలకు న్యాయం జరగలేదు. ►కొన్ని వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ►దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. ►సీఎం జగన్ పథకాలపై విమర్శలు చేసిన వారు నేడు ప్రశంసిస్తున్నారు. ►సీఎం జగన్ పథకాలను చంద్రబాబు కాఫీ కొట్టారు ►ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేశారా? ►రైతు డ్వాక్రా రుణా మాఫీ చేశారా? ►ఇచ్చిన హామీల్లో ఒకదాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ►అధికారం కోసమే చంద్రబాబు హామీలు ఇచ్చారు. ►పేద వారు తమ అవసరాలు కోసం కోర్టులకు వెళ్ళలేరు. ► పాలకులు ప్రజలు కష్టాలు తెలుసుకొని పాలన చేయాలి. ►దేశానికి ఆదర్శంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు. ►సమాజంలో అంతరాలను తగ్గించడం వంటివి సైకోలు చేస్తారా లోకేష్. ►ఒక రోడ్డు, ఒక బిల్డింగ్ వేస్తే అభివృద్ధి కాదు. ►ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంచడం నిజమైన అభవృద్ధి. ►టీడీపీ జెండా కట్టిన వారికే పథకాలు ఇచ్చారు. ►సీఎం జగన్ పాలన పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నారు. ►సీఎం జగన్ ఒక రూపాయి అవినీతి లేకుండా పాలన చేస్తున్నారు. ►చంద్రబాబు కూడా అవినీతి జరిగిందని చెప్పలేక పోతున్నారు. ►గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. ►కంటి ఆపరేషన్ కోసం బెయిల్ ఇస్తే న్యాయం గెలిసింది అని టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ►271 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ►అన్ని ఆధారాలు తోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. ►చంద్రబాబు నిజాయితీ పరుడు అయితే కోర్టులో నిరూపించుకోవాలి. ►టీడీపీ పాలనలో నాయకుల అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి. ►సీఎం జగన్ పాలనలో పేదల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ►ఎన్నికలు ముందు మయ మాటలతో చంద్రబాబు ప్రజలు ముందుకు వస్తారు రాజన్న దొర డిప్యూటీ సీఎం ►మనకు మంచి ఎవరు చేస్తున్నారో గుర్తు పెట్టుకోవాలి. ►పేదలు కోసం సీఎం జగన్ పని చేస్తున్నారు. ►టీడీపీ నాయకుల మయ మాటల ఎవరు నమ్మొద్దు. ►బలహీన వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు. ►సమాజాన్ని సమ సమాజంగా సీఎం జగన్ మార్చారు. ►గిరిజనులు కోసం 20 వేల కోట్ల కర్చు చేశారు. ►పేదలు పక్ష పాతి సీఎం జగన్ ►బురద మా మీద జల్లలని చూస్తే పందుల్లా మీదే బురద పడుతుంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ పాయింట్స్ ►సామాజిక న్యాయానికి ముత్యాల నాయుడే ఒక ఉదాహరణ. ►రాజకీయాలలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సీఎం జగన్, ముత్యాల నాయుడిని పక్కన పెట్టుకున్నారు. ►సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ►దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు. ►2 లక్షల 40 వేల కోట్లు ప్రజల ఖాతాల్లో ఏ నాయకుడు వేయలేదు. ►కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. ►మళ్ళీ 28 రోజుల తరువాత జైలుకు వెళ్లాల్సిందే. ►ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన సీఎం జగన్ సింగిల్‌గానే పోటీ చేస్తారు. ►చంద్రబాబుకు 1000 కోట్ల చేతి కర్ర పవన్ రూపంలో దొరికింది. -
పనికిమాలినోడా.. మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్
-
ఇక 'సిరి'కాకుళమే!
‘సంకల్ప’ సూరీడు.. పాదయాత్రలో జనం కష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి బాధలను గుర్తుపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి ఇప్పుడు తొలి ‘పద్దు’ పొడిచే వేళ.. వారి కన్నీళ్లు తుడిచేలా, వారి బతుకుల్లో వెలుగులు నిండేలా నిధులు కేటాయించారు.. ‘ప్రజల ముఖ్యమంత్రి’నని నిరూపించుకున్నారు.. నాయకుడి మనసెరిగిన ఆర్థిక మంత్రి విపక్షాలు సైతం ‘బుగ్గన’ వేలేసుకునేలా బడ్జెట్ సమర్పించారు. అన్ని వర్గాల ప్రజలను ఆనందంలో ముంచెత్తేలా తన ప్రణాళికను వెల్లడించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేలా అనేక నిర్ణయాలను ప్రకటించారు. కిడ్నీ వ్యాధితో బతుకీడుస్తూ ఎన్నాళ్లు జీవిస్తామో తెలీక కొట్టుమిట్టాడుతున్న ప్రాణ దీపాలను వెలిగించేలా రీసెర్చి సెంటర్‌కు రూ.50 కోట్లు కేటాయించారు. వందలాది కోట్ల నిధులిచ్చి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు పూర్వ వైభవం తీసుకురావాలని తలపెట్టారు. సాక్షి, శ్రీకాకుళం : వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగానికి, అలాగే వ్యవసాయాధారిత వ్యవస్థలకు కూడా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో జిల్లాలో అత్యధిక శాతం మంది ప్రజలకు ప్రత్యక్షంగానూ.. మరికొందరికి పరోక్షంగానూ లబ్ధి చేకూరనుంది. సాగు, తాగునీటికి కీలకమైన బి.ఆర్.ఆర్ వంశధార, జి.ఎల్ తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులను కేటాయించడంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే జిల్లాలో ప్రధానమైన కిడ్నీ రోగుల వ్యధలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గడిచిన మూడేళ్లుగా జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను తీవ్ర తుఫాన్లు విధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా రాష్ట్రస్థాయిలో రూ.200 కోట్లు కేటాయించారు. దీంతో పాటు వ్యవసాయ రైతులకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించి, ఇందుకోసం నిధులను కూడా తాజా బడ్జెట్లో కేటాయించింది. అలాగే మత్స్యకారుల సంక్షేమానికి కూడా పెద్ద పీట వేసారు. వేటనిషేధ కాలంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన భృతి పెంచడం కూడా విశేషం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల అమలులో భాగంగా ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకం, గ్రామ/వార్డు సచివాలయాలు, గ్రామ/వార్డు వలంటీర్లు తదితర నియామకాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో నవరత్నాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. అన్ని వర్గాలకు ప్రయోజనం జిల్లాలోని రైతులు, పేదలు, విద్యార్ధులు, డ్వాక్రా మహిళలతో పాటు నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పూర్తి నిర్లక్ష్యంకి గురైన ప్రాజెక్టులకు కేటాయింపులు జరపడంతో సాగు విస్తీర్ణం పెరిగి,రైతులకు లాభదాయకం కానుంది. రైతు స్థిరీకరణ నిధికి కేటాయింపులు జరపడంతో రైతులకు గిట్టుబాటు ధర, పెట్టుబడి అందుబాటులోకి వస్తుంది. ఉద్దానం ప్రాంతంలో వేలాదిమంది కిడ్ని వ్యాధిబారిన పడుతున్నా గత ప్రభుత్వాలు సర్వేలు, నామమాత్రపు చికిత్సలతో సరిపెట్టాయి. డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినా, అది పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది. పాదయాత్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో కిడ్నీ రిసెర్చి సెంటర్‌ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో రూ. 50 కోట్లు నిధులు కేటాయించడంలో అక్కడ ఉన్న తీవ్ర స్థాయి వ్యాధితో బాధపడుతున్న 16 వేలమందితోపాటు వ్యాధి లక్షణాలు ఉన్న మరో పది వేలమందికి ఊరట కల్పించే అంశంగా మారింది. జిల్లాలో మత్సకార గ్రామాలు 110 వరకు గ్రామాలు ఉండగా, వేట నిషేధ భృతి రూ.10 వేలకు పెంచడంతో సుమారుగా 9 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఆశా వర్కర్లు, గిరిజన ఆరోగ్య కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు హోంగార్డులు, మద్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ వర్కర్లకు ప్రయోజనం చేకూరేలా బడ్జెట్లో నిధులు కేటాయించారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించడంతో జిల్లాలో 2 లక్షల మందికి ఊరట కల్గించనుంది. జిల్లాలో రుణ పద్ధతితో అర్బన్ హౌసింగ్ ఇళ్లను పేదలకు కేటాయించగా రుణ మాఫీ చేస్తామని పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకొనేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరపడంతో జిల్లాలో అన్ని పురపాలక, నగరపాలక సంఘాల్లో 7వేల వరకు లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. మహిళలకు, రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్లో పొందుపర్చడం వలన 48,962 డ్వాక్రా సంఘాలలోని 5,46,715 మంది మహిళలకు, సుమారుగా 5 లక్షల రైతు కుటుంబాలకు మేలు చేకూరుతోంది. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు ప్రధనంగా వంశధార, నాగావళిపై తోటపల్లి ప్రాజెక్టు, మడ్డువలసలు అర్ధంతరంగా ఉండిపోయాయి. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా జిల్లాను సస్యశామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. అయితే ఆయన అకాల మరణంతో పనులు నిలిచిపోయాయి. సుమారుగా పుష్కరకాలం నిలిచిన పనులకు మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాణం పోసింది. వంశధారకు రూ. 147 కోట్లు, మడ్డువలసకు రూ. 9.50 కోట్లు, తోటపల్లికి రూ.156 కోట్లను కేటాయించారు. చిన్నతరహా నీటి ప్రాజెక్టులకు రాష్టంలో రూ. 589.59 కోట్లు కేటాయించారు. దంతో జిల్లాలోని చిన్న ప్రాజెక్టులకు మహర్ధశ వస్తుంది. ఈ బడ్జెట్లో జిల్లాలో సుమారు 5 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరగనుంది. తోటపల్లి ప్రాజెక్టుకు : రూ.156 కోట్లు వంశధార ప్రాజెక్టుకు : రూ.147.10కోట్లు పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధికి : రూ.50 కోట్లు మడ్డువలస ప్రాజెక్టుకు : రూ.9.5 కోట్లు మహేంద్ర తనయ ప్రాజెక్టుకు : రూ.100.94 కోట్లు అమ్మఒడి ద్వారా చదువులకు పెద్ద పీట వేశారు. పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్ధులకు కూడా ఈ అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఏటా విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలో రూ. 15 వేలు జమ చేయనున్నారు. దీనికి గాను ఈ బడ్జెట్లో రూ. 6,450 కోట్ల్లను కేటాయించారు. దీంతో జిల్లాలో ప్రాధమిక, మాధ్యమిక, ఇంటర్మీడియట్ విద్యార్ధులు సుమారు 3.20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. దీంతో చదువుకొనేందుకు పేదలకు ఆర్ధిక సమస్య లేకుండా ఉంటుంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటి వరకు గడచిన అయిదు సంవత్సరాలుగా నీరసించింది. దీనికి పుర్వవైభవాన్ని తీసుకువచ్చారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందడానికి రోగాల సంఖ్యను 1040కి పెంచడంతోపాటు ఈ బడ్జెట్లో రూ.1740 కోట్లును కేటాయించారు. దీంతో జిల్లాలో తెలుపురంగు కార్డుగల పేద రోగులకు అన్ని రకాల జబ్బులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందనుంది. వైఎస్ఆర్ గృహ వసతి ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం స్థలం ఇవ్వడంతో పాటు, ఆ ఇంటి మహిళ పేరిట పట్టాను అందజేసి, ఆ స్థలంలో ఇల్లు నిర్మాణాకి నిధులు అందజేయనున్నారు. జిల్లాలో సుమారుగా 2 లక్షల ఇల్లులేని పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు, నిర్మాణాలు చేయనున్నారు. ఇందుకుగాను రాష్ట్ర బడ్జెట్లో రూ.8.615 కోట్లును కేటాయించారు. ఈ బడ్జెట్లో వారిలో స్వంత ఇల్లు కల నెరవేనుంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా 300 చదరపు అడుగుల వరకు గల గృహాలక సంబంధించి పట్టణ గృహనిర్మాణ లబ్దిదారుల రుణాలను మాఫీ చేసేందుకు ఈ బడ్జెట్లో పొందుపర్చారు. వైఎస్ఆర్ పింఛను కానుక ద్వారా 60 ఏళ్లు దాటిని వృద్దులకు పింఛను అందజేయనున్నారు. జిల్లాలో కొత్తగా 46 వేల పింఛన్లు రానున్నాయి. గత అయిదేళ్లతో పోల్చితే పింఛను మూడు రెట్లు పెరిగింది. కిడ్నీ రోగులకు, దీర్ఘకాలిక రోగులకు నెలకు రూ. 10 వేలు, అలాగే వికలాంగులకు ’3 వేలు అందిస్తున్నారు. ప్రస్తుతం వివిధ రకాల పింఛనుదార్లు 3,25,785 మంది ఉన్నారు. వీరి సంఖ్య పెరగనుంది. ఈ ఏడాది బడ్జెట్లో రూ. 15746 కోట్లు కేటాయించారు. వైఎస్ఆర్ కళ్యాణ కానుక పథకం కింద బీసీ కులాలకు చెందిన వధువుకి రూ. 50 వేలు, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వధువుకి రూ.లక్ష అందజేస్తారు. గతం కంటే ఈ కానుకను రెట్టింపు చేయడంతో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రయోజనమిలా.. వైఎస్సార్ రైతు భరోసా : 5 లక్షల మందికి జగనన్న అమ్మ ఒడి : 3.20 లక్షల మందికి వైఎస్సార్పెన్షన్ కానుక : 3.26 లక్షల మందికి మత్స్యకారులకు నిషేధభృతి : 9,162 మందికి ఊరట పొందనున్న అగ్రి గోల్డ్ బాధితులు : 2 లక్షల మంది వైఎస్సార్ ఆసరా : 5.46 లక్షల మందికి వైఎస్సార్ గృహ వసతి : 2 లక్షలమందికి పాదయాత్ర హామీలకు కట్టుబడిన బడ్జెట్ ప్రతిపక్ష నాయకునిగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి సమస్యలను గుర్తించి అన్ని వర్గాల వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కట్టుబడి బడ్జెట్ రూపకల్పన చేసినట్లు స్పష్టమైంది. ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చే గుణం ఉన్న వైఎస్ కుటుంబం మాట తప్పకుండా ఉండేలా బడ్జెట్ రూపకల్పన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చి కేటాయి ంపులు జరిగితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఆయన కుమారుడు జగన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధార జీవనాలు ఎక్కువ. వ్యవసాయం, రైతులు, పేదలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. – ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం శాసనసభ్యుడు -
‘పోలీసులు ఏం చేయాలో కూడా చంద్రబాబు చెబుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి పట్ల ఆ పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి చెందిన ప్రధాన నాయకుడిని హత్య చేశారని అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి గురించి రాష్ట్రానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి సీఎం సోదరుడిగా, రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ జీవితం గడిపేవారని గుర్తుచేశారు. వైఎస్ వివేకానందరెడ్డికి శత్రువులు లేరని తెలిపారు. అలాంటి వైఎస్ వివేకానందరెడ్డిని అతి దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి వ్యాపార లావాదేవీలు, గొడవలు లేని వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిందేవరో అందరికి తెలుసునని వ్యాఖ్యానించారు. (సరిగ్గా 14 ఏళ్ల క్రితం..) ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘హత్య జరిగిన తర్వాత పోలీసులు ఏం చేయాలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తారు. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చాక కూడా పోలీసులు చేయాల్సిన విచారణ కూడా చంద్రబాబు చేస్తున్నారు. విచారణ పేరిట సిట్లు ఏర్పాటు చేస్తు డిపార్ట్మెంట్ను భ్రష్టు పట్టిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా చేశారు. ముఖ్యమంత్రి ఫినిష్ చేస్తామనే మాటలు మాట్లాడుతారు.. అలా అంటే రాజకీయంగా ఫినిష్ చేస్తారనుకుంటామే కానీ మనుషులనే మాయం చేస్తాడనుకోలేదు. దివంగత మహానేత వైఎస్సార్ కుటుంబాన్ని ఫినిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా సీబీఐ విచారణ జరిపించాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో హత్యాయత్నం జరిగితే దానిని చంద్రబాబు, మంత్రులు హేళన చేశారు. చంద్రబాబు తాను అధికారంలో లేనప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరతారు.. కానీ తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి సీబీఐ రావద్దంటార’ని మండిపడ్డారు. (వైఎస్ వివేకా దారుణ హత్య...) -
‘నీయంత ఘనుడు మరెవ్వరూ లేరయ’
సాక్షి, అమరావతి: ఉద్యోగాలు లేక తీవ్రవాదం వైపు వెళ్తున్న యువకులను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అడ్డుకున్నాయని వైస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలు కార్పొరేట్ వైద్యం కలలో కూడా ఊహించి ఉండరని, పేద ప్రజలు ఇప్పుడు దర్జాగా వైద్యం పొందుతున్నారని అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశారని విమర్శించారు. ఐదు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి.. ఎన్నికలు సమీపిస్తున్నందున పసుపు కుంకుమ పేరుతో కేవలం మూడువేలు పంచుతున్నారని మండిపడ్డారు. మహిళలను ఈ విధంగా మోసం చేసిన ఘనుడు చంద్రబాబు ఒక్కడేనని ఎద్దేవా చేశాడు. ఏపీకి అత్యధిక నిధులు ఇచ్చింది మోదీయే అని గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు మోసం చేశారని మాటమార్చడంలో ఆంతర్యమేమిటని ధర్మాన ప్రశ్నించారు. కేంద్రంపై ధర్మపోరాటం పేరిట వైజాగ్‌లో దీక్షలు చేస్తే ఏం వస్తుందని, చంద్రబాబు అవినీతి పరుడుని సాక్షాత్తు దేశ ప్రధానే చెప్పారంటే ఇంక ఆయను ఎవ్వరూ నమ్మరని పేర్కొన్నారు. -
మాయల పకీరు చంద్రబాబు
మోసపూరిత వాగ్దానాలతోగద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ మాయల పకీరుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపేర్కొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని బూత్ కన్వీనర్లకునిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తణుకు: మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూ మాయల పకీరుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లకు శుక్రవారం ప్రత్యేక శిక్షణ తరగతులు జరిగాయి. వీటికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక పద్మశ్రీ ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ శిక్షణ తరగతులు పార్టీ రాష్ట్ర రాజకీయ మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ కమిటీలదేనన్నారు. కార్యకర్తలు పార్టీకి పునాది లాంటి వారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్ర ప్రజలకు భరోసా కల్పించిందని గుర్తు చేశారు. ఇప్పుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్ర మరోసారి భరోసా కల్పించే దిశగా కదులుతోందన్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నైజాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు రాజధాని పేరుతో ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల మధ్య ఉంటున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు ఖూనీచేస్తున్నారని దుయ్యబట్టారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బూత్‌స్థాయి కమిటీ సభ్యులు ప్రజలతో మమేకం కావాలన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆయా పోలింగ్ బూత్‌ల పరి«ధిలో ఓటరు జాబితాపై అవగాహన చేసుకోవాలన్నారు. ఇటీవలి కాలంలో అధికార పార్టీ నాయకులు ఓట్లు తొలగిస్తున్న విషయాన్ని గుర్తెరగాలని చెప్పారు. తొలగించిన ఓట్లు స్థానంలో ఓటర్లను తిరిగి చేర్పించేందుకు బూత్ కన్వీనర్లు సహాయపడాలని సూచించారు. మోసమే చంద్రబాబు విజన్ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే, రాజకీయ సలహామండలి సభ్యులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడమే చంద్రబాబుకు ఉన్న విజన్ అన్నారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ప్రత్యేక హోదా డిమాండ్‌తో కేంద్రంపై పోరాడుతున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని అన్ని పార్టీల నాయకులు అనుసరిస్తున్నారని అన్నారు. బీజేపీతో పోరాటం అంటూనే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబు నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు నివాళులు అర్పించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులు గుర్రాల నాగేంద్రకు సమావేశం నివాళులు అర్పించింది. కొద్దిసేపు మౌనం పాటించి సంతాపం తెలి పింది. శిక్షణ తరగతుల్లో బూత్ కన్వీనర్లకు సర్టిఫి కెట్లు బహూకరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు, తూర్పుగోదావరి జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పట్టణ అధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, పైబోయిన సత్యనారా యణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, నాయకులు నార్గన సత్యనారాయణ, కౌరు వెంకటేశ్వర్లు, మ ద్దాల నాగేశ్వరరావు, ఆకుల కిరణ్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ప్రతి ఒక్కరిని కలుస్తారు: ధర్మాన
అమరావతి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'అన్నొస్తున్నాడు' కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్సీపీ ప్రకటించిన తొమ్మిది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 'నవ్యాంధ్రకు నవరత్నాలు' పేరుతో రూపొందించిన పోస్టర్‌ను పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, సజ్జల రామకృష్ణారెడ్డి,భూమన కరుణాకర్ రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను తెలియ చెప్పడానికి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నొస్తున్నాడు పేరుతో పాదయాత్ర త్వరలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రీనరీ సమావేశాల్లో ప్రకటించిన తొమ్మిది హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కరపత్రాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపడమే ప్రతిపక్షం బాధ్యత అని, చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు చేరవేస్తామన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన తొమ్మిది హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 10 నుంచి 25 వరకూ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ వర్ధంతి, సెప్టెంబర్ 2నుంచి అక్టోబర్ 7వరకూ ప్రతిఇంటికి నవ్యాంధ్ర నవరత్నాలు కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఒక్కరినీ కలుస్తారని ధర్మాన తెలిపారు. -
రేపు చెన్నైకి వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ ఆదివారం చెన్నై వెళ్లనుంది. పాలంబూరులోని సదావర్తి సత్రం భూములను కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు. ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీ సభ్యు లు చైన్నై వెళ్లనున్నారు. ఇప్పటికే అమరావతి వెళ్లి సదావర్తి సత్రాన్ని వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ పరిశీలించిన విషయం తెలిసిందే. -
బాబు వైఖరితో అధోగతిలోకి రాష్ట్రం
♦ హెచ్చరించిన వైఎస్సార్సీపీ నేత ధర్మాన ♦ అభివృద్ధి అంతా అమరావతిలోనే అనడం సరికాదు ♦ {పజల్లో అసంతృప్తి, విభజనకు బీజాలు వేస్తున్నారు ♦ పెద్ద రాజధాని పేరుతో భ్రమలు కల్పించొద్దు ♦ హైదరాబాద్ ఉదంతం పునరావృతం కానీయొద్దు సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరించే విధానంతో భవిష్యత్‌లో వెనుకబడిన ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతాయని, ఆ పరిస్థితి మరిన్ని అనర్థాలకు దారి తీస్తుందన్నారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 60 ఏళ్లు పాటు ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ చేజారి పోయిన ఉదంతం నుంచి చంద్రబాబు గుణ పాఠం నేర్చుకోవడంలేదన్నారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి సేకరించిన 33,500 ఎకరాలకు తోడు, అటవీ భూములను డీనోటిఫై చేయడం, భూసేకరణ చట్టం ప్రయోగించి రైతుల నుంచి తీసుకోవడం ద్వారా మొత్తం 60 నుంచి 70 వేల ఎకరాల్లో పెద్ద రాజధాని వస్తోందనే భావన ప్రజల్లో కల్పిస్తున్నారని చెప్పారు. అసలు అంత పెద్ద రాజధాని ఎందుకు? దేశంలోకానీ, ప్రపంచంలోకానీ పెద్ద రాజధానుల వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాజధాని అంశాలపై అధ్యయనం చేసే పార్టీ కమిటీకి అధ్యక్షుని హోదాలో తాను ఇందుకు సంబంధించిన విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించానని చెప్పారు. చంద్రబాబు ఇపుడు అనుసరిస్తున్న వ్యూహం వల్ల వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు భవిష్యత్తులో దశాబ్దాల పాటు అభివృద్ధి చెందకుండా ఉండిపోతాయనే భావన ప్రజల్లో కలుగుతుందని ధర్మాన అభిప్రాయపడ్డారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం 12 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇస్తే అన్నీ వాటిని అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం దారుణమన్నారు. జిల్లాకొక సంస్థ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. వెనుకబడిన శ్రీకాకుళం వాసులుగాని, రాయలసీమలోని ఒక జిల్లా వారు గాని తమకూ ఒక కేంద్రీయ సంస్థ కావాలని కోరుకుంటారు కదా అని ధర్మాన అన్నారు. హైదరాబాద్ అనుభవం ఏది? హెచ్ఎంటీ, బీడీఎల్, మిథాని, రక్షణ సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల అక్కడే ఉపాధి అవకాశాలు పెరిగాయని, అందువల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆయన వివరించారు. దీంతో ఉపాధి కోసం హైదరాబాద్ వైపు చూడ్డం వల్ల ఊళ్ల నుంచి వలసలు పెరిగిపోయాయన్నారు. ఈ విషయం చంద్రబాబుతో సహా అందరూ చూశామన్నారు. అలాంటి నగరాన్ని కోల్పోయామనే ఆవేదన విభజన తర్వాత కూడా 13 జిల్లాల ప్రజల్లో ఉందని ధర్మాన చెప్పారు. అభివృద్ధి వెనుకబడి పోయింది 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. మళ్లీ 2000 సంవత్సరంలో అభివృద్ధి చెందిన తెలంగాణ ఫలాలు తమకే దక్కాలనే నినాదంతో ఉద్యమం వచ్చిందనే విషయం గుర్తించాలన్నారు. పలు రాష్ట్రాలు కేంద్రం తమకిచ్చిన సంస్థలను ఒక్క రాజధానిలోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లో సైతం నెలకొల్పాయని, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే సంస్థలు పెట్టడం వల్ల మిగతా 13 జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇపుడు చంద్రబాబు చేస్తున్న పని వల్ల మళ్లీ తమ ప్రాంతాలు అభివృద్ధి చెందవేమోనన్న అనుమానాలు పలు జిల్లాల ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. అభివృద్ధి అంతా రాజధానిలోనే కేంద్రీకరిస్తే రాష్ట్ర ప్రజల్లో మరో విభజన ఆలోచన కొన్ని సంవత్సరాల తర్వాతైనా వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అది విజ్ఞత కాదు.. ‘నైన్ ఇన్ ఒన్’ (ఒకే చోట తొమ్మిది అంశాల కేంద్రీకరణ) అనే పేరుతో పరిశ్రమలు, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, ఆరోగ్యం, వినోదం వంటివన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేస్తామని చెప్పడం విజ్ఞత గల రాజకీయవేత్తలు చేసే పనికాదని ధర్మాన అన్నారు. పెద్ద రాజధాని అనేది చక్రవర్తులు నిర్మించుకునేదని, అభివృద్ధికి మంచి పాలనే ఉండాలి తప్ప రాజధాని ఎంత పెద్దదనేది కొలమానం కాదన్నారు. ప్రైవేటు పెట్టుబడిదారులు ఊరికే తమ నిధులు వెచ్చించరని, వారు నిర్మించబోయే అమరావతిలోకి ఎంట్రీ ఫీజు మొదలు కారు నడిపినందుకు, పార్కింగ్, చివరకు టాయిలెట్ వినియోగించుకున్నందుకు కూడా ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. పౌర సేవలకు ఫీజులు చెల్లించే నగరం నిజంగా పేదల రాజధాని అవుతుందా? అంటూ ప్రశ్నించారు. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించే విధానానికి చంద్రబాబు స్వస్తి చెప్పాలన్నారు. మిగతా ప్రాంతాలు అన్యాయానికి గురికాకుండా చూడాలని, భవిష్యత్తులో విభజన ఉద్యమాలు రాకుండా విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన చెప్పారు. తర్వాత ప్రభుత్వాలు కూడా సరిదిద్దలేని తప్పు చంద్రబాబు చేస్తున్నారని ధర్మాన పేర్కొన్నారు. తాను చెప్పిన విషయాల్లో రాజకీయ ఉద్దేశ్యాలు లేవని, తీవ్రమైన ఆవేదనతోనే చెబుతున్నానన్నారు. -
'ఏపీ కేబినెట్ భజనబృందంలా మారింది'
-
'ఏపీ కేబినెట్ భజనబృందంలా మారింది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులు భజనబృందంగా మారారని, వాస్తవాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. గత ఏడాది కాలంగా ఆంధ్రప్రజలు నిరాశలో మునిగిపోయారని అన్నారు. డ్వాక్రా వ్యవస్థను కుప్పకూల్చిన ఘనత టీడీపీ సర్కార్‌దేనని ధర్మాన ఆరోపించారు. రుణమాఫీ చేస్తామన్న అబద్ధ వాగ్ధానంతో లక్షలాది డ్వాక్రా సంఘాలు మూలనపడ్డాయని చెప్పారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులేమైనా తీసుకువచ్చారా అని ధర్మాన ప్రశ్నించారు.