అద్దెకు తీసుకుని అమ్మేశాడు..
జీడిమెట్ల: కార్లను లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం బాలానగర్ డీసీపీ సురేష్‌కుమార్, ఏసీపీ హన్మంతరావు, జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ, డీఐ అంజయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అప్పరి విశ్వ పణీంద్ర గాజులరామారం దేవేందర్‌నగర్‌లో ఉంటూ చివకల రమణ, రెడ్డి వెంకటేశ్‌లతో కలిసి వీవీఅర్ ట్రావెల్స్ పేరిట సంస్థను ఏర్పాటు చేశాడు. అతను జగద్గిరిగుట్టకు చెందిన శశిధర్ వద్ద 2024 అక్టోబర్‌లో నెలకు రూ. 23 వేలు చెల్లించేలా లీజు ప్రాతిపదికన కారును అద్దెకు తీసుకున్నాడు. రెండు నెలలు సక్రమంగా అద్దె చెల్లించిన తర్వాత అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన శశిధర్ అతడి కార్యాలయం వద్దకు వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో పరిసర ప్రాంతాల్లో విచారించగా అతను ఇదే తరహాలో మరికొందరిని మోసం చేసినట్లు తెలిసింది. శశిధర్ జగద్గిరిగుట్ట పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు విశ్వపణీంద్రను అదుపులోకి తీసుకున్నారు.
32 కార్లు అమ్మేశాడు..
విశ్వపణీంద్ర ఇదే తరహాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 32 కార్లను అద్దెకు తీసుకుని విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. 28 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడికి సహకరించిన రమణ, సత్యనారాయణ, వెంకటేష్‌ల కోసం గాలిస్తున్నారు. నిందితుడు విశ్వపణీంద్రను గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట ఇన్‌స్పెక్టర్ నర్సింహ, డీఐ ఎం.అంజయ్య, ఎస్సై శంకర్, ఎఎస్సై రమణ, హెడ్‌కానిస్టేబుళ్లు అంజిబాబు, పురందాస్, కానిస్టేబుళ్లు నరేష్‌కుమార్, చిరంజీవి, నరేష్‌లను డీసీపీ అభినందించి రివార్డులను అందజేశారు.
ఘరానా మోసగాడి అరెస్ట్
రూ.2.5 కోట్ల విలువైన 28 కార్లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment