
పట్టుకుంటారా.. తప్పిస్తారా?
మొయినాబాద్: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన కోడి పందేల కేసులో అసలు సూత్రధారులు తప్పించుకు తిరుగుతున్నారు. పారిపోయి పది రోజులు దాటినా ఇంత వరకూ దొరకలేదు. వారిని అటునుంచి అటే తప్పించే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టలో ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 11న పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వస్తుండగా ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు దాడి చేసి పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కోడి పందేల నిర్వాహకుడు శివకుమార్ వర్మ(గబ్బర్‌సింగ్)తోపాటు 64 మందిని పోలీసులు పట్టుకోగా మరికొంత మంది ప్రహరీ దూకి పారిపోయిన విషయం విదితమే. అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో కోడి పందేల నిర్వహణకు అసలు సూత్రధారి అయిన వ్యక్తి అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే అతను పారిపోయి తప్పించుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు తెలిసినా అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. పందెం రాయుళ్ల వద్ద రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చూపిన పోలీసులు.. ఆ రోజు రూ.కోట్లలో డబ్బులను మాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికై నా కేసుతో సంబంధం ఉన్న వారిని పట్టుకుంటారా..? వదిలేస్తారా వేచి చూడాల్సిందే.
దొరకని కోడి పందేల సూత్రధారులు
పది రోజులు దాటినా అదే పరిస్థితి
పోలీసుల వ్యవహారంపై సర్వత్రా ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment