ఎల్‌ఆర్
భూముల క్రమబద్ధీకరణకు సర్కారు పచ్చజెండా
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియ మళ్లీ కదలిక మొదలైంది. మార్చి 31లోగా స్థలాను క్రమబద్ధీకరించుకున్న వారికి ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దరఖాస్తు దారుల్లో ఆశలు చిగురించాయి. క్రమబద్ధీకరణకు ఆయా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగాలకు క్యూ కడుతున్నారు. తమ దరఖాస్తులను క్లియర్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మెజార్టీ పురపాలికల్లో దరఖాస్తుల నిష్పత్తి మేరకు సిబ్బంది లేక పోవడం ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా.. జిల్లా వ్యాప్తంగా అందిన మొత్తం దరఖాస్తుల్లో 35,837 దరఖాస్తులు నిషేధిత జాబితా భూములకు సంబంధించినవి కావడం గమనార్హం. 111 జీఓ కారణంగా ఒక్క శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనే 9,860 దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం విశేషం. వీటి ఆమోదం కోసం అధికారులపై రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయి.
పెండింగ్‌లో మెజార్టీ దరఖాస్తులు
ఖాళీ ప్లాట్లు/ లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం గత ప్రభుత్వం 2020లో నోటిఫికేషన్ జారీ చేసింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుకు రూ.పది వేలు, ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.వెయ్యి ఫీజుగా నిర్ణయించింది. ఆ మేరకు హెచ్‌ఎండీఏ పరిధి నాలుగు జోన్లలో 3,58,464 దరఖాస్తులు రాగా, రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్ల నుంచి 2,38,263 దరఖాస్తులు అందాయి. వీటి క్లియరెన్స్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో.. ఈ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకబృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో మున్సిపాలిటీకి రెండు మూడు బృందాలను నియమించారు. నిజానికి మూ డు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కులగణన, ఇతర కారణాలతో పరిశీలన ప్రక్రియ కొంత నెమ్మదించింది. ప్రభుత్వ తాజా రాయితీ ప్రకటనతో దస్త్రాల క్లియరెన్స్‌లో కదలిక మొదలైంది.
మండల కేంద్రాల్లో దరఖాస్తులు ఇలా
మండలం దరఖాస్తులు
ఫరూఖ్‌నగర్ 22,051
కేశంపేట్ 10,200
తలకొండపల్లి 2,323
యాచారం 4,464
కడ్తాల్ 3513
కొందుర్గు 1505
ఆమనగల్లు 929
మాడ్గుల 708
జిల్లెడు చౌదరిగూడెం 683
మంచాల 54
Comments
Please login to add a commentAdd a comment