
మత్తులో వాహనాలు నడిపితే చర్యలు
చేవెళ్ల: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ బాలాజీ హెచ్చరించారు. చేవెళ్ల మండల పరిధి పామెన బస్‌స్టేజీ సమీపంలో శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీసీ వాహనదారులకు అవగాహన కల్పించారు. మత్తులో వాహనాలు నడిపితే.. వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో నమ్ముకున్న వారి గురించి ఆలోచించుకోవాలని సూచించారు. క్షేమంగా ఇంటికి తిరగి వస్తారని ఇంటి వద్ద తల్లిదండ్రులు, భార్య పిల్లలు, కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తుంటారని, వారి ఆశలను మీ నిర్లక్ష్యం వలన అడియాశలు చేయరాదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తమకు తాముగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలనే ఆలోచన రావాలని, అలా చేస్తే.. ప్రమాదాలను అరికట్టవచ్చిన స్పష్టంచేశారు. స్పెషల్ డ్రైవ్‌లో అన్ని వాహనాలను తనిఖీ చేశామని, ఆర్టీసీ బస్ డ్రైవర్లను పరీక్షించామని తెలిపారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 24 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, 12 ద్విచక్ర వాహనాలు, 12 కార్లు సీజ్ చేశామనివెల్లడించారు.
రాజేంద్రనగర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ బాలాజీ
చేవెళ్లలో డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్
Comments
Please login to add a commentAdd a comment