
ఈక్వెస్ట్రియన్ జాతీయ అర్హత పోటీలు
శంకర్‌పల్లి: ఈక్వెస్ట్రియన్ జాతీయ అర్హత పోటీలు నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. టోర్నీకి శంకర్‌పల్లి మండలం జన్వాడలోని నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ వేదిక కానుంది. పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్హత పోటీల్లో అండర్–11,14,18 విభాగాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననుండగా.. మూడు రకాల పోటీలు పోలో, షో జంపింగ్, డ్రెసాజ్‌లు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో అర్హత సాధించిన వారికి, దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే జాతీయ జూనియర్ ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్ షిప్ పోటీలకుఎంపిక కానున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఏర్పాట్లు పూర్తి
నాసర్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ జాతీయ అర్హత పోటీలకు ఆతిథ్యమివ్వడం ఆనందంగా ఉందని క్లబ్ సీఈఓ మీర్ హఫీజుద్దీన్ అహ్మద్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
నేటి నుంచి జన్వాడ పోలో క్లబ్‌లో టోర్నీ
Comments
Please login to add a commentAdd a comment