సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో గురువారం వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బహిరంగ సభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, ఉమా శంకర్ గణేష్, గొల్ల బాబూరావు, అడీప్ రాజు, ఎమ్మెల్సీ కళ్యాణి, విశాఖ డెయిరీ చైర్మెన్ అడారి ఆనంద్. తదితరులు హాజరయ్యారు.
ఎంపీ సత్యవతి పాయింట్స్
►పేదరికం నుంచి బయట పడడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ ప్రవేశ పెట్టారు.
►సీఎం జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు.
►ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.
►వచ్చే ఎన్నికల్లో 175 కు 175 వైఎస్సార్సీపీ సాధిస్తుంది.
బూడి ముత్యాల నాయుడు పాయింట్స్
►ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు.
►పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అందిస్తున్నారు.
►ముడు వంతుల్లో రెండు వంతులు బడుగు బలహీన వర్గాలు స్థానం కల్పించారు.
►కీలకమైన పదవులు బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు.
►నాడు నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారు.
►కార్పొరేట్ స్కూల్‌కు ధీటుగా ప్రభుత్వ పాటశాలను మార్చారు.
►ఇంగ్లీష్ మీడియంను అలీబాబా 40 దొంగలు హేళన చేశారు.
►చంద్రబాబు, గంటా, అయ్యన్న, బండారు మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి.
►పేదలు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవ కూడదు అంటా.
►ఇంగ్లీష్ మీడియం చదువులు లేక గతంలో ఎంతో మంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయారు.
►దివంగత నేత ఫీజ్ రియంబర్స్ మెంట్ వలన పేదల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు.
►బడుగు బలహీనర్గాలకు సీఎం జగన్ పాలనలో న్యాయం జరిగింది.
మంత్రి ధర్మాన ప్రసాదరావు పాయింట్స్
►స్వాతంత్ర్యం తరువాత చాలామంది పేదలకు న్యాయం జరగలేదు.
►కొన్ని వర్గాలు మాత్రమే సంతోషంగా ఉన్నారు.
►దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు.
►సీఎం జగన్ పథకాలపై విమర్శలు చేసిన వారు నేడు ప్రశంసిస్తున్నారు.
►సీఎం జగన్ పథకాలను చంద్రబాబు కాఫీ కొట్టారు
►ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేశారా?
►రైతు డ్వాక్రా రుణా మాఫీ చేశారా?
►ఇచ్చిన హామీల్లో ఒకదాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదు.
►అధికారం కోసమే చంద్రబాబు హామీలు ఇచ్చారు.
►పేద వారు తమ అవసరాలు కోసం కోర్టులకు వెళ్ళలేరు.
► పాలకులు ప్రజలు కష్టాలు తెలుసుకొని పాలన చేయాలి.
►దేశానికి ఆదర్శంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారు.
►సమాజంలో అంతరాలను తగ్గించడం వంటివి సైకోలు చేస్తారా లోకేష్.
►ఒక రోడ్డు, ఒక బిల్డింగ్ వేస్తే అభివృద్ధి కాదు.
►ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంచడం నిజమైన అభవృద్ధి.
►టీడీపీ జెండా కట్టిన వారికే పథకాలు ఇచ్చారు.
►సీఎం జగన్ పాలన పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాల అమలు చేస్తున్నారు.
►సీఎం జగన్ ఒక రూపాయి అవినీతి లేకుండా పాలన చేస్తున్నారు.
►చంద్రబాబు కూడా అవినీతి జరిగిందని చెప్పలేక పోతున్నారు.
►గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు.
►కంటి ఆపరేషన్ కోసం బెయిల్ ఇస్తే న్యాయం గెలిసింది అని టిడిపి నేతలు సంబరాలు జరుపుకున్నారు.
►271 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు.
►అన్ని ఆధారాలు తోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు.
►చంద్రబాబు నిజాయితీ పరుడు అయితే కోర్టులో నిరూపించుకోవాలి.
►టీడీపీ పాలనలో నాయకుల అకౌంట్‌లోకి డబ్బులు వెళ్తాయి.
►సీఎం జగన్ పాలనలో పేదల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి.
►ఎన్నికలు ముందు మయ మాటలతో చంద్రబాబు ప్రజలు ముందుకు వస్తారు
రాజన్న దొర డిప్యూటీ సీఎం
►మనకు మంచి ఎవరు చేస్తున్నారో గుర్తు పెట్టుకోవాలి.
►పేదలు కోసం సీఎం జగన్ పని చేస్తున్నారు.
►టీడీపీ నాయకుల మయ మాటల ఎవరు నమ్మొద్దు.
►బలహీన వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు.
►సమాజాన్ని సమ సమాజంగా సీఎం జగన్ మార్చారు.
►గిరిజనులు కోసం 20 వేల కోట్ల కర్చు చేశారు.
►పేదలు పక్ష పాతి సీఎం జగన్
►బురద మా మీద జల్లలని చూస్తే పందుల్లా మీదే బురద పడుతుంది.
మంత్రి గుడివాడ అమర్నాథ్ పాయింట్స్
►సామాజిక న్యాయానికి ముత్యాల నాయుడే ఒక ఉదాహరణ.
►రాజకీయాలలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సీఎం జగన్, ముత్యాల నాయుడిని పక్కన పెట్టుకున్నారు.
►సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
►దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారు.
►2 లక్షల 40 వేల కోట్లు ప్రజల ఖాతాల్లో ఏ నాయకుడు వేయలేదు.
►కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు.
►మళ్ళీ 28 రోజుల తరువాత జైలుకు వెళ్లాల్సిందే.
►ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన సీఎం జగన్ సింగిల్‌గానే పోటీ చేస్తారు.
►చంద్రబాబుకు 1000 కోట్ల చేతి కర్ర పవన్ రూపంలో దొరికింది.
Comments
Please login to add a commentAdd a comment