
సాక్షి, అమరావతి: ఉద్యోగాలు లేక తీవ్రవాదం వైపు వెళ్తున్న యువకులను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అడ్డుకున్నాయని వైస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలు కార్పొరేట్ వైద్యం కలలో కూడా ఊహించి ఉండరని, పేద ప్రజలు ఇప్పుడు దర్జాగా వైద్యం పొందుతున్నారని అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశారని విమర్శించారు. ఐదు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి.. ఎన్నికలు సమీపిస్తున్నందున పసుపు కుంకుమ పేరుతో కేవలం మూడువేలు పంచుతున్నారని మండిపడ్డారు.
మహిళలను ఈ విధంగా మోసం చేసిన ఘనుడు చంద్రబాబు ఒక్కడేనని ఎద్దేవా చేశాడు. ఏపీకి అత్యధిక నిధులు ఇచ్చింది మోదీయే అని గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు మోసం చేశారని మాటమార్చడంలో ఆంతర్యమేమిటని ధర్మాన ప్రశ్నించారు. కేంద్రంపై ధర్మపోరాటం పేరిట వైజాగ్‌లో దీక్షలు చేస్తే ఏం వస్తుందని, చంద్రబాబు అవినీతి పరుడుని సాక్షాత్తు దేశ ప్రధానే చెప్పారంటే ఇంక ఆయను ఎవ్వరూ నమ్మరని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment