రాణిపేట బెల్ పరిశ్రమతో నరువి ఆసుపత్రి ఒప్పందం
వేలూరు: వేలూరు పట్టణంలో ప్రారంభించిన నరువి ఆసుపత్రి రోగులకు ప్రపంచ స్థాయిలో ఉన్నత వైద్య సేవలను అందజేస్తుంది. ఈ ఆసుపత్రి ఇప్పటికే ఎల్‌ఐసీ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు చికిత్స అందజేసేందుకు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా రాణిపేటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బెల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పదవీ విరమణ పొందిన కార్మికులు నరువి ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు అవసరమైన ఒప్పందాన్ని బెల్ పరిశ్రమ అధికారులు చేసుకున్నారు. ముందుగా నరువి ఆసుపత్రి చైర్మన్ జీవీ సంపత్, బెల్ పరిశ్రమ కార్యనిర్వహణ డైరెక్టర్ అరుణ్‌మొయి దేవన్ కీలక పత్రాల్లో సంతకాలు చేశారు. ఇందులో బెల్ పరిశ్రమ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బాబు, బెల్ పరిశ్రమ డాక్టర్ అదుల్ టికా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment