వినోద పన్ను తగ్గించండి
● కమలహాసన్
సాక్షి, చైన్నె: వినోద పన్నును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సినీ నటుడు కమలహాసన్ ప్రభుత్వాన్ని కోరారు. చైన్నెలో శుక్రవారం సినిమా అభివృద్ధి, వివాదాలు వంటి అంశాలపై జరిగిన కార్యక్రమానికి కమలహాసన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. ఈసందర్భంగా కమల్ మాట్లాడుతూ భారత దేశ సంస్కృతిలో ఒక అంబాసిడర్‌గా సినిమా ఉందన్నారు. భారత సినిమాకు భవిష్యత్ కార్యాచరణ అవశ్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొత్త సాంకేతికలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని నేర్చుకునేందుకు సినిమా విభాగంలో ఐటీఐలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కొత్త రెవెన్యూ మార్గాలుగా ఓటీటీలు ఉన్నాయని పేర్కొంటూ, వినోద పన్నును తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సాయంత్రం ఆళ్వార్‌పేటలో కమల్‌మక్కల్ నీది మయ్యం పార్టీ వేడుక జరిగింది. పార్టీ ఆవిర్భవించి 8 వసంతాలు కావడంతో బ్రహ్మాండ వేడుకను నిర్వహించారు. విదేశీ పర్యటన చాలా కాలం తర్వాత పార్టీ వర్గాలు, కేడర్‌తో మమేకం అయ్యే విధంగా కమల్ కార్యక్రమానికి హాజ రయ్యారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, బలోపేతం గురించి చర్చించారు. సంక్షేమ పథకాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment